రాష్ట్రీయం

మంత్రి కాలువను ఆక్రమించారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, డిసెంబర్ 13: రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ సర్వే నెంబరు 994 ప్రాంతంలోని యనమలదినె్న కాలువను ఆక్రమించి మెడికల్ కాలేజీని నిర్మించారని నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ తీవ్రంగా విమర్శించారు. ఆదివారం ఆయన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డితో కలసి మీడియా ప్రతినిధులను వెంటబెట్టుకొని చింతారెడ్డిపాళెం వద్దనున్న యనమలదినె్న కాలువ వద్దకు తీసుకువెళ్లారు. అనంతరం అక్కడ నేరుగా వెళ్లాల్సిన కాలువను పూడ్చేసి ‘ఎల్’ ఆకారంలో కాలువను పక్కకు మళ్లించిన వైనాన్ని మీడియా ప్రతినిధులకు చూపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శనివారం జరిగిన ఐఎబి సమావేశంలో సర్వే నెంబరు 994 పంట కాలువ ఆక్రమణకు గురైందని తెలిపితే ఆ విషయం ఇక్కడ మాట్లాడరాదని ఇన్‌చార్జి మంత్రి శిద్దా రాఘవరావు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. 2,500 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పు ఉన్న పంట కాలువ సుమారు వెయ్యి అడుగుల మేర ఆక్రమణకు గురైందని తెలిపారు. పంట కాలువను ఆక్రమించి మెడికల్ కాలేజీ నిర్మించినా జిల్లా ఉన్నతాధికారులు పట్టించుకోరా అని ఆయన ప్రశ్నించారు. మంత్రికి చిత్తశుద్ధి ఉంటే తన దగ్గర నుండే పంట కాలువల ఆక్రమణ తొలగింపును చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డి మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పంట కాలువలను ఎవరు ఆక్రమించినా నేరమన్నారు. వాటిని కచ్చితంగా తొలగిస్తామని స్వయంగా ప్రకటించిన మంత్రే కాలువను ఆక్రమించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సిపి ఫ్లోర్‌లీడర్, రూప్‌కుమార్ యాదవ్, డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్ పాల్గొన్నారు.

కాలువగట్టుపై ఆక్రమణలను చూపుతున్న వైకాపా ఎమ్మెల్యేలు

వరాహావతారంలో రామయ్య
భద్రాచలం, డిసెంబర్ 13: ఖమ్మం జిల్లా భద్రాచలంలో జరుగుతున్న వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో ఆదివారం శ్రీ సీతారామచంద్రస్వామి వరాహావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. హిరణ్యాక్షుడి నుంచి భూదేవిని రక్షించడానికి శ్రీ మహావిష్ణువు వరాహావతారం దాల్చుతాడు. ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం నిర్వహించారు. వరాహరూపుడైన రామయ్యను ఊరేగింపుగా కల్యాణ మండపం వద్దకు తీసుకొచ్చి భక్తుల దర్శనార్థం ఉంచారు. స్వామి దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో బారులు తీరారు. అధ్యయనోత్సవాల్లో నేడు స్వామి నృసింహావతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.