రాష్ట్రీయం

ప్రశ్నార్థకంగా ప్రైవేటు రుణ వ్యవస్థ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, డిసెంబర్ 18: విజయవాడ కాల్‌మనీ దందా నేపథ్యంలో రాష్టవ్య్రాప్తంగా పోలీసులు జరుపుతున్న దాడులు మొత్తం ప్రైవేటు రుణ వ్యవస్థనే ప్రశ్నార్థకంగా మార్చేస్తోంది. వడ్డీ వ్యాపారం పేరుతో రక్తం పీల్చేస్తూ, ఆస్తులను స్వాధీనం చేసుకునే బడా వ్యక్తుల భరతం పట్టడం వరకూ ఎవరికీ అభ్యంతరం ఉండదు. అయితే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో చిన్నా చినతకా అవసరాలకు మానవతా దృక్పథంతో నామమాత్రపు వడ్డీకి అప్పులిచ్చే వారిని సైతం దాడుల పేరుతో వేధిస్తుండటంతో ఇకపై అత్యవసర పరిస్థితుల్లో కూడా పేద, మధ్యతరగతి వర్గాలకు అప్పు పుట్టే అవకాశం కనిపించడంలేదు. పోలీసు దాడులతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వడ్డీ వ్యాపారి అన్న ముద్ర ఉన్న ప్రతి ఒక్కరూ బతుకు జీవుడా అనుకుంటూ అండర్‌గ్రౌండ్‌కు వెళ్లిపోతున్నారు. ఈపరిణామాలు రానున్న రోజుల్లో ఎటు దారితీస్తాయోనన్న అందోళన కూడా అందరిలోనూ వ్యక్తమవుతోంది. వ్యవసాయ ప్రధానమైన ఈ జిల్లాల్లో ప్రతి సీజన్ తొలిదశలోనూ ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుంచే వ్యవసాయానికి కావాల్సిన రుణాలను తీసుకోవటం సర్వసాధారణం. రుణమాఫీ వ్యవహారం పూర్తికాక, బ్యాంకుల నుంచి పూర్తిగా రుణాలు అందని పరిస్థితి కూడా నెలకొంది. ఇలాంటి నేపథ్యంలో రైతాంగానికి కమిషన్‌దారులు, ప్రైవేటు వడ్డీవ్యాపారులే దిక్కుగా మారారని చెప్పకతప్పదు. వడ్డీల మాయాజాలం ఎలాఉన్నా అసలు వ్యవహారం ముందుకు సాగాలంటే ఎంతోకొంత అప్పు పుట్టకపోతే అడుగు వేయటం ఎలా అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. దాళ్వా సీజను ప్రారంభ దశలో జరుగుతున్న ఈ దాడులు సాగుపై ప్రభావం చూపుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ముందుగా సీజను ప్రారంభించుకోవాలని ఇప్పటికే అధికార్లు సూచన చేస్తుంటే, చేతిలో చిల్లిగవ్వ లేకుండా పనులు ఎలా ప్రారంభించగలమని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇక ప్రస్తుతం అన్నిస్థాయిల్లో వడ్డీవ్యాపారులు అజ్ఞాతంలోకి వెళ్లిపోతుండగా, జనానికి అవసరమైన సమయంలో రుణాలు అందించలేని పరిస్థితిలో బ్యాంకులు ఉన్నాయి. మరోవైపు ముద్ర పేరుతో కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పథకం ద్వారా చిన్న వ్యాపారులకు ఆశించిన రీతిలో రుణాలు కూడా అందని విషయం బహిరంగరహస్యమే. నిజంగా దారుణాలు చేస్తున్నవారిపై కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించటం సహేతుకమని, అలాకాకుండా ఏకమొత్తంగా దాడులు చేస్తూపోతే వ్యవసాయానికే కాకుండా సాధారణ అవసరాలకు, చిన్న వ్యాపారులకు అప్పులు పుట్టే అవకాశాలు ఉండవన్న ఆందోళన వ్యక్తమవుతోంది.