రాష్ట్రీయం

చాట్ల కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 18: రంగస్థల కళాకారుడు, నటుడు, నాటకప్రయోక్త చాట్ల శ్రీరాములు కన్నుమూశారు. సికింద్రాబాద్ రైల్వే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 74 సంవత్సరాలు. విజయవాడలో 1931లో జన్మించిన ఆయన జీవితాంతం నాటక రంగం అభివృద్దికి అంకితమయ్యారు. నాగార్జున, వెంకటేష్ వంటి హీరోలతోసహా తెలుగు చలనచిత్రసీమలో పేరున్న నటులందరికీ నటనలో శిక్షణ ఇచ్చిన ప్రతిభావంతుడు చాట్ల. అనేక చలన చిత్రాల్లోను, టీవీ సీరియల్స్‌లోను నటించిన ఆయన తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. నాటక రంగాన్ని ఆరాధించి, నాటకంకోసం తపించిన ఆయన దర్శకుడిగా, ఆచార్యుడిగా ఎదిగారు. ఎంత ఉన్నత స్థానానికి వెళ్లినా ఒదిగే వుండేవారు. దేశ విదేశాల్లో వేలాది నాటకాలు ప్రదర్శించి విశేష ఖ్యాతిని ఆర్జించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో తొలి అనౌన్సర్‌గా పనిచేసిన ఘతన ఆయది. ఆలిండియా రేడియోలో, దూరదర్శన్‌లో అనేక కార్యక్రమాలను రూపొందించి ప్రసారం చేశారు. ఆయన రాసిన అనేక నాటకాలు, నాటికలు ప్రేక్షకుల చేత బ్రహ్మరథం పట్టించారు. ‘నవ్య నాటక యతనం’ అనే నాటక సమాజాన్ని స్థాపించి ఆయన ప్రదర్శించిన ‘లావాలో ఎర్రగులాబి’ లాంటి నాటకాలు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించేలా మలిచారు. అనేక అవార్డులు రివార్డులతోపాటుగా రంగస్థల కళాకారుడిగా, దర్శకుడిగా ఆయన పొందిన సన్మానాలు అన్నీఇన్నీకావు. సంగీత నాటక అకాడమీ అవార్డును, ఎన్టీఆర్ నాటక పురస్కారాన్ని, పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీ అందించిన డాక్టరేట్ వాటిలో కొన్ని. రంగస్థల కళాకారుడిగా వేలమంది కళాకారులకు శిక్షణనిచ్చారు. ఆయన మరణం తెలుగు నాటక రంగానికి తీరని లోటని పలువురు నాటక ప్రముఖులు వ్యాఖ్యానించారు.