రాష్ట్రీయం

మళ్లీ చైన్ స్నాచింగ్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 23: హైదరాబాద్‌లో చైన్ స్నాచర్లు మళ్లీ రెచ్చిపోతున్నారు. నగర శివారుల్లో గత మూడు రోజుల్లో ఆరు చైన్ స్నాచింగ్‌లు జరిగాయి. బుధవారం రాజేంద్రనగర్ పరిధిలోని లక్ష్మీనగర్‌కు చెందిన లక్ష్మీబాయి అనే మహిళ తన ఇంటి ముందు పూలు కోస్తుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలోని ఆరు తులాల బంగారు గొలుసును లాక్కెళ్లారు. అలాగే చంపాపేట్ పరిధిలోని సూర్యోదయ కాలనీకి చెందిన మణెమ్మ అనే వృద్ధురాలు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని సమీపంలోని ఆలయానికి వెళ్తుండగా గుర్తుతెలియని ఇద్దరు దుండగులు బైక్‌పై వచ్చి ఆరు తులాల బంగారు గొలుసును లాక్కెళ్లారు. మీర్‌పేట్ పోలీసు స్టేషన్ పరిధిలో నడిచి వెళ్తున్న లావణ్య అనే మహిళ మెడలోని నాలుగు తులాల గొలుసును దుండగులు లాక్కుపోయారు.
ఇరానీ ముఠా అరెస్టు
మరోవైపు చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న బిహార్‌కు చెందిన ఇరానీ ముఠాను సైబరాబాద్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వారి నుంచి దాదాపు రూ. 2.5కోట్ల విలువగల బంగారు నగలతోపాటు కొంత నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఉప్పల్, మల్కాజ్‌గిరి, మేడిపల్లిలో కూడా గొలుసు దొంగతనాలు జరిగాయి. దీంతో ఇరానీ గ్యాంగ్ ముఠా పట్టుబడిందని, ఇకపై జంటనగరాల్లో చైన్ స్నాచింగ్‌లు జరగవని భావిస్తున్న పోలీసులు బుధవారం తాజాగా మళ్లీ చైన్ స్నాచింగ్‌లు జరుగడంతో పోలీసులకు సవాల్‌గా మారింది. ఈ విషయమై సైబరాబాద్ కమిషనర్ సివి అనంద్ మాట్లాడుతూ సైబరాబాద్‌లో మళ్లీ చైన్ స్నాచింగ్‌లు మొదలయ్యాయని, ప్రత్యేక బృందాలు దుండగులను గాలిస్తున్నాయని చెప్పారు. గత కొంతకాలంగా ప్రత్యేక పోలీసు నిఘాతో చైన్ స్నాచింగ్‌లు జరగలేదని, గతం కంటే పోలిస్తే 90శాతం చైన్ స్నాచింగ్‌లు తగ్గాయని పేర్కొన్నారు.