రాష్ట్రీయం

పాలనా సంస్కరణల్లో కొత్త అధ్యాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 15: ప్రభుత్వ పాలనా సంస్కరణల్లో ఆంధ్రప్రదేశ్ సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ప్రజలకు పాలనా ఫలితాలు అందించటంలో, వేగవంతమైన ప్రగతిని, వృద్ధిని సాధించటానికి ఏపి ప్రభుత్వం మలేసియా ప్రధానమంత్రి అజమాయిషీలో ఉండే ‘పెమాండు’ (పెర్ఫామెన్స్ మేనేజిమెంట్ అండ్ డెలివరీ యూనిట్)తో ఒప్పందం కుదుర్చుకుంది. నగరంలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో రెండో రోజైన మంగళవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, మలేసియా ‘పెమాండు’ సీఇఓ ఇడ్రిస్ జలా సమక్షంలో ఆంధ్రప్రదేశ్, మలేసియా ప్రభుత్వ ప్రతినిధులు సంతకాలు చేశారు.
రాష్ట్ర విభజనతో ఎంతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు వేగంగా, భారీ లక్ష్యాలు సాధించాల్సి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సందర్భంగా అన్నారు. తమ రాష్ట్భ్రావృద్ధిలో మలేసియా సహకరించాలని కోరారు. జనాభా, వైశాల్యం రీత్యా మలేసియా చిన్న దేశమే కావచ్చు, కానీ అభివృద్ధిలో తమకంటే ఎన్నో రెట్లు ముందుందని, ప్రపంచంలో మంచి ఎక్కడున్నా తీసుకోవాలన్న సిద్ధాంతం తమదని ఆయన తెలిపారు. మలేసియా మంత్రి, ‘పెమాండు’ సిఇఓ ఇద్రిజ్ జలా మాట్లాడుతూ పేదరిక నిర్మూలనకు ముందుగా తమ దేశంలో నాణ్యమైన విద్యను అందించటమే ధ్యేయంగా పెట్టుకున్నామని, అవినీతి రహిత పారదర్శక పరిపాలనకు బాట వేశామని ఇద్రిస్ జలా తెలిపారు. తాము చేపట్టన సంస్కరణలు దేశ దశ, దిశను ఎలా మార్చాయో తెలిపారు. ఇద్రిస్ జలా అచ్చం వ్యక్తిత్వ వికాస పాఠాలు బోధించే ప్రొఫెసర్‌లా ప్రెజెంటేషన్ ఇస్తూ చతురోక్తులతో నవ్వులు పూయిస్తూ కలెక్టర్లలో ఉత్తేజం నింపారు. తమ దేశం మూడు దశాబ్దల కింద బొటాబొటీ ఆదాయం ఉన్న దేశంగా ఉండేదని, తాము చేపట్టిన పాలనా సంస్కరణలు దేశాన్ని ప్రగతి పథంలో నడుపుతున్నాయని వివరించారు. పేదరికం రూపుమాపటానికి విద్య ఒక బలమైన సాధనమని చెప్పారు. తాను ఒక అట్టడుగు గిరిజన కుటుంబం నుంచి వచ్చానని, ప్రధానమంత్రి కేబినెట్‌లో స్థానం పొందానని, ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే వేగవంతంగా ఫలితాలు సాధించవచ్చని చెప్పటానికి తన జీవితమే చక్కని ఉదాహరణ అన్నారు. ‘డిసిప్లిన్ ఆఫ్ యాక్షన్’ కావాలని తెలిపారు. నేరాలను అరికట్టడం, జీవన ప్రమాణాలను పెంచటం, గ్రామీణాభివృద్ధి, విద్య, తదితర రంగాలకు తాము ‘పెమాండు’ కింద ప్రాధాన్యతనిచ్చి సామాజిక, ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచామని వివరించారు. పాలకులు, సివిల్ సర్వెంట్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కలసి పనిచేస్తేనే వేగవంతంగా లక్ష్యాలు సాధిస్తామని వివరించారు.
ల్యాబ్ టెక్నాలజీ అనేది ప్రజలకు సేవలు అందించటానికి ఉపయోగపడుతుందని, ఇది 8 అంచెల విధానమని జలా తెలిపారు. విశే్లషణాత్మక ఫలితాల ద్వారా సేవలను నిర్ధారిస్తామని, సేవలు ప్రాథమికంగా ఎవరికి అవసరమో గుర్తించి వారికి అందిస్తామని, 30 శాతం సిఫార్సుల ఆధారంగా, మరో 30 శాతం రిఫైన్ చేస్తామని, 40 శాతం గతంలో ఎవరూ ఆలోచించి ఉండని పరిష్కారాలను అందిస్తామన్నారు. పెమాండును తాము ప్రారంభించినప్పుడు వృద్ధి 3.5 శాతంగా ఉండేదని, తర్వాత 5 శాతానికి చేరిందన్నారు. ద్రవ్య లోటును బాగా తగ్గించటానికి కృషి చేస్తున్నామని తెలిపారు. సంక్షేమ పథకాలకు డబ్బు వెచ్చిస్తున్నామని, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా చేశామని, మలేసియా వాసులు సగటు జీతం 6 శాతంకు పెరిగిందని తెలిపారు. తమ ప్రభుత్వం 2010లో గవర్నమెంట్ ట్రాన్స్‌ఫార్మేషన్ ప్రోగ్రాం (జిటిపి), ఎకనమిక్ ట్రాన్స్‌ఫార్మేషన్ ప్రోగ్రాం ప్రారంభించామని తెలిపారు. ప్రపంచంలో అత్యధిక ఆదాయం కలిగిన దేశాల్లో ఒకటిగా మలేసియాను నిలపాలన్నది తమ లక్ష్యమని మలేసియా మంత్రి తెలిపారు. విద్యా రంగంలో మేం న్యుమరికల్, డిజిటల్ లిటరసీని సాధించామన్నారు. ప్రీస్కూల్ తరగతుల్లో చేర్చాల్సిన పిల్లలు ఇంకా 54 వేల మంది ఉన్నారన్నారు. పట్టణ రవాణా వ్యవస్థను ప్రస్తుతం 12 శాతం ఉపయోగించుకుంటున్నామన్నారు. ఇది 15 శాతానికి చేరాలన్నది లక్ష్యమన్నారు. 2.4 మిలియన్ల ప్రయాణికులను అదనంగా చేరవేసే సామర్థ్యం వారి లైట్ రైల్ వ్యవస్థకు ఉందన్నారు. గ్రామీణ వౌలిక సదుపాయాలను మెరుగుపరిచామన్నారు. 775 కిమీ గ్రామీణ రోడ్లు నిర్మించామన్నారు. గ్రామాల్లో 35 వేల ఇళ్లకు శుద్ధి చేసిన జలాలు పంపిణీ చేస్తున్నామన్నారు. సంస్కరణలతో 6 రెట్లు మెరుగైన ఫలితాలు సాధించినట్లు తెలిపారు. ఈ లెక్కలు తప్పని కొందరు వాదించబోతే శాస్తబ్రద్ధంగా తాము నిరూపించామన్నారు. నా చిన్నతనంలో పట్టణానికి వెళ్లాలంటే అడవిలో వారం నడిచాను... మళ్లీ పడవలో వారం సమయం పట్టింది. మారుమూల అడవుల్లో నివసించే గిరిజనులు నగరాలకు రావాలంటే ఎంతో కష్టపడేవారు ఇప్పుడీ అవస్థ లేదని జలా వివరించారు.

చిత్రం... జిల్లా కలెక్టర్ల సమావేశంలో మాట్లాడుతున్న మలేసియా పెమాండు సిఇఒ ఇడ్రిస్ జలా