రాష్ట్రీయం

కాల్‌మనీ కూపీ లాగుతున్న పోలీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 16: విజయవాడలో మొదలై ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న కాల్‌మనీ సెగ ఇప్పట్లో చల్లారేలా కన్పించడం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిజిపి జెవి రాముడు ఆదేశాల మేరకు బుధవారం కూడా పోలీసు వేట ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 150 మందికిపైగా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 130కిపైగా కేసులు నమోదయ్యాయి. నగర పోలీసు కమిషనర్ గౌతం సవాంగ్ తన 10 రోజుల సెలవును రద్దు చేసుకున్నారు. ఒత్తిళ్ల వలనే సవాంగ్ సెలవుపై వెళుతున్నట్లుగా ఒకవైపు విపక్షాలు విరుచుకుపడుతుంగా మరోవైపు బాధితులంతా కమిషనర్‌ను ఎటూ కదలనీయకుండా అడ్డుపడుతూ సెలవుపై వెళ్లవద్దని ప్రాధేయపడుతుండటంతో దేశ విదేశాల నుంచి వచ్చే కుటుంబ సభ్యులను కలుసుకోవాల్సి ఉన్నప్పటికీ గత్యంతరం లేని స్థితిలో తన సెలవును రద్దు చేసుకుంటున్నట్లుగా సవాంగ్ స్వయంగా ప్రకటించారు. పైగా ముందుగా రిజర్వ్ అయిన టిక్కెట్లను కూడా మీడియాకు చూపుతూ తనపై ఏ ఒక్కరి నుంచి ఎలాంటి ఒత్తిళ్లు లేవన్నారు. ఇదిలా ఉండగా విపక్షాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిందితులందరినీ అరెస్ట్ చేయాలంటూ పోలీసు కమిషనరేట్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళలు జరిగాయి. కాల్‌మనీ వ్యవహారంలో మహిళలను వేధిస్తున్న వ్యాపారులను ఉరితీయాలని, కాల్‌మనీ రాబంధువులను ఎన్‌కౌంటర్ చేయాలని ప్లకార్డులు ప్రదర్శించారు. అధిక వడ్డీలను రుద్దతూ బాధితులను వేధిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో పోలీసులకూ సంబంధాలున్నాయనే వార్తలొస్తున్న నేపథ్యంలో పలువురిపై వేటు పడుతున్నట్లు తెలుస్తోంది. విజయవాడ నగరంలోనే 80 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో టిడిపికి చెందినవారు అధికంగా ఉండగా సిపిఐకి చెందినవారు కూడా కొందరున్నారు. సగం మందికి ఏ పార్టీతోనూ సంబంధం లేదంటున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ ఎమ్మెల్యేల వెంట తిరుగుతుంటారు. విస్సన్నపేటలో 17 మందిని అరెస్ట్ చేసి నూజివీడుకు తరలించారు. ప్రకాశం జిల్లా కొమరోలులో వడ్డీ వ్యాపారి సీతారామయ్య గృహంలో జరిగిన సోదాలో 42 ప్రామిసరీ నోట్‌లు లభించాయి. పెనమలూరులో 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. మరికొన్ని గంటల్లో శాసనసభ శీతాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ కాల్‌మనీ వ్యవహారంపై వైఎస్సార్సీ ప్రభుత్వాన్ని నిలదీయబోతోంది. దీనిపై ఇప్పటికే గవర్నర్‌కు ఫిర్యాదు చేయడం జరిగింది. మరోవైపు జాతీయ మానవ హక్కుల సంఘం తీవ్రంగానే స్పందించింది.

కాల్‌మనీ కేసులో ప్రభుత్వం
కఠినంగా వ్యవహరించాలి
లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జెపి
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 16: ఆంధ్ర రాష్ట్రాన్ని కుదిపేసిన కాల్‌మనీ వ్యవహారంపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని, రాష్ట్రంలో పేద ప్రజలకు పరపతి విధానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని లోక్‌సత్తా వ్యవస్థాపకుడు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ కోరారు. కాల్‌మనీ సామాజిక రుగ్మతలా తయారైందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. దోషులకు ఖచ్చితంగా కఠిన శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు రుణమాఫీ సరిగా అమలు చేయనందువల్ల పరపతి వ్యవస్థ నాశనమైందన్నారు. ఎన్నికల్లో తాత్కాలిక తాయిలాలు, డబ్బు ప్రభావాన్ని నియంత్రించేందుకు కచ్చితమైన మార్పులు తేవాలన్నారు. పెళ్లిళ్ల వంటి కార్యాలకు తాహతుకు మించి ఖర్చు కోసం అప్పులు చేయడం వల్ల భవిష్యత్తు నాశనమవుతుందని ప్రజలు తెలుసుకోవాలన్నారు.