రాష్ట్రీయం

కాలువలు తవ్వకుండానే బిల్లులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,డిసెంబర్ 16: కడప జిల్లాలో అత్యంత దుర్భిక్ష ప్రాంతమైన గాలివీడు సమీపంలో నిర్మించిన వెలిగల్లు ప్రాజెక్టులో భారీఎత్తున నిధులు దుర్వినియోగమైనట్లు ప్రభుత్వం ఆలస్యంగా గుర్తించింది. దీంతో ఈ విషయమై పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందిగా జలవనరులశాఖ ఆదేశాలు జారీచేసింది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి కాల్వల నిర్మాణంలో అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నారు. పనులు పూర్తిచేయకుండా సుమారు రూ.9కోట్లరూపాయల మేర బిల్లులు చెల్లించినట్లు జలవనరులశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదిత్యనాధ్‌దాస్‌కు ఫిర్యాదులు అందడంతో ఆయన బుధవారం విచారణకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. వెలిగల్లు ప్రాజెక్టు ద్వారా నీటిఎద్దడి ఉన్న రాయచోటి పట్టణంలో కొంతభాగానికి దశాబ్దకాలం నుంచి తాగునీరు సరఫరా అవుతోంది. ఎగువ ప్రాంతాల్లో నిర్మించిన ప్రాజెక్టుల కారణంగా ఈ ప్రాజెక్టుకు నీరు వచ్చే అవకాశం లేదని భావించిన కాంట్రాక్టర్లు...ప్రాజెక్టుకింద కాలువలు తవ్వినా, తవ్వకపోయినా అడిగే వారెవరని తూతూమంత్రంగా కాల్వలను తవ్వారు. వాస్తవానికి వెలిగల్లు ప్రాజెక్టుకు దిగువన 98కి.మీ. పొడవునా కాలువలు, ఉపకాలువలను తవ్వాల్సి ఉంది. అందులో భాగంగా ప్రధాన కుడికాలువను 56కిలోమీటర్ల మేర తవ్వాల్సివుంది. కొంతమేరకు నామమాత్రపు పనులు చేపట్టి 2010లో కాలువ పనులు పూర్తయ్యాయని రికార్డుల్లో చూపి రూ.9కోట్ల రూపాయల మేర కాంట్రాక్టర్లు బిల్లులు చేసుకున్నారు. ఇటీవల వర్షాలకు ప్రాజెక్టులో 3టిఎంసిల నీరు చేరింది. ఇంతనీరు చేరుతుందని ఊహించని అప్పటి నాయకులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కు కావడంతో ప్రాజెక్ట్‌కు గేట్లు కూడా సరిగా ఏర్పాటుచేయలేదు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.209కోట్లు ఖర్చుచేశారు. 2005లో దివంగత సిఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఈప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా 23వేల 400 ఎకరాలకు సాగునీరు, దిగువ గ్రామాలకు తాగునీరు అందించాల్సి ఉంది. గాలివీడు, లక్కిరెడ్డిపల్లె, రామాపురం మండలాలకు సాగునీరు ఇవ్వాల్సి ఉంది. ఈ ఏడాది వర్షాలకు ప్రాజెక్టు నిండటంతో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి గేట్లుఎత్తినా నీరు దిగువకు వెళ్లలేదు. కాలువలు సక్రమంగా తవ్వక పోవడం, ఉపకాలువలు పూడి పోవడం, ప్రధాన కాలువలు నాసిరకంగా నిర్మించడంతో కాంక్రీట్ లేచి పోవడంతో ఎక్కడి నీరు అక్కడే నిలిచిపోయింది.

నాసిరకంగా తవ్విన ప్రధాన కాలువ

దోషులను రక్షించేందుకే
ఎమ్మెల్యేలపై కేసులకు వెనుకంజ

ప్రభుత్వంపై రఘువీరా ధ్వజం

మడకశిర, డిసెంబర్ 16: రాష్ట్రంలో తీవ్ర సంచలనం రేపుతున్న కాల్‌మనీ వ్యవహారంలో దోషులను రక్షించుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమాలకు పాల్పడినవారిపై కేసులు నమోదు చేయించకుండా జాప్యం చేస్తున్నారని ఎపి పిసిసి అధ్యక్షులు ఎన్.రఘువీరారెడ్డి ఆరోపించారు. బుధవారం అనంతపురం జిల్లా మడకశిరలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ కాల్‌మనీ వ్యవహారం విజయవాడలో ముఖ్యమంత్రి కార్యాలయం పక్కనే టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేయిస్తున్నారన్నారు. ఈ వ్యవహారం ముఖ్యమంత్రి కనుసన్నల్లో జరుగుతోందని ఆరోపించారు. ఎక్కువ వడ్డీతోపాటు ఆడవారిని దోచుకోవడం భరించరాని నేరమన్నారు. ఇందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ప్రైవేటు అప్పులు కట్టవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడం న్యాయం కాదన్నారు. చాలా మంది విశ్రాంత ఉద్యోగులు, భూములు విక్రయించుకున్న రైతులు ఇతర వ్యాపారాలు బతకేందుకు తక్కువ వడ్డీకి వ్యాపారం చేసుకొంటున్నారని, అలాంటి వారికి ముఖ్యమంత్రి ప్రకటన నష్టం కలిగించేదిగా ఉందన్నారు. ప్రభుత్వం బ్యాంకుల్లో రైతులు, మహిళా సంఘాలకు అవసరమైన రుణాలను సకాలంలో ఇప్పించకపోవడంతో ఆయావర్గాలు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోందన్నారు. ప్రభుత్వంపై ప్రజల నుండి వస్తున్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి ప్రైవేటు అప్పులు చెల్లించవద్దని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. 18 నెలల కాలంలో శాసనసభ, శాసనమండలి సమావేశాల్లో ప్రజల సమస్యల గురించి ఏమాత్రం చర్చించలేదన్నారు. వర్షాలు, కరవు పరిస్థితుల వల్ల అనేక మంది ప్రజలు నిరాశ్రయులయ్యారని రఘువీరా ఆందోళన వ్యక్తం చేశారు. శీతాకాల సమావేశాల్లోనైనా ప్రభుత్వం, ప్రతిపక్షాలు వ్యక్తిగత దూషణలతో సమయాన్ని వృథా చేయకుండా ప్రజా సమస్యలపై చర్చించి న్యాయం చేయాలని రఘువీరా డిమాండ్ చేశారు.