రాష్ట్రీయం

సెట్‌టాప్ లేకుంటే ప్రసారాలు కట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, డిసెంబర్ 20: కేబుల్ టీవీ డిజిటలైజేషన్ ప్రక్రియను డిసెంబర్ 31వ తేదీలోగా పూర్తిచేయడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. గడువులోగా సెట్‌ఆప్ బాక్స్‌లను ఏర్పాటుచేసుకోని పక్షంలో కేబుల్ ప్రసారాలు నిలిపివేయాలని స్పష్టం చేసింది. జిల్లాల్లోని కేబుల్ ఆపరేటర్లు నిర్దేశిత గడువులోగా డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని, ఇందుకు మల్టీ సిస్టం ఆపరేటర్లు (ఎంఎస్‌ఒ), లోకల్ కేబుల్ ఆపరేటర్లతో మాట్లాడి డిజిటలైజేషన్‌ను నూరు శాతం పూర్తిచేసేలా చూడాలని అధికారులకు ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఫేజ్-2 కింద విశాఖపట్నంలో డిజటలైజేషన్ ఆఫ్ కేబుల్ నెట్‌వర్క్ ప్రక్రియ పూర్తయ్యింది.
ఫేజ్-3 కింద అన్ని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో ఈనెల 31వ తేదీలోగా ఈ ప్రక్రియను పూర్తిచేయాలని ప్రభుత్వం గడువు విధించింది. ఇందుకు అవసరమైన సెట్‌ఆప్ బాక్స్‌లను అందుబాటులో ఉంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. ఈ ప్రక్రియను సమీక్షించడానికి రాష్టస్థ్రాయిలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి (్భమి, విపత్తున నిర్వహణ శాఖ), జిల్లా స్థాయి సంయుక్త కలెక్టర్‌ను నోడల్ అధికారులుగా కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ నియమించింది. ఎంఎస్‌ఒలు, కేబుల్ ఆపరేటర్ల సమన్వయంతో ప్రతి ఇంటికి నాణ్యమైన టెలీవిజన్ ప్రసారాలను అందించడమే లక్ష్యంగా డిజిటలైజేషన్ ప్రక్రియను చేపట్టినట్టు ప్రభుత్వం పేర్కొంటోంది. ఈ డిజిటలైజేషన్ ప్రక్రియతో కేబుల్ టీవీల్లో బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యాన్ని ప్రతి ఇంటికి అందుబాటులోకి తేవడంతో పాటు అధిక సంఖ్యలో ఛానళ్ళను వీక్షించే సౌకర్యం అందుబాటులోకి వస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ కింద ఎంఎస్‌ఒలు తప్పనిసరిగా కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.డిజిటల్ ఇండియా ఎంఐబి.కామ్‌లో రిజిస్టర్ కావల్సి ఉంది. ఈ విధంగా రిజిస్టర్ అయిన కేబుల్ ఆపరేటర్లందరికీ అవసరమైన పాస్‌వర్డ్‌ను అందజేస్తారు. ఆయా ప్రాంతాల కేబుల్ ఆపరేటర్లు దీనిపై తమ పరిధిలోని వినియోగదారులకు అవగాహన కల్పించి, సెట్‌ఆప్ బాక్స్‌లు ఏర్పాటుచేసుకునేలా చూడాల్సి ఉంది.
కాగా 3వ ఫేజ్ క్రింద రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో సెట్‌ఆప్ బాక్స్‌లను ఏర్పాటుచేసుకునేలా ప్రజల్లో ప్రచారం నిర్వహించాలని ప్రభుత్వ యంత్రాంగం కేబుల్ ఆపరేటర్లకు సూచించింది. టీవీ స్క్రోలింగ్స్, ప్రత్యేక ప్రకటనల ద్వారా సెట్ ఆప్ బాక్స్‌ల ప్రాధాన్యతపై విస్తృత రీతిలో ప్రచారం ప్రారంభించారు. డిసెంబర్ 31వ తేదీలోగా సెట్‌ఆప్ బాక్స్‌లు ఏర్పాటుచేసుకోని పక్షంలో గడువు తేదీ తరువాత కేబుల్ ప్రసారాలు వీక్షించే అవకాశం ఉండదంటూ ప్రచారం చేస్తున్నారు. సెట్‌ఆప్ బాక్సుకు రూ.1200 నుండి రూ.1800 వరకూ వసూలుచేస్తున్నారు. గడువుకు మరో పది రోజులు మాత్రమే మిగిలివుండటంతో అదనపు ఖర్చుపై పేద వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అసలే సంక్రాంతి పండుగ ఖర్చు ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. ఈ దశలో మరో రూ.2000 వరకు భారాన్ని ఎలా మోసేదని ప్రశ్నిస్తున్నారు.

జిఎమ్‌ఆర్‌కు
ఉత్తమ ఎయిర్‌పోర్టు అవార్డు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 20: జిఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు లిమిటెడ్ (జిహెచ్‌ఐఎఎల్)కు ‘2015 భారత దేశ ఉత్తమ ఎయిర్‌పోర్టు’ అవార్డు లభించింది. జిఎంఆర్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మనీష్ సిన్హా ఈ అవార్డు స్వీకరించారు. ఏడాదికి 5 నుంచి 15 మిలియన్ల ప్రయాణికులను రవాణా చేసిన కేటగిరిలో ఈ అవార్డు లభించింది. జిఎంఆర్ సిఇఓ ఎస్‌జికె కిషోర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు ఈ అవార్డు లభించడం సంతోషంగా ఉందన్నారు. ఈ అవార్డును అందజేసిన ఎప్‌టెక్ ఏవియేషన్, హాస్పిటాలిటీ అకాడమీ తమ వార్షిక ఈవెంట్‌గా జరుపుకునే పనోరమ సందర్భంగా ఈ అవార్డును అందజేసినట్లు వెల్లడించారు. ఈ అవార్డుతో తమకు మరింత బాధ్యత పెరిగిందని, భవిష్యత్తులో ప్రయాణీకులకు ఇంకా మంచి సౌకర్యాలతో సేవలను విస్తత్రం చేస్తామని సిన్హా అన్నారు.

