రాష్ట్రీయం

ఆంధ్రప్రదేశ్‌లో రాక్షస పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 23: చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో రాక్షస పాలన చేస్తోందని, ప్రజావ్యతిరేక విధానాలపై అసెంబ్లీ లోపల, వెలుపల పోరాడుతామని వైకాపా అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రకటించారు. బుధవారం ఇక్కడ ఆయన లోటస్‌పాండ్‌లో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై అవిశ్వాస తీర్మానం ఇవ్వడం సమంజసమేనని, పిల్లినైనా గదిలో పెట్టి బంధిస్తే ఎదురు తిరుగుతుందని, తాము కూడా అంతేనని అన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు భూములను అక్రమంగా తన బంధువులకు కేటాయిస్తున్నారని ధ్వజమెత్తారు. టిడిపి ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ బంధువుకు కృష్ణా జిల్లా జగ్గయ్యపేట వద్ద 498 ఎకరాలను ఎకరం లక్ష రూపాయల చొప్పున కేటాయించారన్నారు. దీనివల్ల రాష్ట్ర ఖజనాకు రూ.250కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. గుంటూరు ఎంపి గల్లా జయదేవ్ కుటుంబానికి చిత్తూరు జిల్లా రేణిగుంట వద్ద 22.69 ఎకరాలను కేటాయించారని, ఎకరం భూమిని 2.5 లక్షల రూపాయలకు ఇచ్చారన్నారు. దీనివల్ల ఖజానాకు రూ. 45 కోట్ల నష్టం వచ్చిందన్నారు. లోకేష్‌కు గోదావరి జిల్లాల ఇసుక ర్యాంపులు, మాపియా నుంచి రోజుకు కోటి రూపాయలు అందుతున్నాయన్నారు. బాక్సైట్ గనుల తవ్వకాలకు సంబంధించి జీవో 97ను ఎందుకు రద్దు చేయలేదన్నారు. చంద్రబాబు 2011లో ఇదే జీవోను రద్దు చేయాలని గవర్నర్‌కు లేఖ రాశారన్నారు. గిరిజన చట్టాలను మార్చడానికి చంద్రబాబు ఏకంగా కేంద్రంపై వత్తిడి తెస్తున్నారన్నారు.
తమ పార్టీ ఎమ్మెల్యే ఆర్‌కె రోజాను అన్యాయంగా సభ నుంచి ఏడాది పాటు సస్పెండ్ చేశారన్నారు. విజయవాడ కాల్‌మనీ వ్యవహారంపై నిలదీస్తే, దీనిపై రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఫైనాన్స్ వ్యాపారులపై దాడులు చేసి విషయాన్ని సార్వత్రికం చేయడానికి చంద్రబాబు ప్రయత్నించారన్నారు. విజయవాడలో ముఖ్యమంత్రి ఆశీస్సులతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పోలీసులు భాగస్వాములై వడ్డీలు కట్టకపోతే వ్యభిచారం చేయమని మహిళలను వేధించారనే అభియోగాలు ఉన్నాయన్నారు. ఈ ఉదంతంపై అనేక వీడియో టేపులు దొరికాయన్నారు. రోజా కామ సిఎం అన్నారని గొడవ చేస్తున్నారని, కామ అంటే కాల్‌మనీ అని అర్ధమన్నారు.
అసెంబ్లీని కనీసం 15 రోజులు నిర్వహించకుండా ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించడమేంటన్నారు. పార్లమెంటును కనీసం 30 రోజులు నిర్వహిస్తారన్నారు. బలం ఉన్నా, చర్చ ద్వారా బిల్లు పాసు కావాలని జిఎస్‌టి బిల్లుపై కేంద్రంలోని ప్రభుత్వం ఆలోచిస్తుంటే, ఇక్కడ ప్రతిపక్షం లేకుండా చూసి ఎనిమిది బిల్లులను ఆమోదింపచేసుకున్నారన్నారు. ప్రైవేట్ వర్శిటీల బిల్లు అమలైతే రిజర్వేషన్లు ఉండవని, పేద విద్యార్ధులు చేరలేరన్నారు.