రాష్ట్రీయం

‘ఆరోగ్యశ్రీ’పై చేతులెత్తేసిన డాక్టర్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 13: సుమారు పదేళ్ల కిందట ప్రారంభమైన ఆరోగ్యశ్రీ పథకాన్ని కొనసాగించలేక డాక్టర్లు చేతులెత్తేశారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పథకానికి ఎన్టీఆర్ వైద్య సేవ అని పేరు మార్చింది. ఈ పథకం కింద వివిధ ఆపరేషన్లకు సంబంధించి ప్యాకేజీలు పెంచకపోతే, ఆ పథకాన్ని తమతమ ఆసుపత్రుల్లో కొనసాగించలేమని తేల్చి చెప్పారు. డాక్టర్ల డిమాండ్ పరిష్కారానికి తాను ఎటువంటి హామీ ఇవ్వలేనని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ స్పష్టం చేయడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ (అప్‌నా) తొలి సమావేశం విశాఖలో ఆదివారం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి కామినేని శ్రీనివాస్ కూడా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ప్రైవేటు వైద్యులు మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకం కింద వచ్చే రోగుల సంఖ్య తగ్గింది. ఒక రోగిని ఆసుపత్రిలో చేర్చుకుని, వైద్య పరీక్షలు నిర్వహించి, రోగ నిర్థారణ చేసి, అవసరమైతే ఆపరేషన్ చేసి తిరిగి ఇంటికి పంపించే బాధ్యత అంతా సదరు ఆసుపత్రి యాజమాన్యమే భరించాల్సి వస్తోందని డాక్టర్లు వాపోయారు. గ్రామీణ ప్రాంతాల్లో 20 పడకల ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ ఉన్నాయి. ఈ ఆసుపత్రులకు ఆరోగ్య శ్రీ పథకాన్ని అమలు చేయకపోతే, భవిష్యత్‌లో నడపడం కష్టమవుతుందని కూడా నర్సింగ్ హోం డాక్టర్లు చెప్పుకొచ్చారు.
కాగా, ప్యాకేజీలు పెంచమన్న కార్పొరేట్ వైద్యుల డిమాండ్‌ను కానీ, ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింప చేయమన్న గ్రామీణ ప్రాంత నర్సింగ్ హోమ్స్ వైద్యుల అభ్యర్థనను కానీ మంత్రి కామినేని శ్రీనివాస్ అంగీకరించలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్యసేవ పథకాన్ని ప్రతిష్మాత్మకంగా తీసుకుందని, పెరిగిన ధరల ప్రకారం ప్యాకేజీలు ఇవ్వాలంటే ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి కూడా సహకరించాలని అన్నారు. దీనిపై తాను ఎటువంటి హామీ ఇవ్వలేనని, ప్రభుత్వంలో చర్చిస్తానని చెప్పుకొచ్చారు.

ఇక గ్రామీణ ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ పథకాన్ని అమలు చేయాలంటే, అదనంగా ఆరోగ్య మిత్ర, తదితర సిబ్బందిని నియమించాలి. అందుకు ఆర్థిక పరిస్థితి సహకరించడం లేదని కామినేని తేల్చి చెప్పడం గమనార్హం.

ఎంతటివారైనా
శిక్ష తప్పదు
కాల్‌మనీ కేసుపై టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి స్పష్టం
ఆంధ్రభూమి బ్యూరో
ఒంగోలు, డిసెంబర్ 13: కాల్‌మనీ కేసులో ఎంతటివారైనా తప్పుచేస్తే శిక్ష తప్పదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళావెంకట్రావు అన్నారు. ఆదివారం ఒంగోలులో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్టవ్య్రాప్తంగా సంచనలం సృష్టించిన కాల్‌మనీ కేసులో తెలుగు తమ్ముళ్ల ప్రమేయం ఉందా అన్న అంశంపై ఆంధ్రభూమి ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఆయన పైవిధంగా స్పందించారు. కాల్‌మనీ కేసులో ఎవరున్నా చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. తెలుగుదేశం పార్టీలో మొదటి నుండి ఉన్న నాయకులు, కార్యకర్తలకు నామినేటెడ్ పదవులను కట్టబెడతామని ఆయన భరోసా ఇచ్చారు. ఇటీవల పార్టీలో కొత్తగా చేరిన నాయకులకే నామినేటెడ్ పదవుల్లో పెద్దపీట వేస్తున్నారన్న ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ పార్టీకి కొత్తవారు అవసరం ఉందని, దాన్ని దృష్టిలో పెట్టుకుని నామినేటెడ్ పదవులను కట్టబెట్టడటం జరిగిందన్నారు. జనవరి 1 నుండి జన్మభూమి కార్యక్రమం ప్రభుత్వపరంగా జరుగుతుందన్నారు. రాష్ట్భ్రావృద్ధిని తల్లి, పిల్ల కాంగ్రెస్‌లు అడ్డుకుంటున్నాయని ఆయన ధ్వజమెత్తారు. వైకాపా అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి నాయకత్వ పరిపక్వత లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యనాయకులు కూడా రాష్ట్భ్రావృద్ధికి సహకరించడం లేదని ఆరోపించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జనచైతన్య యాత్రలకు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని కళావెంకట్రావు పేర్కొన్నారు.

