రాష్ట్రీయం

పండగకే పరిమితం.. తర్వాత నిర్లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, డిసెంబర్ 23: నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట కేంద్రంగా ప్రతి ఏటా జనవరిలో సూళ్ళూరుపేటలో ఫ్లెమింగో ఫెస్టివల్ పేరిట పక్షుల పండగను ప్రభుత్వం నిర్వహిస్తోంది. ప్రభుత్వం రాష్ట్ర పండుగుగా గుర్తించి పక్షుల పండుగ నిర్వహిస్తోంది. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా పక్షులకు పండుగ చేయరు. కానీ నెల్లూరు జిల్లాలో చేస్తుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఏటా 300 రకాల విదేశీ పక్షులు పులికాట్ సరస్సులోకి వచ్చి సంతానోత్పత్తి చేసుకుని వెళుతుంటాయి. అక్టోబరు నుండి మార్చి వరకు ఇక్కడే ఉండి పునరుత్పత్తి చేసుకుని అనంతరం తమ దేశాలకు వెళుతుంటాయి. కొన్ని వేల కిలోమీటర్లు నుండి అరుదైన పక్షులు వస్తుంటాయి. దొరవారిసత్రం మండలంలోని నేలపట్టు వద్ద పక్షలు కేంద్రం ఉంది. పులికాట్ సరస్సులో మత్య్ససంపద ఎక్కువగా ఉండటంతో పక్షలు ఇక్కడ విడిది చేస్తాయి. ఈ ఏడాది పులికాట్‌లో నీరు లేకపోవటంతో ఈ పక్షులు ఆలస్యంగా వచ్చాయి. పక్షుల పండుగ సమయంలో అధికారులు, మంత్రులు, సెలబ్రిటీలు ఇక్కడికి క్యూ కడతారు. లెక్కలేనన్ని హామీలు ఇస్తారు. తర్వాత ఆ ఊసే ఉండదు. పులికాట్‌లో కనీసం తాగేందుకు మంచి నీరు కూడా ఉండదు. రోడ్డు సౌకర్యం అంతంత మాత్రమే. పక్షులు ఉండుటకు కనీసం ఏర్పాట్లు కూడా చేయరు. గతంతో పోలీస్తే పక్షలు ఇక్కడికి రావటం తగ్గుముఖం పట్టినట్లు పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. 2010లో అప్పటి కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ తన కుటుంబంతో కలిసి పులికాట్‌కు వెళ్ళారు. ఆ సమయంలో వేళాలి పక్షులు, అరుదైన పక్షులు ఆయన కంట పడ్డాయి. ఇంత భారీగా పక్షులు ఎక్కడా రావని, తానింతవరకు చూడలేదని ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పక్షుల పండుగకు శ్రీకారం చుట్టారు. మెదట్లో ఇక్కడ శాస్రవేత్తలతో సెమినార్‌లు నిర్వహించేవారు. కాలక్రమేణ శాస్రవేత్తల సూచలను అధికారులు పట్టించుకోకపోవటంతో వారు రావటం మానేశారు.
ప్రకృతి రమణీయతకు, జీవ వైవిధ్యానికి నెలవైన పులికాట్ సరస్సుకు ముప్పు పొంచి ఉంది. దేశంలో రెండో అతి పెద్దదైన ఈ ఉప్పునీటి సరస్సుకు ఆంధ్ర ప్రదేశ్‌లో ముఖద్వారాలు ప్రస్తుతం పూర్తిగా మూసుకుపోయి ఉన్నాయి. ఈ సరస్సుకు మూడు ముఖ ద్వారాలు ఉన్నాయి. రాష్ట్రంలో రెండు, తమిళనాడులో ఒకటి. పక్క రాష్ట్రంలో ముఖ ద్వారం బాగానే ఉంది. రాష్ట్రంలో మాత్రం మూసుకుపోయి ఉన్నాయి. సముద్రపు నీరు సరస్సులోకి వచ్చే అవకాశం లేదు. దీంతో ఎప్పుడూ కళకళలాడాల్సిన సరస్సు నీరు లేక వెల వెల బోతోంది. జనవరి,్ఫబ్రవరి నెలల్లో మాత్రం కాస్త నీరుంటుంది. తర్వాత ఎండి పోతుంది. ముఖ ద్వారాలు బాగుంటే నీరు పుష్పలంగా ఉంటుంది. వేల ఎకరాలు ఆక్రమణలు, అడవుల నరికివేత, పరిశ్రమల కాలుష్యంతో ఈ సరస్పు క్రమేణా విదేశాల పక్షలకు దూరవౌతోంది. పులికాట్ సరస్సు ఆంధ్ర ప్రదేశ్‌లో 600 మీటర్లు, తమిళనాడులో 120 కిలోమీటర్లు విస్తరించి ఉంది. సరస్సుపై ఆధారపడి రాష్ట్రంలో 22వేల మంది, పక్క రాష్ట్రంలో మరో 10వేల మంది జీవిస్తున్నారు.
