రాష్ట్రీయం

గ్రామీణ పారిశ్రామికవేత్తలను తయారుచేద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 16: ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతాల నుండి పారిశ్రామిక ఔత్సాహికులను తయారుచేయడం కోసం ముందుకు రావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బ్యాంకర్లకు పిలుపునిచ్చారు. ప్రతి ఇంటి నుండి ఒక ఔత్సాహిక పారిశ్రామిక వేత్తను తీసుకురావాన్నదే ప్రభుత్వ సంకల్పమని, పెద్ద ఎత్తున రుణాలు సమకూర్చి ఈ లక్ష్యసాధనలో ప్రభుత్వానికి సహకరించాలని సిఎం కోరారు. బుధవారం సాయంత్రం విజయవాడలో జరిగిన రాష్టస్థ్రాయి బ్యాంకర్ల సమితి సమావేశంలో సిఎం పాల్గొని పలు సూచనలు చేశారు. భూములను అమ్మి అప్పులిచ్చే మూస ధోరణిని బ్యాంకర్లు విడిచి పెట్టాలని, గ్రామీణ ఆర్థిక రంగానికి ఊతం ఇచ్చే సంస్కరణలకు సహకారం అందించాలని సిఎం చెప్పారు. మన ఊళ్లలో ఇప్పటికే మహిళా శక్తి తిరుగులేని ఆర్థిక శక్తిగా ఎదిగిందని, కోట్ల రూపాయల ఆర్థిక కార్యకలాపాలతో నగరాల్లోని బడా పారిశ్రామిక సంస్థలకే సవాల్ విసురుతోందని సిఎం అన్నారు. డ్వాక్రా మహిళా సంఘాలు అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ చేసే విధంగా వారిని తీర్చిదిద్దే కృషి జరుగుతోందని, గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ బలంగా ఉంటేనే స్థిరమైన వృద్ధి రేటును సాధించగలుగుతామని, సమ్మిళిత వృద్ధిని సాధించడంలో వ్యవసాయ, అనుబంధ , సేవారంగాల పాత్ర కీలకమని అన్నారు. గ్రామీణ యువతకు, మహిళలకు జీవనోపాధి కల్పించడంలో బ్యాంకులు నిర్వహించే పాత్ర చాలా కీలకం కాబోతోందని సిఎం చెప్పారు. ప్రభుత్వం అన్ని రంగాల్లో సమూలమైన మార్పులు తీసుకువచ్చి శీఘ్రగతిన అభివృద్ధి సాధించేందుకు కృషి చేస్తోందని అన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వ ఆలోచనలను సిఎం వివరించారు. అనుబంధ రంగాలతో పోటీపడేలా వ్యవసాయ రంగంలో మంచి వృద్ధి రేటు సాధించడానికి సహకరించాలని సిఎం బ్యాంకర్లను కోరారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి అర్ధ్భాగంలో వర్షాభావం వల్ల ఆశించిన ఫలితాలు సాధించలేదని అన్నారు. అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు ఇటీవల కురిసిన వర్షాలు మేలు చేశాయని, ఆ జిల్లాల్లో భూగర్భ జలమట్టాలు గణనీయంగా పెరిగాయని సిఎం పేర్కొన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ మంత్రి పత్తిపాటి పుల్లారావు, బిసి సంక్షేమ మంత్రి కొల్లు రవీంద్ర, ఆరోగ్యమంత్రి కామినేని శ్రీనివాస్, ప్రధానకార్యదర్శి ఐ వై ఆర్ కృష్ణారావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు, బ్యాంకర్ల సమితి కన్వీనర్ డి దుర్గాప్రసాద్, ప్రత్యేక ప్రధానకార్యదర్శి ఎస్ పి టక్కర్, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి పివి రమేష్, రెవిన్యూ ముఖ్యకార్యదర్శి జెసి శర్మ తదితరులు పాల్గొన్నారు.