సాంకేతిక విజ్ఞానం
ప్రజలకు ఉపయోగపడాలి
ఇస్రో చైర్మన్ కిరణ్‌కుమార్ పిలుపు
ఆంధ్రభూమి బ్యూరో
వరంగల్, డిసెంబర్ 13: ప్రపంచంలోనే భారతదేశం విద్యాపరంగా మూడవ స్థానంలో ఉందని మొదటి, రెండవ స్థానంలో యుఎస్‌ఎ, చైనా దేశాలు ఉన్నాయని ఇస్రో చైర్మన్ ఎఎస్ కిరణ్‌కుమార్ అన్నారు. వరంగల్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో శనివారం జరిగిన 13వ స్నాతకోత్సవంలో ఆయన పాల్గొని విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువ ఇంజనీర్లు, శాస్తవ్రేత్తలు బాహ్యప్రపంచంలో అడుగుపెట్టి భారత ప్రజలకు సాంకేతిక విజ్ఞానం ఉపయోగపడేలా కృషి చేయాలని కోరారు. వరంగల్ నిట్ విద్యార్థులకు అంతరిక్ష పరిశోధనలో సముచిత స్థానం కల్పిస్తామని చెప్పారు. 2017-18 సంవత్సరంలో చంద్రయాన్-2 అంతరిక్షలోకి పంపిస్తామన్నారు. అంతరిక్ష పరిశోధనలో భారతదేశం ప్రపంచంలో 6వ స్థానంలో ఉందన్నారు. ఈ సందర్భంగా 1598 మంది నిట్ విద్యార్థులకు డిగ్రీ అవార్డులు ప్రదానం చేశారు.

పిహెచ్‌డిలో 65, ఎంటెక్, పిజిలో 685, బిటెక్‌లో 848 మంది విద్యార్థులు డిగ్రీ అందుకున్నారు. నిట్ గోల్డ్‌మెడల్‌గా సివిల్ ఇంజనీర్ విద్యార్థి ఇ.సాయికళ్యాణ్ అందుకున్నారు. ఒక్కో విభాగంలో టాపర్ ఒక్కొక్కరికి గోల్డ్‌మెడల్ అందజేశారు. నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ పి.శ్రీనివాసరావు రిపోర్ట్ ప్రజెంటేషన్ చేశారు. నిట్‌లో 5.8 కోట్లు ఖర్చు చేసి 22 ఆర్‌అండ్‌డి ప్రాజెక్టులు చేశామన్నారు. డాక్టర్ రెడ్డి, సి-ఎంఇటి, న్యాట్‌కో, డిఆర్‌డిఓ, ఇసిఐఎల్ కంపెనీలతో నిట్‌టైఅప్‌తో పనిచేస్తోందని తెలిపారు. విద్యార్థులకు డిగ్రీ పట్టాల అనంతరం వారిచే ప్రమాణ స్వీకారం చేయించారు.

