రాష్ట్రీయం

ధర్మ రక్షణే లోక రక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 25: ధర్మాన్ని మనం రక్షించినప్పుడే ధర్మం మనల్ని కాపాడుతుందని కంచికామకోటి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి అన్నారు. భక్తి టీవీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న కోటి దీపోత్సవ కార్యక్రమం 11వ రోజు బుధవారం అంగరంగంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జయేంద్ర సరస్వతి భక్తులనుద్దేశించి అనుగ్రహ భాషణ చేసారు. ధర్మరక్షణ ద్వారానే లోకరక్షణ జరుగుతుందని అన్నారు. ధార్మిక పనులు ఎక్కువగా చేయడంతో లోకానికి శాంతి కలుగుతుందని అన్నారు. శంకరం టీవీ పేరుతో కంచి పీఠం భక్తి కార్యక్రమాలు తమిళ, కన్నడ భాషలలో ప్రసారాలు అవుతున్నాయని, తెలుగులో కూడా వాటిని ప్రసారం చేయడానికి అన్ని సన్నాహాలు చేస్తున్నామని, శంకరం టీవీని తెలుగులో ప్రసారం చేయడానికి ఎన్‌టీవీ అధినేత నరేంద్రచౌదరి సహకరించాలని కోరారు. ఎన్టీఆర్ స్టేడియంలో ఇంతమంది భక్తులను చూడడం ఎంతో సంతోషం కలిగించిందన్నారు. ధార్మిక సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జీవితాన్ని ధన్యం చేసుకోవాలని అన్నారు.
ఆధ్యాత్మికవేత్త జొన్నవిత్తుల రామలింగేశ్వరావు మాట్లాడుతూ భారతదేశంలో సంస్కృతి, సంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేసేందుకు భక్తి టీవీ చేపట్టే కార్యక్రమాలు అభినందనీయమన్నారు. కోటి దీపోత్సవ కార్యక్రమానికి ఎంతో విశిష్టత ఉందని తెలిపారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి, జ్ఞాన ప్రసూనాంబిక అమ్మవార్ల దివ్య కల్యాణ మహాత్సవం అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. వేదిక ప్రాంగణంలోని శివ లింగానికి శివాష్టోత్తర శతనామావళితో కోటి బిల్వార్చన నిర్వహించారు. నందివాహనంపై శ్రీ కాళహస్తీశ్వరస్వామి, జ్ఞాన ప్రసూనాంబిక అమ్మవార్ల ఊరేగింపు, జ్వాలా తోరణం మహోత్సవం కన్నుల పండువగా సాగాయి.

ఇంటర్‌లో హాజరు మినహాయింపు
ఫీజు చెల్లింపు గడువు డిసెంబర్ 12
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, నవంబర్ 25: వచ్చే ఏడాది మార్చిలో జరిగే ఇంటర్మీడియట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు హాజరు తక్కువగా ఉంటే అందుకు అవసరమైన ఫీజును చెల్లించి హాజరు నుంచి మినహాయింపుపొందేందుకు డిసెంబర్ 19 చివరి తేదీగా తెలంగాణ ఇంటర్‌బోర్డు కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్ మొదటి, రెండవ సంవత్సరం విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. డిసెంబర్ 19వ తేదీలోగా రూ.500 అపరాధ రుసుము చెల్లించి హాజరు మినహాయిపు పొందవచ్చని ఇంటర్ బోర్డు కార్యదర్శి స్పష్టం చేశారు.
కెసిఆర్ వ్యవహార శైలిని బట్టే వ్యవహరిస్తాం
టిడిపి ఎమ్మెల్యేలు రేవంత్, వివేకా, గోపినాథ్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, నవంబర్ 25: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు శైలిని బట్టే తమ శైలి ఉంటుందని టి.టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ తన చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయని ఆరోపిస్తున్నారని, దూషణలకు దిగుతున్నారని ఆయన బుధవారం విలేఖరుల సమావేశంలో తెలిపారు. గత 14 సంవత్సరాలుగా కెసిఆర్ పోషించిన పాత్రనే తామూ పోషిస్తున్నామని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ తన వ్యవహారాశైలిని మార్చుకోవాలని అన్నారు. తమ పార్టీ నాయకులను టిఆర్‌ఎస్ ఎంపీలు, ఇతర నాయకులు ఇష్టం వచ్చిన విధంగా విమర్శిస్తున్నారని ఆయన తెలిపారు. కెసిఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మూడు ఎన్నికలు జరిగాయని అన్నారు. శాసనమండలి ఎన్నికల్లో టిడిపి-బిజెపి అభ్యర్థి రాంచందర్ రావుకు ప్రజలు పట్టం కట్టి, టిఆర్‌ఎస్ అభ్యర్థి దేవీప్రసాద్‌ను చిత్తుగా ఓడించారని ఆయన తెలిపారు. ఆ తర్వాత 9 ఎంపిటిసీ స్థానాలకు ఎన్నికలు జరిగితే టిఆర్‌ఎస్ నాలుగు స్థానాలను, టిడిపి నాలుగు స్థానాలను, ఒకటి కాంగ్రెస్ గెలుపొందిందని ఆయన గుర్తు చేశారు. ఆదిలాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే కోవ లక్ష్మీ కుమార్తె సర్పంచ్‌గా పోటీ చేసి టిడిపి చేతిలో ఘోరంగా ఓడిపోయారని ఆయన తెలిపారు. దేవిప్రసాద్ ఓడిపోయినప్పుడు ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు.ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మాట్లాడుతూ హైదరాబాద్‌లో ఫ్లెక్సీలు కనపడరాదని గతంలో నీతులు చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయించారని విమర్శించారు. ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ మాట్లాడుతూ వరంగల్ ఉప ఎన్నికల్లో విజయం సాధించినంత మాత్రాన గ్రేటర్ ఎన్నికల్లోనూ విజయం సాధిస్తామని టిఆర్‌ఎస్ భావించడం విడ్డూరంగా ఉందని అన్నారు.
వైకాపా వైఖరి మార్చుకోవాలి
టిడిపి అధికార ప్రతినిధి అనురాధ
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, నవంబర్ 25: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై లేనిపోని ఆరోపణలు చేస్తున్న వైకాపా తన వైఖరిని మార్చుకోవాలని టిడిపి అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ పేర్కొన్నారు. తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం గురించి వైకాపా నేతలు పసలేని ఆరోపణలు చేస్తున్నారని వాటిని వెనక్కు తీసుకోవాలని అన్నారు. రాష్ట్ర ప్రజల స్వరాన్ని ఎంపి పదవి కోసం, పిసిసి పీఠం కోసం బొత్స కుటుంబం బేరం పెట్టారని అన్నారు.