పోలీసుల కక్ష సాధింపుపై
న్యాయపోరాటం చేస్తా
సినీనటి తారాచౌదరి
విజయవాడ (క్రైం), డిసెంబర్ 20: తాను ఓ బాధితురాలినే తప్ప నిందితురాలిని మాత్రం కాదని, పోలీసులు తనపై ఎందుకు కక్ష సాధింపునకు పాల్పడుతున్నారో తెలియడం లేదని సినీనటి తారాచౌదరి అలియాస్ రాజేశ్వరి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఏం నేరం చేశానని విజయవాడ పోలీసులు తనపై రౌడీషీటు, పీడీ యాక్టు కేసులు నమోదు చేయాలనుకుంటున్నారని ప్రశ్నించారు. అదే నిజమైతే తాను న్యాయపోరాటం చేస్తానంటూ ప్రకటించారు. పలువురు ప్రముఖులపై శృంగార చిత్రాల బ్లాక్‌మెయిలర్ ఆరోపణలతో గతంలో హైదరాబాద్ నుంచి ప్రాచుర్యంలోకి వచ్చిన తారాచౌదరి కొద్దిరోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడలో హల్‌చల్ చేసిన విషయం తెలిసిందే. నగర శివారు సింగ్‌నగర్ పోలీస్టేషన్ పరిధిలోని శాంతినగర్‌లో అద్దెకుంటున్న అన్న, వదినలతో తారాచౌదరికి జరిగిన గొడవ దృష్ట్యా మహిళా పోలీసు కానిస్టేబుల్ జ్యోతిపై రగడకు దిగగా.. ఈమెపై రూరల్ పోలీసులు రెండు కేసులు నమోదు చేసి, అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ఇటీవల ఆమె జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. అయితే తారాచౌదరిపై పీడీ యాక్టు, రౌడీషీటు తెరుస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తాజాగా ఆదివారం సాయంత్రం గాంధీనగర్‌లోని తన న్యాయవాది విష్ణ్భుట్ల జయప్రకాష్‌తో కలిసి కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడారు. తనపై విజయవాడ పోలీసులు రౌడీషీటు తెరుస్తారని జరుగుతున్న ప్రచారంపై ఆమె మండిపడ్డారు. అంతటి నేరాలేమీ తాను చేయలేదని, గతంలో హైదరాబాద్‌లో బంజారాహిల్స్ పోలీస్టేషన్‌లో ఏసిపి శంకర్‌రెడ్డి అప్పట్లో అక్రమ కేసులు బనాయించారని, ఇప్పుడు తాజాగా విజయవాడ పోలీసులు కూడా కక్ష సాధింపు దిశగానే తన పట్ల వ్యవహరించి అరెస్టు చేశారని ఆరోపించారు.
తన సోదరుడు శ్రీనివాస్, వదినల మధ్య నెలకొన్న ఆస్తి సంబంధ వ్యవహారాల నేపథ్యంలోనే ఈ నెల 11న వదిన కవిత ఫిర్యాదు మేరకు నున్న పోలీసులు కేసులు బనాయించారన్నారు. ఆ సమయంలో తన పట్ల ఎస్‌ఐ శివప్రసాద్ అమానుషంగా వ్యవహరించారని, అర్ధరాత్రి నున్న శివారులోని నిర్మానుష్య రోడ్లలో వాహనంలో ఎక్కించి తిప్పారంటూ ఆరోపించారు. ఆ సమయంలో మహిళా కానిస్టేబుల్ జ్యోతి కూడా తనపై తప్పుడు కేసు బనాయించడం ద్వారా తనను అరెస్టు చేసి జైలుకు పంపారని, అంతకుమించి తనపై ఎలాంటి కేసులు, నేరారోపణలు లేవని వివరణ ఇచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత కొత్త రాజధాని విజయవాడలో స్థిరపడాలని అడుగుపెట్టడంతోనే తీరని అవమానం ఎదురైందన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం తనకు సంతోషమేనని, కానీ ఓ మహిళనైన తనకు ఇంత అన్యాయం జరగడం విచారకరమన్నారు. డిజిపి జెవి రాముడుపై అపారమైన గౌరవం ఉందని, ఆయన చాలా మంచివారని తాను చాలాచోట్ల విన్నానని, కానీ మహిళా పోలీస్టేషన్ ఏసిపి వెంకటేశ్వర నాయుడు వంటి కొందరు పోలీసులు మాత్రం తన పట్ల దారుణంగా వ్యవహరించారన్నారు. తాను న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు తారాచౌదరి తెలిపారు. తనపై అలాంటి నిర్ణయం పోలీసులకు ఉంటేకనుక పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేస్తూనే న్యాయపోరాటం కొనసాగిస్తానని చెప్పిన తారాచౌదరి వ్యాఖ్యలను ఆమె న్యాయవాది జయప్రకాష్ కూడా సమర్ధించారు.