నెల్లూరు జిల్లాలో కొండూరుపాళెం ముఖద్వారం ద్వారం 10 సంత్సరాల క్రితం పూడిపోయింది. రాయదుర్గం వద్ద ఇసుకమేటలు వేసి ఉంది. తమిళనాడులో పలమనేరు కాలువ వద్ద మాత్రమే ఆ రాష్ట్ర ప్రభుత్వం రక్షణ చర్యలు తీసుకుంటుండటంతో కనీసం రెండు నెలలైన పులికాట్ జలకళలాడుతుంది. ముఖద్వారాలు పూడికతీస్తామని ప్రభుత్వం చెబుతూనే ఉంది. ఇంత వరకు చర్యలు తీసుకోలేదు. ఇదే విధంగా ఉంటే భావితరాలకు పులికాట్ మ్యాప్‌లో మాత్రమే చూపించకతప్పదు.
శ్రీ హరికోట అంతరిక్ష కేంద్రం పులికాట్ సరస్సు మధ్యలో దీవిలాగా ఉంటుంది. సరస్సులో మధ్యలో నుండి రోడ్డు నిర్మాణం చేపట్టటంతో ఆటుపోటులు తీవ్ర రూపం చూపాయని చెప్పవచ్చు. ఇదే విధంగా వేనాడు, పేర్నాడు దీవులకు సైతం రోడ్డు వేయటంతో ఆటుపోటులు నిలిచిపోయి. ముఖ ద్వారాలు పూడిపోయాయి. గతంలో ఐదు అడుగుల లోతు ఉన్న పులికాట్ నేడు 2 అడుగులు మాత్రమే ఉండటం ఆందోళన కలిగిస్తుంది. చుట్టూ ఉన్న అడవులను నరికివేస్తున్నారు. పలుచోట్ల ఆక్రమించి రొయ్యలు గుంతలు సాగు చేస్తున్నారు. పులికాట్ జీవ వైవిధ్యాన్ని కోల్పోతుండటంతో కొన్ని పక్షి జాతులు క్రమంగా అంతరించిపోతున్నాయి. గ్లోబల్ నేచురల్ ఫండ్ 2010లోనే పులికాట్ ప్రమాదంలో ఉన్న సరస్సుగా ప్రకటించింది. అయినప్పటికీ ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదు. సరస్సు దక్షణభాగంలో 2వేల రకాల వృక్ష ,జంతుజాలాలు ఉన్నాయి. వీటి పరిరక్షణకు ప్రభుత్వం నడుంబిగించకపోతే భవిష్యత్ తరాలకు చెప్పడానికేమీ మిగలదనడంలో అతిశయోక్తిలేదు.

ఎసిబి వలలో ఆర్‌అండ్‌బి డిఇ
కర్నూలు, డిసెంబర్ 23: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఆర్‌అండ్‌బి డిఇగా పనిచేస్తున్న శంకర్‌రెడ్డిని ఎసిబి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆదాయానికి మంచి ఆస్తులున్నట్లు అందిన సమాచారం మేరకు బుధవారం కర్నూలు నగరంలోని చాణిక్యపురికాలనీలో ఉన్న ఆయన ఇంటిపై ఎసిబి అధికారులు దాడులు జరిపారు. శంకర్‌రెడ్డి, ఆయన భార్య, తండ్రి పేర బ్యాంకుల్లో ఉన్న రూ.67 లక్షలు, శంకర్‌రెడ్డి భార్య పేర ఉన్న విలువైన ఇంటిపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం రూ.3 కోట్లు ఉంటుందని ఎసిబి డిఎస్పీ మాబాష తెలిపారు. దాడులు జరిగిన సమయంలో శంకర్‌రెడ్డి ఎమ్మిగనూరులో విధి నిర్వహణలో ఉన్నారు. బ్యాంకుల్లో ఉన్న బంగారం, విలువైన పత్రాలను కోర్టుకు సమర్పించినట్లు తెలిపారు.