చింటూ జ్యుడిషియల్ రిమాండ్ పొడిగింపు
కడప సబ్ జైలుకు తరలింపు
చిత్తూరు, డిసెంబర్ 13: చిత్తూరు నగర మేయర్ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చంద్రశేఖర్ అలియాస్ చింటూ జ్యుడిషియల్ కస్టడీని పొడిగించారు. ఈ హత్యకు సంబంధించి గత 14 రోజుల క్రితం చిత్తూరు కోర్టులో లొంగిపోయిన చింటూను చిత్తూరు పోలీసులు తమ కస్టడీకి తీసుకుని విచారించిన సంగతి పాఠకులకు విదితమే. అయితే ఆయన పోలీస్ కస్టడీ ఆదివారం ముగియడంతో చిత్తూరు పోలీసులు ఆదివారం సాయంత్రం చింటూను స్థానిక జిల్లా న్యాయమూర్తుల నివాస గృహాల సముదాయానికి తరలించారు. క్వార్టర్స్‌లో ఉన్న చిత్తూరు నాల్గవ అదనపు కోర్టు న్యాయమూర్తి యుగంధర్ చింటూ జ్యుడిషియల్ కస్టడీని మరో 14 రోజులపాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పోలీసులు చింటూను పటిష్ఠ భద్రత నడుమ కడప సబ్‌జైలుకు తరలించారు.
శేషాచలం అడవుల్లో టాస్క్ఫోర్స్ కూంబింగ్
స్వయంగా పాల్గొన్న డిఐజి కాంతారావు
తిరుమల, డిసెంబర్ 13: శేషాచలం అడవుల్లో ఎర్రసంవదను పరిరక్షించడానికి ప్రభుత్వం స్మగ్లర్లపైన, కూలీలపైన ఉక్కుపాదం మోపుతున్న నేపధ్యంలో ఆదివారం రెడ్ సాండల్స్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ఫోర్స్ డిఐజి కాంతారావు స్వయంగా కూంబింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పాత్రికేయులను వెంటబెట్టుకొని శేషాచలం అడవుల్లో ఎర్రచందనం చెట్లను నరికిన ప్రాంతాలను, కూలీలు వంటలు చేసిన ప్రాంతాలను గుర్తించారు. ఆదివారం ఉదయం తిరుమల అటవీ శాఖ భవనం నుండి కాంతారావు, డిఎస్‌పి హరినాధబాబు, టాస్క్ఫోర్స్ సిబ్బంది, అటవీ శాఖ అధికారులు మూడు వాహనాల్లో బయలుదేరారు. కుమారధార, పసుపుధార ప్రాంతాలను క్షుణ్ణంగా గమనించారు. అక్కడి నుండి అన్నదమ్ములబండ వరకు గాలింపు చర్యలు చేపట్టారు. సాయంత్రం 4.30 గంటల వరకు సుమారు 15 కిలోమీటర్ల మేర ఈ బృందం విస్తృతంగా పర్యటించింది. ఎర్రకూలీలు రాత్రుల్లో బస చేయడానికి అనువుగా చేసుకున్న ప్రాంతాలను ఈ సందర్భంగా గుర్తించారు. ఎర్రకూలీలు ఈ ప్రాంతాలకు ఎటువైపు నుండి వస్తున్నారో, ఎటువైపు నుంచి వెళుతున్నారో అనే అంశాలపై అధికారులు ఒక అవగాహనకు వచ్చారు. ఈ ప్రాంతాలకు రావడానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలపై కూడా ఈ బృందం దృష్టిసారించింది. ఎర్రకూలీలను శేషాచలం అడవుల్లోకి ప్రవేశించకుండా చేయాలంటే ఏయే ప్రాంతాల్లో భద్రతను పటిష్ఠం చేయాలి, సిసి కెమేరాలు ఎక్కడ ఏర్పాటు చేయాలి అనే అంశాలను కూడా డిఐజి కాంతారావు ఒక ప్రణాళికను రూపొందిస్తున్నారు.
విచారణ త్వరగా ముగించండి
మున్సిపల్ కమిషనర్ల సంఘం డిమాండ్
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, డిసెంబర్ 13: సుదీర్ఘకాలం విచారణను ఎదుర్కొంటున్న మున్సిపల్ కమిషనర్లపై కమిటీల విచారణను సత్వరమే ముగించి వారికి పోస్టింగ్‌లు ఇవ్వాలని రాష్ట్ర మున్సిపల్ కమిషనర్ల అసోసియేషన్ తీర్మానించింది. అసోసియేషన్ అధ్యక్ష పదవికి విఇ రాజేంద్ర ప్రసాద్ రాజీనామా చేసిన నేపథ్యంలో అసోసియేషన్ విశాఖలో ఆదివారం అత్యవసరంగా సమావేశమైంది. ఈ మేరకు అసోసియేషన్ తాత్కాలిక అధ్యక్షునిగా జివిఎంసి అదనపు ఉప కమిషనర్ జివివిఎస్ మూర్తిని ఎన్నుకుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 13న గుంటూరు జిల్లా తెనాలిలో అసోసియేషన్ సర్వసభ్య సమావేశం నిర్వహించి, పూర్తిస్థాయి అధ్యక్షుని ఎన్నుకోవాలని తీర్మానించారు. రాష్టవ్య్రాప్తంగా పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై విచారణ సత్వరమే ముగించి, పోస్టింగ్‌లు ఇచ్చేందుకు ప్రభుత్వాన్ని కోరాలని తీర్మానించారు. దీర్ఘకాలం నిరీక్షణలో ఉన్న కమిషనర్లకు పోస్టింగ్‌లు ఇవ్వడంతో పాటు వారి నిరీక్షణ కాలానికి జీతభత్యాలు తక్షణమే చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పలు మున్సిపల్ కమిషనర్ల పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని, రెగ్యులర్ పేనల్స్‌ను ఆమోదించేలా ప్రభుత్వాని కోరాలని తీర్మానించారు.వీటితో పాటు పలు తీర్మానాలను అసోసియేషన్ ఆమోదించింది. సమావేశంలో తాత్కాలిక అధ్యక్షునిగా ఎన్నికైన జివివిఎస్ మూర్తి, కార్యదర్శి వై సాయిశ్రీకాంత్, ఎక్స్‌అఫీషియో వైస్ ప్రెసిడెంట్ పి ఆశాజ్యోతి, కె రమేష్, ఎస్‌ఎస్ వర్మ, సహాయ కార్యదర్శి వి రవీంద్ర, జి నాగరాజు, సిహెచ్ నాగనరసింహరావ, పి నల్లనయ్య తదితరులు పాల్గొన్నారు.
‘అభివృద్ధిని
వికేంద్రీకరించాలి’
ఒంగోలు, డిసెంబర్ 13: అమరావతిలో పాలనా రాజధానిని నిర్మించి అభివృద్ధిని రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు వికేంద్రీకరించాలని లోక్‌సత్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు కఠారి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. రాజధాని అమరావతిలో - అభివృద్ధి జిల్లాల్లో అనే అంశంపై ఆదివారం ఒంగోలులో లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ప్రతిపక్ష పార్టీలతో రాష్ట్ర సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన కఠారి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏడాదిన్నర పాలన అంతా రాష్ట్ర రాజధాని అమరావతి చుట్టూనే సాగిందని విమర్శించారు. ఈ సదస్సులో వైకాపా రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ రాజధాని పేరుతో రైతుల నుండి భూములను బలవంతంగా సేకరించి ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు పూనుకుందని ధ్వజమెత్తారు. కార్పొరేట్ శక్తులు బలపడటం ద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వచ్చిన కమీషన్లతో తిరిగి వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావచ్చునన్న భావనతో చంద్రబాబు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఈకార్యక్రమంలో లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డివివి వర్మ, సంతనూతలపాడు ఎమ్మెల్యే ఎ.సురేష్ తదితరులు పాల్గొన్నారు.

