రాష్ట్రీయం

రోజా వ్యాఖ్యల టేపులు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 23: వైకాపా ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో ఆత్మరక్షణలో పడిన తెలుగుదేశం పార్టీ... శాసనసభ తీసుకున్న నిర్ణయం సమంజసమైనదనే వాదనను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. మరోవైపు రోజా బహిరంగ క్షమాపణ చెబితే ఈ వ్యవహారానికి ముగింపు పలికే అవకాశాన్ని పరిశీలిస్తామని కూడా తెలుగుదేశం పార్టీ నేతలు వైకాపాకు సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
కాగా సస్పెన్షన్ న్యాయసమ్మతం కాదని, స్పీకర్ నిర్ణయాన్ని న్యాయ స్థానంలో సవాల్ చేస్తామని వైకాపా నేతలు చెప్పడంతో నేరుగా సభలో రోజా ఏం మాట్లాడారో తెలియజేసే టేపులను టిడిపి బయటకు తీసుకువచ్చింది. ఒకవేళ నిజంగానే రోజా న్యాయస్థానాన్ని ఆశ్రయించే పక్షంలో తదుపరి చర్యలకు ఇబ్బంది అవుతుందని, న్యాయస్థానంలో విచారణలో ఉన్న సమయంలో శాసనసభ సైతం ఎలాంటి చర్యలూ తీసుకోలేని పరిస్థితి వస్తుందని నిపుణులు చెప్పడంతో, దానికి చెక్ పెట్టేందుకు రోజా శాసనసభలో చేసిన ప్రసంగాలు, వ్యాఖ్యల వీడియో, ఆడియో క్లిప్‌లను టిడిపి బయటపెట్టింది. కష్టం అనిపించినా ప్రజలకు వాస్తవాలు తెలియాలనే ఉద్దేశంతోనే శాసనసభ ఫుటేజీని బయటకు తెస్తున్నామని పార్టీ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు అన్నారు. సభలో జరిగిన ఘటనల ఫుటేజీ ఇమ్మని అడిగితే సభ మర్యాద పోతుందని స్పీకర్ పేర్కొన్నారని, అయితే ఈ అంశంపై అన్ని పార్టీల నేతలతో శాసనసభ కార్యదర్శి సమావేశంపెట్టి వారిని అడిగినపుడు వైకాపా ఎలాంటి సమాధానం చెప్పలేదని, దీంతో కార్యదర్శి టేపులను విడుదల చేశారని పేర్కొన్నారు. రోజా శాసనసభలో అసభ్యంగా మాట్లాడారని, ‘నన్ను చంపగలరా? రేప్ చేయగలరా? అయితే చంపాలి లేదా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలి...వళ్లు పెంచడమే కాదు బుద్ధి పెంచు అచ్చన్నా...రౌడీ స్పీకర్, ఫ్యాక్టనిస్టు స్పీకర్...కెమెరాలు పగిలిపోతాయి’ వంటి పలు అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని అన్నారని వివరించారు.
రోజాతోపాటు ఇతర వైకాపా ఎమ్మెల్యేలు సభలో చేసిన వ్యాఖ్యలు కూడా ఈ ఫుటేజీలో ఉన్నాయి. ‘్ధర్యం లేకుండా ఒక మహిళను...వాడొక మగాడు’ అంటూ రోజా అన్నారని, కొడాలి నాని మాట్లాడుతూ..‘ ఆ కెమెరాకు అడ్డం పెట్టండి...సస్పెండ్ అయితే అవుతాం...మీరు పెట్టండి’ అన్నారని, చెవిరెడ్డి మాట్లాడుతూ ‘సార్...విజయవాడలో అందరూ భయపడుతున్నారు సార్..చంద్రబాబు పెద్ద దొంగసార్..లోకేష్ బాబు పెద్ద దొంగ సార్..చంద్రబాబు అరడజను దొంగల్లాగ ఉన్నారు సార్..’ అన్నారని, అలాగే అచ్చెన్నాయుడును ఉద్దేశించి ‘ అచ్చా...లుచ్చా...’ అని చెవిరెడ్డి అన్నారని పేర్కొన్నారు. వైకాపా బృందం ఒక దశలో కామ సిఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారని, రోజా మాట్లాడుతూ చంద్రబాబు నిరంకుశ వైఖరి నశించాలి..కామ సిఎం డౌన్‌డౌన్..సెక్స్‌రాకెట్ సిఎం డౌన్ డౌన్ అన్నారని కాలవ శ్రీనివాసులు వివరించారు.
మరో పక్క రోజా అందరికీ బహిరంగ క్షమాపణ చెబితే వ్యవహారాన్ని ముగించవచ్చని భావించిన టిడిపి నేతలు ఈ మేరకు వైకాపా నేతలకు సందేశం పంపినట్టు విశ్వసనీయంగా తెలిసింది. అయితే తాము ఎలాంటి తప్పు చేయలేదని, అందరూ మాట్లాడుతున్న విషయాలనే తాము శాసనసభలో ప్రస్తావించామని వైకాపా నేతలు వాదిస్తున్నారు. కాల్‌మనీ వ్యవహారంలో వ్యభిచారానికి సంబంధించిన కేసులు ఉన్నాయి కదా ఆ విషయాలనే ప్రశ్నిస్తే తిరిగి తమపై ఎదురుదాడి చేయడం ఎమిటని వైకాపా నేతలు వాదిస్తున్నారు. రోజా సస్పెన్షన్ నేపథ్యంలో స్పీకర్‌పై వైకాపా అవిశ్వాస తీర్మానం ఇచ్చిన కొద్ది సేపటికే రోజాపై వీడియోక్లిప్పింగ్‌ల అస్త్రాన్ని టిడిపి ప్రయోగించింది. కాగా మరో పక్క తదుపరి చర్యలకు వైకాపా సన్నద్ధమవుతోంది.