రాష్ట్రీయం

మహిళా టీచర్ల జాతీయ సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 20: సమస్యలపై పోరుకు జాతీయ స్థాయిలో మహిళా టీచర్లంతా ఒకే వేదికపైకి రాబోతున్నారు. జాతీయ స్థాయిలో 16 రాష్ట్రాల నుండి 20 సంస్థలకు చెందిన 500 మంది మహిళా టీచర్ల ప్రతినిధులు, వందలాది సభ్యులు హైదరాబాద్‌లో ఈనెల 22 నుండి నిర్వహించబోయే జాతీయ సమ్మేళనంలో పాల్గొనబోతున్నారు. ఈ సందర్భంగా ప్రాథమిక స్థాయి నుండి యూనివర్శిటీల వరకూ విద్యాసంస్థల్లో బోధిస్తున్న మహిళా టీచర్ల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం సావిత్రీబాయి ఫూలే నగర్‌లో నిర్వహించే ఈ సమ్మేళనానికి విస్తృతస్థాయి ఏర్పాట్లు చేసినట్టు ఎస్‌టిఎఫ్‌ఐ నేతలు అలుగుబెల్లి నర్సిరెడ్డి, చావ రవి చెప్పారు. మహిళా టీచర్ల పాత్ర ఎంతో కీలకమని, నానాటికీ దిగజారుతున్న ప్రభుత్వ విద్యను అభివృద్ధి చేసుకోవడంతో పాటు వారి సమస్యల పరిష్కారంపై ప్రత్యేకించి చర్చించి జాతీయ స్థాయిలో కార్యాచరణను ఈ సమ్మేళనంలో రూపొందిస్తారు. ఇదే సందర్భంగా తొలిసారి మహిళా ఉపాధ్యాయుల జాతీయ వేదిక కూడా రూపుదిద్దుకోనుంది. ఆదివారం జాతీయ సమ్మేళనాన్ని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి శ్రీహరి ప్రారంభిస్తారు.