రాష్ట్రీయం

రైల్వే పింఛన్‌దారుల సమస్యలు పరిష్కరిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 15: దక్షిణ మధ్య రైల్వే పింఛన్‌దారుల సమస్యలను పరిష్కరిస్తామని అదనపు జనరల్ మేనేజర్ ఎస్‌ఎన్ సింగ్ హామీ ఇచ్చారు. మంగళవారం సికిందరాబాద్‌లోని రైల్వే నిలయంలో 30వ పెన్షన్ అదాలత్ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సింగ్ మాట్లాడుతూ రిటైరయిన కార్మికుల కుటుంబాలు పింఛన్‌పై ఆధారపడి ఉంటారని వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చెల్లింపులు జరగాలని అకౌంట్స్ విభాగం అధికారులను అదేశించారు. చీఫ్ పర్సనల్ ఆఫీసర్ ఆర్‌ఆర్ ప్రసాద్ మాట్లాడుతూ రైల్వే శాఖలోని చాలా మంది కార్మికులు వివిధ సమస్యలు ఎదుర్కొంటున్నారని, వారు పెన్షన్ అదాలత్ ద్వారా సమస్యలు పరిష్కరించుకుంటున్నారన్నారు. నేటి పింఛన్ అదాలత్‌లో 806 కేసుల్లో 701 సమస్యలు పరిష్కరించబడ్డాయని, వీరికి రూ. 27,04,992లు బకాయిలు చెల్లించబడుతున్నాయన్నారు. ఈ సమావేశంలో ఫైనాన్షియల్ అడ్వయిజర్ చీరాల పూర్ణ, ఎన్‌వి రమణ రెడ్డి ప్రసంగించారు. మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి శంకర్‌రావు, ఉపాధ్యక్షుడు గార్గ్, వైఎన్ శాస్ర్తీ తదితరులు పాల్గొన్నారు.

కొత్త ఏడాది వేడుకలపై పన్ను పోటు
వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ వెల్లడి

హైదరాబాద్, డిసెంబర్15: నూతన సంవత్సరం సందర్భంగా నిర్వహించే వినోద కార్యక్రమాలకు పన్ను వర్తిస్తుందని వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ తెలిపారు. కొత్త సంవత్సరం వేడుకలు నిర్వహించే ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థలన్నీ రిజిస్టర్ చేయించుకోవడంతోపాటు పన్ను చెల్లించాలని కోరారు. పన్ను ఎగవేతదారులనుంచి మూడు నుంచి ఐదు రెట్లు అపరాధ రుసుం వసూలు చేస్తామని హెచ్చరించారు. ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థలు ఈ అంశంపై ఆయా సర్కిల్ ఆఫీసర్స్‌ను కలవాలని లేదా నాంపల్లిలోని వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో అదనపు కమిషనర్‌ను కలవాలని తెలిపారు.