రాష్ట్రీయం

పోలవరానికి గండం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 13: కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల వరప్రదాయిని పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో రెండు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రాజెక్టుకు ఇంతవరకు ప్రభుత్వం ఖర్చుపెట్టిన రూ.2200 కోట్లను తిరిగి ఇచ్చేందుకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించింది. కానీ ఈ నిధులను రాష్ట్రానికి విడుదల చేయకుండా ప్రాజెక్టుకే రాష్ట్రం వాటాకింద ఖర్చుపెట్టి సర్దుబాటు చేస్తామని సంకేతాలు పంపింది. గుడ్డిలో మెల్లన్నట్టుగా నిధుల కొరతతో సతమతం అవుతున్న ఆంధ్ర ఈ శుభవార్తను విని ఆనందించేలోగా ఒడిశా ప్రభుత్వం లేచికూర్చుంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనులు వెంటనే నిలిపివేయాలని, రాష్టప్రతి జోక్యం చేసుకోవాలని కోరుతూ ఒడిశాలో అధికార పార్టీ కోరింది. దీంతో రానున్న రోజుల్లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనులు సాఫీగా జరిగేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఒడిశా ప్రభుత్వంతో మంతనాలు జరపడం, ఆ రాష్ట్రం అడిగినంత నష్టపరిహారం ఇవ్వడం, అలాగే కేంద్రంలోని ఎన్డీయే కూటమి ద్వారా ప్రాజెక్టు పనులు వేగవంతం చేసేందుకు విశేషంగా కృషిచేయని పక్షంలో పోలవరానికి కొత్తచిక్కులు వచ్చే ప్రమాదం ఉందని రాష్ట్ర జలవనరుల శాఖ ఉన్నతాధికారులు అంటున్నారు. ఈనెలలో అసెంబ్లీ సమావేశాల తర్వాత పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకరోజు మేధో మథన సదస్సు నిర్వహించి, ఇందులో అధికారులను, వివిధపక్షాలను భాగస్వామ్యం చేసి ఢిల్లీకి వెళ్లాలని యోచిస్తున్నట్టు సమాచారం. అవసరమైతే ఒడిశాకు వెళ్లి సిఎం నవీన్ పట్నాయక్‌తో సమావేశం కావాలని కూడా నిర్ణయించినట్టు తెలిసింది. ఇప్పటికే కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి కూడా ఆంధ్ర ప్రభుత్వం ఒకసారి ఒడిశాతో చర్చించుకుని ప్రాథమిక అవరోధాలు తొలగించుకుంటే బాగుంటుందని సూచించిన విషయం విదితమే. ఈ ప్రాజెక్టును రాజకీయాలకు అతీతంగా ఒడిశాలో బిజెపి, కాంగ్రెస్‌లు వ్యతిరేకిస్తున్నాయి.
పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల మధ్య అఖండ గోదావరిపై నిర్మిస్తున్న 20వేల కోట్ల రూపాయల వ్యయమయ్యే పోలవరం ప్రాజెక్టువల్ల ఒడిశాలో మల్కాన్‌గిరి జిల్లాలో మోతు బ్లాక్‌లో 15 రెవెన్యూ గ్రామాలు, పది శివారు గ్రామాల్లో 7,756 హెక్టార్ల భూమి ముంపునకు గురవుతుంది. అలాగే చత్తీస్‌గఢ్‌లో సుఖ జిల్లాలో కుంట బ్లాక్‌లో కొంత భూమి ముంపునకు గురవుతుంది. చత్తీస్‌గఢ్‌లో బిజెపి అధికారంలో ఉన్నందువల్ల పెద్దగా సమస్యలు తలెత్తకపోవచ్చు. ఇప్పటికే కేంద్రం 1956కు ముందు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పాత భద్రాచలం రెవెన్యూ డివిజన్‌లోని ఐదు మండలాలతోపాటు కుకునూరు, వేలేరుపాడులో ఆంధ్రలో విలీనం చేసింది. దీనికి ప్రతిగా భద్రాచలం దేవాలయం ఉన్న గ్రామం, వెంకటాపురం, చర్ల, దుమ్ముగూడెం మండలాలను తెలంగాణకు ఆంధ్ర రాష్ట్రం వదులుకుంది. ఒకరకంగా తెలంగాణ ప్రభుత్వంతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి వివాదాలు సమసినట్లే. ఒకటి రెండుచోట్ల భూసేకరణ చేయాల్సివచ్చినా, పరస్పర అవగాహనతో పరిష్కరించుకోవచ్చని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు.
పోలవరం అథారిటీ సమావేశం
పోలవరం అథారిటీ సమావేశంలో రాష్ట్రం పోలవరంపై ఖర్చుపెట్టిన రూ.2200 కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది. ఒక జాతీయ ప్రాజెక్టు నిర్మాణంలో 90శాతం నిధులు కేంద్రం ఇస్తే, పది శాతం నిధులు రాష్ట్రం సమకూర్చాలి. పోలవరం విషయంలో వందశాతం నిధులు తామే ఖర్చు పెడుతామని, రూ.2200 కోట్లను ఈ నిధుల్లో సర్దుబాటు చేస్తామని కేంద్రం రాష్ట్రానికి సమాచారం అందించినట్టు తెలుస్తోంది. పోలవరం అథారిటీ సమావేశానికి కేంద్ర జలవనరుల శాఖ సంయుక్త కార్యదర్శి జగన్‌మోహన్ గుప్తా హాజరయ్యారు. రీయంబర్స్‌మెంట్ చేసేందుకు కేంద్రం అంగీకరిస్తూనే, రాష్ట్రం వాటాను కేంద్రం భరిస్తామని తెలిపింది. కేంద్రం ఈ ఏడాది సెప్టెంబర్‌లో రూ.365 కోట్ల నిధులను విడుదల చేసింది. ఇంతవరకు పోలవరం ప్రాజెక్టుపై రూ.7566.58 కోట్ల నిధులను ఖర్చుపెట్టారు. సమావేశానికి హాజరైన కేంద్ర జలవనరుల శాఖ అధికారులు రాష్ట్రం ఇంతవరకు హెడ్‌వర్క్స్‌ను, ఎడమకాల్వ పనుల నిర్మాణాన్ని ఎందుకు చేపట్టలేదని, భూసేకరణ పనుల్లో జరుగుతున్న జాప్యంపై అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది.