రాష్ట్రీయం

కాల్ మాఫియాపై నిర్భయ మనీ దందాలు ఇక చెల్లవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 14: నూతనంగా ఏర్పాటైన రాజధాని ప్రాంతంలో ఇటీవల ఒకదాని వెంట ఒకటిగా వెలుగులోకొస్తున్న అకృత్యాల పట్ల సిఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. రెండురోజులు జరిగే కలెక్టర్ల సమావేశం సోమవారం ఉదయం నగరంలో ప్రారంభమైంది. వివిధ పథకాలపై సమీక్ష నిర్వహించిన అనంతరం చివరిగా పోలీసు శాఖ పనితీరును ఆయన అన్యాపదేశంగా ప్రస్తావించారు. కల్తీ మద్యం, కల్తీ నెయ్యి, కాల్‌మనీ వంటి అకృత్యాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇష్టారాజ్యంగా అధిక వడ్డీలు వేసి ఆ నెపంతో అమాయక మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించటం దారుణమని ఖండించారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వ్యక్తులపై ప్రభుత్వం తీసుకునే చర్యలు తప్పు చేయాలంటే భయపడే స్థాయిలో ఉండాలన్నారు. తరతమ భేదం లేకుండా ఎంతటివారైనా బాధ్యులను కఠినంగా శిక్షించడానికి ప్రభుత్వం సిద్ధంగా వుందన్నారు. ఇలాంటి వాటిని ప్రభుత్వం ఉపేక్షించబోదన్నారు. ఇలాంటి సంఘటనలు జరిగిన తరువాత ఎందుకు జరిగిందీ.. ఎలా జరిగిందంటూ పోస్టుమార్టం చేయటంకంటే జరక్కుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ఈ విషయంలో కలెక్టర్లు, ఎస్పీలు సమన్వయంతో వ్యవహరించాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్లతో పాటు నిఘా వ్యవస్థ ఉన్నప్పుడు ఇలాంటివాటిని ముందుగా ఎందుకు గుర్తించి నియంత్రించలేక పోతున్నారంటూ ఆయన అసహనంతో ప్రశ్నించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలుచేయటంతో పాటు అసాంఘిక శక్తుల ఆగడాలను అరికట్టాలన్నారు. నగరంలో తక్షణం కాల్‌మనీ దందా మూయించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కాల్‌మనీ తీసుకున్న ఏఒక్కరూ బాకీలు చెల్లించొద్దంటూ, ఈ విషయంలో ఏఒక్కరూ భయపడొద్దని అభయమిచ్చారు. ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. వడ్డీల పేరుతో మహిళలను వేధిస్తే నిర్భయ చట్టం కింద కేసులు పెడతామని చంద్రబాబు హెచ్చరించారు. సంఘ విద్రోహ శక్తులపై కఠినంగా వ్యవహరించాలన్నారు. సాంకేతికత ద్వారా అవినీతి నియంత్రిస్తామంటూ, ఈ అవినీతి సమాజానికి కేన్సర్ వంటిదని బాబు వ్యాఖ్యానించారు.