రాష్ట్రీయం

మిషన్ భగీరథ ఓ అద్భుత పథకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 15: మిషన్ భగీరథ అద్భుతమైన పథకమని, మిగిలిన రాష్ట్రాలు దీనిని ఆదర్శంగా తీసుకోవాలని కేంద్ర గ్రామీణ నీటి సరఫరా శాఖ సంయుక్త కార్యదర్శి సత్యవ్రత సాహు తెలిపారు. తాగునీటి సరఫరాపై అన్ని రాష్ట్రాల ఉన్నతాధికారులతో ఆయన మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమావేశం ప్రారంభంలోనే మిషన్ భగీరథపై వివరించారు. దేశంలో భగర్భ జలవనరుల నుంచే తాగునీటి సరఫరా జరుగుతోందని, దీంతో ప్రయోజనం కంటే ప్రమాదమే ఎక్కువ అని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లోని భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్, ఆర్సినక్ వంటి విష రసాయనాలు ప్రమాదకర స్థాయిలో ఉన్నాయని తెలిపారు. ఈ ప్రమాదాన్ని నివారించాలంటే ఉపరితల జన వనరుల నుంచి తాగునీటిని సరఫరా చేయాలని చెప్పారు. దీనికోసం తెలంగాణలో బృహత్ ప్రయత్నం జరుగుతోందని సత్యవ్రత సాహూ తెలిపారు. నదులనే నీటి వనరులుగా ఉపయోగించుకొంటూ తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథను చేపట్టిందని, ఇదో అద్భుతమైన ప్రయత్నమని మెచ్చుకున్నారు. స్వాతంత్య్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా ఇప్పటికీ దేశంలోని కోట్లాదిమంది సురక్షిత తాగునీటికి నోచుకోక పోవడం దురదృష్టకరమని అన్నారు. తెలంగాణ సంకల్పాన్ని చూసి తాము గర్వపడుతున్నామని చెప్పారు. మిగతా రాష్ట్రాలు కూడా తెలంగాణను ఆదర్శంగా తీసుకోవాలని సాహూ సూచించారు. ఇదే సమావేశంలో పాల్గొన్న నీతి ఆయోగ్ సలహాదారు అశోక్‌జైన్ మాట్లాడుతూ తెలంగాణ లక్ష్యం గొప్పదని అన్నారు. ఫ్లోరైడ్, ఆర్సినిక్ ప్రభావిత ప్రాంతాల్లో సురక్షిత తాగునీటి సరఫరా కోసం నీతి ఆయోగ్ 1000 కోట్ల రూపాయలు కేటాయించినట్టు చెప్పారు.