రాష్ట్రీయం

కడపలోనూ కాల్‌మనీ దందా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, డిసెంబర్ 13: కాల్‌మనీ పేరిట విజయవాడలో మహిళలను లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటన వెలుగుచూడగా కడప జిల్లాలో సైతం ఇటువంటి దందాలు బయల్పడుతున్నాయి. వైఎస్సార్ కడప జిల్లాలో సుమారు వెయ్యి మంది వరకూ చోటా మోటా నాయకులు తమ గాడ్ ఫాదర్లను అడ్డుపెట్టుకుని యథేచ్చగా కాల్‌మనీ దందాను కొనసాగిస్తున్నారు. రాజకీయనేతల అండదండలు ఉండటంతో వీరి జోలికి రావడానికి పోలీసు యంత్రాంగం సైతం జంకుతోంది. కుటుంబ అవసరాల కోసం తమ వద్దకు వచ్చే నిరుపేదలను ఆసరాగా చేసుకుని వందకు రూ. 10 మేర వడ్డీ వసూలు చేస్తూ కొందరు కోట్లకు పడగలెత్తుతున్నారు. పలువురు రాజకీయ నేతల అండదండలున్న చోటా మోటా రౌడీలు, గూండాలు రూ. నాలుగైదు లక్షలు చేతబట్టుకుని రోజూ వారీ వడ్డీలకు తిప్పుతూ జనాన్ని జలగల్లా పీక్కుతింటున్నారు. విజయవాడ ఘటన వెలుగుచూసిన నేపథ్యంలో కడపలోని కాల్‌మనీ మాఫియాలు, రౌడీలు గత రెండు రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లారు. ముఖ్యంగా చిరు వ్యాపారులు, రిక్షా, ఆటో వాలాలు, దినసరి కూలీలు ఈ మాఫియాల బారిన పడుతున్నారు. రూ. 1000లకు ముందుగానే రూ. 100 పట్టుకుని రూ. 900 మాత్రమే అందజేస్తారు. అవసరాన్ని బట్టి రూ. 10 వేల వరకూ బడుగు జీవులకు రుణం ఇస్తుంటారు. రూ. 10వేలు తీసుకుంటే రోజుకు రూ. 100 చొప్పున ప్రతిరోజూ సాయంత్రానికి ఈ మాఫియా సభ్యులు ద్విచక్ర వాహనంపై వచ్చి వసూలు చేసుకుని వెళ్తుంటారు. ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు, కింది స్థాయి ఉద్యోగులు కూడా తమ అవసరాల కోసం ఈ వడ్డీ మాఫియాలను ఆశ్రయిస్తున్నారు. అలాగే క్రికెట్ బెట్టింగ్, మట్కా, జూదం, కోడి పందేలు వంటి వ్యసనాలకు లోనైనవారు ఈ మాఫియాలను ఆశ్రయిస్తున్నారు. రూ. 10వేల నుంచి రూ. లక్ష వరకూ తీసుకునే వారితో ఖాళీ ప్రామిసరీ నోట్లపై సంతకాలు తీసుకుని రెట్టింపు సొమ్ము ఇచ్చినట్లుగా రాసుకుంటారు. రూ. 50 వేలు, రూ. లక్ష దాటితే స్థలం, ఇల్లు లేదా పొలాలను తాకట్టుపెట్టుకోవడమేగాక వారి నుంచి ఖాళీ చెక్కులు సైతం తీసుకుంటున్నారు. నిర్ణీత సమయంలో వారు సొమ్ము చెల్లించలేని పక్షంలో తనఖా పెట్టిన ఆస్తి వదులుకోవాల్సి ఉంటుంది. మాఫియాలు, దళారులు, వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాల్లో వేల మంది చిక్కుకుని బయటపడే మార్గం లేక విలవిల్లాడుతున్నారు. దినసరి వడ్డీకి తీసుకునేవారు వ్యాపారం సాగక నాలుగైదు రోజులు చెల్లించని పక్షంలో చక్ర వడ్డీ, బారువడ్డీలతో వారిని నిలువుదోపిడీకి గురిచేస్తున్నారు. రూ. 50 వేలు, రూ. లక్ష తీసుకున్న వారి నుంచి ఏడాది లోపే అసలుకు మించి వడ్డీ ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. అవమానాలు తట్టుకోలేక పలువురు బడుగు జీవులు తనువు చాలిస్తుంటే మరికొందరు ఊళ్లొదిలి వెళ్లిపోతున్నారంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. బాధితులకు అండగా నిలవాల్సిన పోలీసులు కూడా వడ్డీ వ్యాపారులకు, మాఫియాలకే పరోక్షంగా మద్దతు ఇస్తున్నారు. కొందరు పోలీసులు సైతం మాఫియాలను అడ్డుపెట్టుకుని ఇటువంటి వ్యాపారం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. వడ్డీకి డబ్బు తీసుకున్న వారి ఇళ్లకు వెళ్లి మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం, లైంగిక వేధింపులకు పాల్పడటంతో పాటు మరికొందరు ఒకడుగు ముందుకేసి అప్పు తీసుకున్న వారి ఇళ్లలోని మహిళలను బలవంతంగా తమ వాహనాల్లో తీసుకెళ్లి డబ్బు కట్టి విడిపించుకుని వెళ్లమనడం మాఫియాల చర్యలకు పరాకాష్టగా ఉంది. వీరివెనుక బడా రాజకీయ నేతల హస్తం ఉండటంతో వారిని పోలీసులు సైతం చేష్టలుడిగి తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. కొందరు మహిళలు తమ కుటుంబ పరువును కాపాడుకునేందుకు మాన, ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు. ముఖ్యంగా కడప, ప్రొద్దుటూరు నగరాల్లో ఇటువంటి మాఫియాలు సుమారు వెయ్యి మందికి పైగా ఉన్నట్లు సమాచారం. ప్రతినెలా సుమారు రూ. 100 కోట్లకు పైబడి జిల్లాలో వడ్డీ మాఫియాలు లావాదేవీలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు చొరవ తీసుకుని అక్రమ వడ్డీ వ్యాపారుల దందాలు, మాఫియాలపై కఠిన చర్యలు తీసుకుని పేద ప్రజలకు విముక్తి కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

భవిష్యత్‌లో వైకాపా జీరో: మంత్రి శిద్దా
ఆంధ్రభూమి బ్యూరో
ఒంగోలు, డిసెంబర్ 13: భవిష్యత్‌లో రాష్ట్రంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జీరో అవుతుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు అన్నారు. ఆదివారం ఒంగోలులో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమామావేశంలో ఆయన మాట్లాడుతూ వైకాపాను రాష్ట్రంలోని ప్రజలు అసహించుకుంటున్నప్పటికీ ఆ పార్టీ నేతల్లో మార్పు రావడం లేదని ఆయన ధ్వజమెత్తారు. బాక్సైట్ ఉద్యమం సందర్భంగా జరిగిన బహిరంగ సభలో వైకాపా అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సాక్షిగా ఆ పార్టీకి చెందిన శాసనసభ్యురాలు ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు తల నరుకుతామని దారుణంగా మాట్లాడిన ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనన్నారు. ఈవిషయాన్ని సహించేది లేదని మంత్రి శిద్దా స్పష్టం చేశారు.