రాష్ట్రీయం

‘రవాణా’లో ప్రైవేటీకరణ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమండ్రి, డిసెంబర్ 23: రవాణాశాఖలో ప్రయివేటీకరణ ఆందోళన మొదలయింది. వచ్చే ఏడాది నుండి రవాణాశాఖలోని వివిధ సేవలను ప్రయివేటు సంస్థలకు అప్పగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్న సమాచారంతో రవాణా శాఖలోని అధికారులు, సిబ్బందితో పాటు మోటారు వాహనాల యజమానులు కూడా ఆందోళనకు గురవుతున్నారు. రవాణా శాఖ సుమారు 58రకాల సేవలను అందిస్తుంది. ఈ సేవలన్నింటినీ ప్రయివేటీకరిస్తే ఇక తమ ఉనికి ఉండదని, ఇప్పటి వరకు ఉన్న గౌరవంగానీ, ప్రజలకు జవాబుదారీతనంతో అందుతున్న సేవలుగానీ ఉండవని రవాణాశాఖ సిబ్బంది ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. నాన్ ట్రాన్స్‌పోర్టు వాహనాలు అంటే మోటారు సైకిళ్లు, కార్లు వంటి వాహనాలను రిజిస్ట్రేషన్ చేసే బాధ్యతను డీలర్లకే అప్పగించాలని రవాణా శాఖ భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీనివల్ల రవాణా శాఖ సిబ్బంది, అధికారుల కన్నా ప్రజలే ముందుగా నష్టపోతారు. మోటారు సైకిల్ లేదా కారు కొనుగోలు చేసినపుడు ప్రస్తుతం డీలర్లే తాత్కాలిక రిజిస్ట్రేషన్ చేస్తున్న సంగతి విదితమే. తాత్కాలిక రిజిస్ట్రేషన్‌కు నామమాత్రంగానే ఫీజు ఉంటుంది. కానీ రకరకాల కారణాలు చూపించి కొంత మంది డీలర్లు వేలల్లోనే వసూలుచేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో డీలర్లకే పూర్తిస్థాయి రిజిస్ట్రేషన్ అధికారాలను అప్పగిస్తే మోటారు వాహనాలు, కార్లు కొనుక్కునే వారి పరిస్థితి ఎలా ఉంటుందో అర్ధంచేసుకోవచ్చు.
రిజిస్ట్రేషన్ల సమయంలోనే వాహనాలకు నంబరు కేటాయిస్తారు. ప్రయివేటు డీలర్లకే రిజిస్ట్రేషన్ల అధికారాన్ని కట్టబెడితే, నంబర్లు కేటాయింపులో తీవ్ర గందరగోళం తలెత్తుతుంది. ఫ్యాన్సీ నంబర్లను కేటాయించేందుకు ప్రస్తుతం రవాణాశాఖ అనుసరిస్తున్న నంబర్ల వేలం, అదనపు ఫీజులు తదితర మార్గాల్లో రవాణాశాఖకు ఏటా సుమారు రూ.75కోట్లు ఆదాయం వస్తున్నట్టు అంచనా. రిజిస్ట్రేషన్లను ప్రయివేటు సంస్థలకు అప్పగించటం వల్ల ఈ ఆదాయాన్ని కోల్పోవటంతో పాటు, నంబర్ల కేటాయింపు ఇష్టారాజ్యంగా సాగే ప్రమాదం ఉంది.
ఇతర సేవలతో పాటు డ్రెవింగ్ లైసెన్సులు మంజూరు, రెన్యువల్ వంటి వాటిని ప్రయివేటు సంస్థలకు అప్పగిస్తే, వీటిని వినియోగించుకుని తీవ్రవాదులు ఆంధ్రప్రదేశ్‌ను అడ్డాగా మార్చుకునే ప్రమాదం ఏర్పడుతుంది. కెవైసిలో డ్రైవింగ్ లైసెన్సు కూడా ఒక ముఖ్యమైన ఆధారంగా పరిగణిస్తున్న నేపథ్యంలో డ్రెవింగ్ లైసెన్సులు, రిజిస్ట్రేషన్ వంటి వాటిని ప్రయివేటీకరిస్తే ఇక శాంతి భద్రతలకు గ్యారంటీ ఉండదన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇప్పుడున్న విధానానికి స్వస్తి చెప్పి డ్రైవింగ్ లైసెన్సులను ప్రయివేటీకరిస్తే, లెసెన్సు ఫీజు పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం డ్రైవింగ్ లైసెన్సు ఫీజు రూ.525. దీనినే ప్రయివేటీకరిస్తే రూ.800 నుండి రూ.900వరకు పెరగవచ్చని తెలుస్తోంది. ఫైనాన్స్‌పై మోటారు సైకిల్ లేదా కారు కొనుగోలుచేస్తున్న వారు ప్రస్తుతం ఉన్న విధానంలోనే చాలా నష్టపోతున్నారు. అలాంటిది రిజిస్ట్రేషన్లను ప్రయివేటీకరిస్తే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది.
రవాణాశాఖ సేవలను ప్రయివేటీకరించటం వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోవటంతో పాటు, తాము కూడా నష్టపోతామని, ఉద్యోగ భద్రత ఉండదని, ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం తగ్గిపోతుందని రవాణాశాఖ ఉద్యోగులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. రవాణాశాఖ సేవలను ప్రయివేటీకరిస్తే మాత్రం తిరుగుబాటు చేసేందుకు ఉద్యోగులు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఈనెల 27న విజయవాడలో రాష్టస్థ్రాయి సమావేశం నిర్వహించి, భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకోవాలని ఉద్యోగులు భావిస్తున్నారు.