, వైకాపా రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందారెడ్డి, సిపిఐ జిల్లాకార్యదర్శి కె అరుణ, సిపిఎం జిల్లానాయకులు జి రమేష్, లోక్‌సత్తాపార్టీ నాయకులు రఫీ, విష్ణుమూర్తి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

‘నాక్’ గుర్తింపుతో జాతీయాభివృద్ధి

మాజీ డైరెక్టర్ డిఆర్‌విఎస్ ప్రసాద్

ఆంధ్రభూమి బ్యూరో
కాకినాడ, డిసెంబర్ 13: నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (నాక్) గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలు జాతీయాభివృద్ధికి పెద్ద ఎత్తున కృషిచేయడానికి అవకాశం ఉందని నాక్ మాజీ డైరెక్టర్ డిఆర్‌విఎస్ ప్రసాద్ పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలోని జెఎన్‌టియులో ఆదివారం నాక్ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకునే విధానంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. వైస్ ఛాన్సలర్ ఆచార్య విఎస్‌ఎస్ కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రసాద్ మాట్లాడుతూ నాక్‌ను స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థగా 1994లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యుజిసి) బెంగళూరులో ప్రారంభించిందన్నారు. నాక్ గుర్తింపువచ్చిన విద్యా సంస్థలను ఉన్నత విద్యా ప్రమాణాలకు కొలమానంగా చూస్తారన్నారు. నాక్‌కు దరఖాస్తు చేసుకునే విధానంపై ఈ సందర్భంగా ప్రసాద్ విశ్వ విద్యాలయ పాలకులకు అవగాహన కల్పించారు. జెఎన్‌టియుకె వైస్-్ఛన్సలర్ ఆచార్య విఎస్‌ఎస్‌కుమార్ వర్సిటీగా ఆవిర్భవించిన నాటి నుండి ఎనిమిదేళ్ల కాలంలో ప్రగతిని వివరించారు. సమావేశంలో వర్సిటీ రెక్టార్ ఆచార్య బి ప్రభాకరరావు, రిజిస్ట్రార్ ఆచార్య జివిఆర్ ప్రసాదరాజు, ఆచార్య కె పద్మరాజు, ఆచార్య రామచంద్రరాజు పాల్గొన్నారు.