రాష్ట్రీయం

నరసింహ మాల ధరించిన గిరిజనులతో స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, డిసెంబర్ 18: చిరు వ్యాపారులకు కాల్‌మనీ వేధింపులు ఉండబోవని విశాఖ రేంజ్ డిఐజి రవిచంద్ర అన్నారు. ఫిర్యాదులు అందిన మేరకే విచారణలు జరిపి, వాస్తవాలు వెలికితీసి కేసులు నమోదు చేస్తామని, చిన్న వ్యాపారులను వేదింపులకు గురిచేయబోమని స్పష్టం చేశారు. శుక్రవారం శ్రీకాకుళం సమీపంలోని ఎచ్చెర్ల ఆర్మ్‌డ్ రిజర్వుడ్ పోలీసు మైదానంలో విలేఖరులతో మాట్లాడుతూ మూడు నుండి ఐదు లక్షల రూపాయల లోపు ఫైనాన్స్ చేస్తున్న వ్యాపారులను కాల్‌మనీ వ్యవహారంతో ముడిపెట్టబోమని చెప్పారు. జిల్లాలో ఎనిమిది కాల్‌మనీ కేసులు నమోదు అయినట్లు తెలిపారు. వీటిని ఎస్పీ ఖాన్ స్వయంగా విచారణ జరిపి వాస్తవాల ఆధారంగా కేసులు నమోదు చేస్తారని చెప్పారు. కాల్‌మనీ ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకే కాల్‌మనీ వ్యాపారులపై విచారణ సాగిస్తామన్నారు.

బలరాముడిగా
భద్రాద్రి రామయ్య
భద్రాచలం, డిసెంబర్ 18: ఖమ్మం జిల్లా భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా శ్రీ సీతారామచంద్రస్వామి శుక్రవారం బలరామావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. గర్భగుడిలో పూజలు నిర్వహించిన అనంతరం స్వామివారిని మేళతాళాలు, మంగళవాయిద్యాలు, కోలాటాల నడుమ ఊరేగింపుగా కల్యాణ మండపం వద్దకు తీసుకొచ్చారు. కల్యాణ మండప వేదిక వద్ద భక్తులకు స్వామివారి దర్శనభాగ్యం కల్పించారు. భారీగా తరలివచ్చిన భక్తులు బలరామావతారంలో రామయ్యను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

మరో మహిళను కాటేసిన ‘కాల్’నాగు

రాయచోటిలో హరీబున్నీసా ఆత్మహత్యాయత్నం

ఆంధ్రభూమి బ్యూరో
కడప,డిసెంబర్ 18: కడపజిల్లాలో కాల్‌మనీ మాఫియా మరో మహిళను కాటేసింది. రాయచోటి పట్టణం కొత్తపల్లెకు చెందిన ఆరీఫున్నీసా (35) కాల్‌మనీ వ్యాపారుస్తుడు హబీబుల్లాఖాన్ వేధింపులతో శుక్రవారం విషం తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఆమెను చికిత్సనిమిత్తం కడప రిమ్స్‌కు తరలించగా కొనఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. కాల్‌మనీ వ్యాపారి హబీబుల్లాఖాన్‌పై రాయచోటి పోలీసులు కేసు నమోదు చేశారు. మూడు సంవత్సరాల క్రితం ఆరిఫున్నీసా భర్త హబీబుల్లాఖాన్ వద్ద రూ.60వేలు అప్పు తీసుకున్నాడు. 2013లో ఆరిఫున్నీసా భర్త నెల్లూరులో రొట్టెల పండుగ నిమిత్తం వెళ్తుండగా రోడ్డుప్రమాదంలో మృతి చెందాడు. ఆరిఫున్నీసా భర్త జీవించి ఉన్న రోజుల్లో రూ.48వేలు అప్పు తీర్చారు. శుక్రవారం ఉదయం హబీబుల్లాఖాన్...ఆరిఫున్నీసా ఇంటికి వెళ్లి ఘర్షణకు దిగడంతో ఆమె మనస్థాపం చెందిన విషం తాగడంతో చుట్టుపక్కల వారు గమనించి రాయచోటికి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్‌కు తరలించారు. ఈ మేరకు రాయచోటి పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలాఉండగా జిల్లావ్యాప్తంగా కాల్‌మనీ వ్యాపారులు రూ.100కోట్ల పైబడి వ్యాపారం చేస్తుండగా, వారిని గత ఐదురోజులుగా పోలీసులు అదుపులోకి సెటిల్‌మెంట్లు చేసి పంపిస్తున్నారు. రాయచోటిలో ఓ కాల్‌మనీ వ్యాపారిని పోలీసులు అదులోకి తీసుకోగా, అధికార పార్టీకి చెందిన ఓ పార్లమెంటు సభ్యుడు, ఒక కేబినెట్‌హోదా నేత పోలీసులపై వత్తిడి తెచ్చి ఆయన్ను వదిలేశారు. జిల్లావ్యాప్తంగా ప్రతి పోలీసు సర్కిల్‌లో 20నుంచి 30మంది కాల్‌మనీ వ్యాపారులుండగా అధికార, ప్రతిపక్ష నేతల జోక్యంతో కేవలం ఏడుగుర్ని మాత్రమే అరెస్టు చూపించారు. వందలాది కాల్‌మనీ వ్యాపారులను స్టేషన్‌కు పిలిపించి పోలీసులు బేరసారాలకు దిగుతున్నారు. కొంతమంది పోలీసులు చేతివాటాన్ని ప్రదర్శిస్తూ కాల్‌వ్యాపారుల నుంచి లక్షల రూపాయలు వసూలుచేస్తూ జేబులు నింపుకుంటున్నారు.
రోడ్డున పడ్డ వృద్ధులు
తిరుమల: తిరుమల పుణ్యక్షేత్రంలో వడ్డీ పేరుతో తమ దుకాణాన్ని స్వాధీనం చేసుకున్నారని ఓ వృద్ధ దంపతులు శుక్రవారం డి ఎస్‌పిని ఆశ్రయించారు. గతంలో తిరుమలలో నివశించి ప్రస్తుతం తిరుపతిలో నివాసముంటున్న గణేష్ (60) దంపతులు స్థానికంగా పండ్ల వ్యాపారం చేసుకొని జీవిస్తున్నారు. నాలుగేళ్ల క్రితం 3 లక్షల రూపాయలను అప్పుగా తీసుకున్నానన్నారు. సంవత్సర కాలానికి సుమారు ఐదు లక్షల రూపాయలు చెల్లించానన్నారు. వ్యాపారం సరిగ్గాలేక మూడు నెలలనుంచి చెల్లించలేకపోయానన్నారు. భయపెట్టి రెండున్నరేళ్లకిందటే తన షాపును స్వాధీనం చేసుకున్నాడని, ఇప్పుడు తనతో సంతకాలు పెట్టించుకుని షాపు వేరొకరికి విక్రయించాడని పోలీసులను ఆశ్రయించారు.