రాష్ట్రీయం

ఏపి అసెంబ్లీ నిరవధిక వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 22: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ, కౌన్సిల్ (ఉభయ సభలు) శీతాకాల సమావేశాలు మంగళవారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ నెల 17న ఉభయ సభలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. అసెంబ్లీలో ఐదు రోజుల్లో 26 గంటల ఎనిమిది నిమిషాల పాటు వివిధ అంశాలపై చర్చ జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు, కాల్‌మనీ, నీరు-ప్రగతి, బాక్సైట్ నిక్షేపాల తవ్వకాలు, ఇసుక అక్రమ రవాణాపై ప్రభుత్వం ప్రకటన చేసింది. తొలి మూడు రోజుల పాటు ప్రధాన ప్రతిపక్షం గొడవ కారణంగా, ప్రశ్నోత్తరాల సమయం జరగకుండానే సభ ఆమోదించినట్లు స్పీకర్ ప్రకటించారు. అంబేద్కర్‌పై చర్చ జరగకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సభకు అడ్డుపడుతున్నారని స్పీకర్ వారిని ఆ చర్చ ముగిసేంత వరకు సస్పెండ్ చేయగా, కాల్ మనీపై చర్చ జరుగుతున్నప్పుడు ఆ పార్టీ ఎమ్మెల్యే ఆర్‌కె రోజా అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆమెను ఏడాది పాటు సస్పెండ్ చేస్తూ సభ తీర్మానం ఆమోదించింది. రోజా సస్పెన్షన్‌ను నిరసిస్తూ ఆ పార్టీ ఎమ్మెల్యేలు చివరి రెండు రోజులు సభకు హాజరుకాలేదు.
పార్టీల బలబలాలు
టిడిపి-102, వైకాపా-67, బిజెపి-4, నవోదయ పార్టీ-1, ఇండిపెండెంట్-1.