రాష్ట్రీయం

రికార్డుల డిజిటలైజేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 16: ఆంధ్రప్రదేశ్‌లో రెవిన్యూ, రిజిస్ట్రేషన్ రికార్డులను నవీకరించడం, డిజిటలైజ్ చేయడం, సరికొత్త ఆధునిక రికార్డు రూమ్స్‌లో వాటిని మండలస్థాయిలో భద్రపరచడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే 15 కోట్లు ఖర్చు చేసి గ్రామపటాలను డిజిటలైజ్ చేసింది. మరో 20 కోట్లు వెచ్చించి ఎఫ్‌ఎంబిలు సిద్ధం చేశారు. 384 తహసీల్దార్ కార్యాలయాల నవీకరణకు 24 కోట్లు, మిగిలిన రెవిన్యూ కార్యాలయాల నవీకరణకు మరో 25 కోట్లు వెచ్చిస్తారు. రాష్టస్థ్రాయి నుండి అన్ని రెవిన్యూ కార్యాలయాలను అనుసంథానం చేస్తారు. స్టేట్ లెవెల్ డేటా సెంటర్ ప్రస్తుతం హైదరాబాద్ ట్రిపుల్ ఐటిలో పనిచేస్తోంది. రిజిస్ట్రేషన్ శాఖను సైతం ఆధునికీకరించేందుకు ఇప్పటికే ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మరో 167 కోట్ల రూపాయలు ఖర్చు చేసి, మోడరన్ రికార్డు రూమ్స్ ఏర్పాటుకు వెచ్చిస్తారు.
ఈ వ్యయంలో కొంత భాగం రాష్ట్రప్రభుత్వం, మరికొంత భాగం కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. రెవిన్యూ శాఖలోని సిబ్బందికి ట్రైనింగ్ నిమిత్తం ప్రభుత్వం నూజివీడు ట్రిపుల్ ఐటిలో తాత్కాలికంగా కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. ఎన్‌ఎల్‌ఆర్‌ఎంపి సెల్‌ను కూడా అక్కడే ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పూర్తిస్థాయి రెవిన్యూ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ కూడా ఏర్పాటు చేసేందుకు కేంద్రప్రభుత్వాన్ని కోరినట్టు రెవిన్యూ మంత్రి కె ఇ కృష్ణమూర్తి తెలిపారు.
కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ ప్రవేశపెట్టిన జాతీయ రికార్డుల ఆధునీకరణ పథకాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. నేషనల్ ల్యాండ్ రికార్డ్సు మోడరనైజేషన్ ప్రొగ్రాంలో భాగంగానే ఈ కార్యక్రమం చేపట్టామని మంత్రి పేర్కొన్నారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా సమగ్రంగా పారదర్శకంగా భూమి రికార్డులు అన్నింటినీ ఒకే చోటుకు చేరుస్తామని చెప్పారు. భూమికి సంబంధించిన ఏ సమాచారం అయినా సింగిల్ విండో విధానంలో లభ్యమయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జాతీయ భూమి రికార్డుల ఆధునీకరణ పథకంపై అవగాహన కల్పించేందుకు సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ ఇన్ పబ్లిక్ సిస్టిమ్స్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు వర్కుషాప్ నిర్వహించామని, కార్యక్రమంలో సిసిఎల్‌ఎ అనిల్ చంద్ర పునీఠా, ప్రిన్సిపల్ సెక్రటరీ జెసి శర్మ, సిప్ ప్రతినిధులు పాల్గొన్నారని చెప్పారు. బూజుపట్టిన బ్రిటిష్ విధానాలను గుడ్‌బై చెప్పాల్సి ఉందని పౌరసేవల్లో భాగంగా ఒకొక్కరికి 64 సర్ట్ఫికేట్ల వరకూ ఇవ్వాల్సి వస్తోందని ఆధార్ అనుసంధానించి వీటి సంఖ్యను తగ్గించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

కాకినాడలో ట్రిపుల్ ఐటి
పిపిపి కోసం ఉన్నతస్థాయి కమిటీ

హైదరాబాద్, డిసెంబర్ 16: కాకినాడలో ట్రిపుల్ ఐటి ఏర్పాటుకు సంబంధించి పిపిపి కోసం ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. ఈ కమిటీలో ఐటి శాఖ కార్యదర్శి, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, ఆర్‌జియుకెటి విసి, పరిశ్రమల శాఖ కమిషనర్ ఉంటారు. వాస్తవానికి ఈ కమిటీని రాష్టప్రునర్విభజన ముందు ప్రభుత్వం నియమించింది. అందులో హైదరాబాద్ ఆర్‌జియుకెటి విసి తదితరులు ఉన్నారు. తాజా ఉత్తర్వుల్లో ఆంధ్రా ఆర్‌జియుకెటి విసిని చేర్చారు. ఈ కమిటీ వివిధ సంస్థలతో చర్చలు జరిపి 30 రోజుల్లోగా తమ నివేదికను ఇస్తుంది.
క్రిస్మస్‌కు చంద్రన్న కానుక
కిలో గోధుమ పిండి, అరకిలో కందిపప్పు,
శనగపప్పు, నూనె, బెల్లంతో నిత్యావసరాల ప్యాకేజీ
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 16: క్రిస్మస్ సందర్భంగా చంద్రన్న కానుక పేరిట నిత్యావసరాల ప్యాకేజీని ఇవ్వనున్నట్టు పౌరసరఫరాల మంత్రి పరిటాల సునీత చెప్పారు. క్రిస్మస్ కానుక ప్యాకేజీలో కిలో గోదుమపిండి, అరకిలో కందిపప్పు, అరకిలో శనగపప్పు, అరకిలో ఆయిల్, వంద గ్రాముల నెయ్యి, అరకిలో బెల్లం సంచితో కలిపి ఇస్తామని అన్నారు. ఈ మేరకు తగు ఏర్పాట్లు చేయమని అధికారులను ఆదేశించినట్టు ఆమె వెల్లడించారు.

డీసెట్ అభ్యర్థులకు
24న కాలేజీల కేటాయింపు
రిపోర్టింగ్‌కు 30 వరకూ గడువు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 16: ఆంధ్రప్రదేశ్ డీసెట్ కౌనె్సలింగ్ వెబ్ ఆప్షన్ల నమోదు 17వ తేదీ నుండి 19వ తేదీ వరకూ పొడిగించినట్టు సెట్ కో కన్వినర్ పి పార్వతి తెలిపారు. 21వ తేదీ నుండి 23వ తేదీ వరకూ సీట్ల కేటాయింపు చేపడతామని, అభ్యర్థులకు 24న కాలేజీలను కేటాయిస్తారని అన్నారు. ప్రభుత్వ డైట్ కాలేజీల్లో సర్ట్ఫికెట్ల పరిశీలన 26నుండి 28 వరకూ జరుగుతుందని, అభ్యర్థులు కాలేజీల్లో 30న రిపోర్టు చేయాల్సి ఉంటుందని ఆమె వివరించారు. డిఇడి కాలేజీల జాబితా ‘డీసెట్ డాట్ ఎపి డాట్ సిజిజి డాట్ జిఓవి డాట్ ఇన్’ అనే వెబ్‌సైట్‌లో ఉంచినట్టు ఆమె చెప్పారు.
మహిళా సహకార కార్పొరేషన్ చైర్మన్‌గా అనూరాధ
హైదరాబాద్, డిసెంబర్ 16: ఆంధ్రప్రదేశ్ మహిళా సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్మన్‌గా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనూరాధను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సహకార సంస్థ డైరెక్టర్‌లుగా బుర్జా లక్ష్మి, జి మేఘనా దేవి, మసాల పద్మజ, చిత్రచీడు విశాలాక్షి, వై వి రాజేశ్వరి దేవిలను నియమించారు. ఈ మేరకు మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య ఉత్తర్వులు జారీ చేశారు.