రాష్ట్రీయం

‘రైల్ రోకో’తోనే పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమండ్రి, డిసెంబర్ 23: కోనసీమ రైల్వే ప్రాజెక్టు సాధనకు హౌరా-చెన్నై మార్గంలో ఐదు రోజుల పాటు రైళ్ల రాకపోకలను స్తంభింపజేయాలని, అప్పుడే ప్రభుత్వం దిగి వస్తుందని మాజీ ఎంపి జివి హర్షకుమార్ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో బుధవారం ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ రైళ్ల స్తంభనకు ప్రస్తుత ఎంపిలు నాయకత్వం వహిస్తే, తాను కూడా ఉద్యమంలో పాల్గొంటానన్నారు. కోనసీమ రైల్వే ప్రాజెక్టుకు ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన జిఎంలు, అధికారులు అడ్డుపడుతున్నారని విమర్శించారు. దివంగత లోక్‌సభ స్పీకర్ జిఎంసి బాలయోగి హయాంలో 1999లో కోనసీమ రైల్వే ప్రాజెక్టుకు రూ.650కోట్లతో అంచనాలు రూపొందించారని, తాను ఎంపిగా ఉన్న సమయంలో అంచనాలను పునఃసమీక్షింపజేసి రూ.1055 కోట్లతో రూపొందింపజేశానన్నారు. ఇందులో 25శాతం వాటాను రాష్ట్ర ప్రభుత్వం భరించేలా కూడా ఒప్పించానన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో ప్రాజెక్టును ప్రారంభింపజేయడానికి రూ. 50కోట్లు మంజూరు చేయించడానికి కూడా సంసిద్ధత వ్యక్తంచేశానని, మరో రూ.50కోట్లు కేటాయించి పనులను ప్రారంభింపజేయాలని కోరగా, రైల్వే అధికారులు మాత్రం ఆసక్తి చూపించలేదని వివరించారు. ఎపి అసెంబ్లీ సమావేశాలపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, వారి ఆశలన్నీ అడియాశలయ్యాయని ధ్వజమెత్తారు. తెలుగుదేశం ప్రభుత్వం పథకం ప్రకారం కాల్‌మనీ మినహా మిగిలిన అంశాలు చర్చకు రాకుండా అడ్డుకుందని ఆరోపించారు. కేవలం వైఎస్సార్‌సిపి ఎమ్మెల్యే రోజాను లక్ష్యంగా చేసుకుని అసెంబ్లీలో టిడిపి దళిత ఎమ్మెల్యేలు వ్యవహరించారన్నారు. టిడిపి దళిత ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును పొగడ్తల్లో ముంచెత్తి దళితుల ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టారని ధ్వజమెత్తారు. రైతు రుణమాఫీ, ఆరోగ్యశ్రీ, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ వంటి ఎన్నో ప్రజాసమస్యలు ఉన్నా అసెంబ్లీలో చర్చకు రాలేదన్నారు. టిడిపి పాలన చాలా దారుణంగా ఉందన్నారు. రైతుల భూములతో టిడిపి వ్యాపారం చేస్తోందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం కార్పొరేట్లు, పారిశ్రామికవేత్తలకు తొత్తుగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ప్రజాసమస్యలను గాలికి వదిలేసి గత పదేళ్లలో పారిశ్రామిక సంస్థలకు విడుదల చేయాల్సిన రూ. 2400కోట్ల రాయితీలను విడుదల చేసిందన్నారు. ఈవ్యవహారంలో 50శాతం వాటా ముడుపులు ప్రభుత్వ పెద్దలు జేబులో వేసుకున్నారని హర్షకుమార్ ఆరోపించారు.