రాష్ట్రీయం

ఇద్దరు చంద్రులు కలిసే వేళ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 13: ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు బృందం సోమవారం మధ్యాహ్నాం బేగంపేట విమానాశ్రయం నుంచి విజయవాడ వెళ్తోంది. అయుత చండీహోమంలో పాల్గొనాల్సిందిగా ఆంధ్ర సిఎం చంద్రబాబును ఆహ్వానించేందుకు వెళ్తున్నారు. ఈ సందర్భంగా ఇద్దరు సిఎంలు చంద్రబాబు క్యాంపు కార్యాలయంలో గంటన్నరపాటు చర్చలు జరపుతారు. ముందుగా నిర్ణయించిన కార్యక్రమం ప్రకారం 45 నిమిషాలపాటు కెసిఆర్ బృందం, బాబు బృందంతో కలిసి భోజనం చేస్తుంది. తరువాత 45 నిమిషాలపాటు రెండు రాష్ట్రాలకు సంబంధించిన పలు అంశాల, అమరావతి రాజధాని నిర్మాణంపై చర్చించుకుంటారు. ఓటుకు నోటు కేసు తరువాత ఇద్దరు సిఎంల మధ్య దూరం పెరిగిన తరువాత, అమరావతి శంకుస్థాపనకు చంద్రబాబు కెసిఆర్‌ను ఆహ్వానించారు. కెసిఆర్ అమరావతి ప్రారంభోత్సవానికి వెళ్లినా ప్రత్యేకంగా చర్చలంటూ జరగలేదు. కెసిఆర్ క్యాంపు కార్యాలయానికి చంద్రబాబు వచ్చినప్పుడు ఇద్దరు సిఎంలు స్వల్ప సమయం విడిగా చర్చించుకున్నారు. ప్రధానంగా కెసిఆర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, నీటి కేటాయింపుల్లో తెలంగాణకు ఏవిధంగా అన్యాయం జరిగిందో వివరించడానికే భేటీలో ప్రాధాన్యతనిచ్చారు. తెలంగాణకు జరిగిన అన్యాయం వల్లే ఉద్యమం వచ్చిందని, ఎవరి రాష్ట్రం అభివృద్ధికి వాళ్లు కృషి చేద్దామని కెసిఆర్ సూచించారు. అయితే ఇప్పుడు మాత్రం ఎక్కువ సమయం ఇద్దరు సిఎంలు గడుపుతున్నందున పలు అంశాలపై చర్చించుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇరిగేషన్, విద్యుత్ వంటి అంశాల్లో ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న విబేధాలను చర్చించుకోనున్నారు. అదేవిధంగా గతంలో నూతన రాజధాని అమరావతిలో నిర్మించడం వాస్తు రీత్యా బాగుంటుందని బాబుకు కెసిఆర్ చెప్పిన విషయం తెలిసిందే. రాజ్‌భవన్‌లో గవర్నర్ సమక్షంలో ఇద్దరు సిఎంలు కలిసినప్పుడు అప్పటికి ఇంకా రాజధానిపై నిర్ణయం జరగలేదు. దాంతో అమరావతి అయితే బాగుంటుందని కెసిఆర్ సూచించారు. అమరావతి రాజధాని నిర్మాణం గురించి ఇద్దరి మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉంది. వచ్చే జూన్‌నాటికి సచివాలయంలోని ఆంధ్ర ఉద్యోగులంతా ఆంధ్ర రాజధానికి తరలి రావాలని సిఎం చంద్రబాబు ఆదేశించారు. కొత్త రాజధాని నిర్మాణం జరుగుతున్న తీరు తదితర అంశాలపైనా ఇద్దరు సిఎంలు మాట్లాడుకోనున్నారు. త్వరలోనే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఆంధ్రకు చెందినవారని మంచి చేసుకునే దానిలో భాగంగా కెసిఆర్ విజయవాడ పర్యటనకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అయుత చండీయాగానికి చంద్రబాబు వస్తారని తెరాస నేతలు తెలిపారు. ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య తరుచుగా జరిగే సమావేశాల వల్ల గ్రేటర్ పరిధిలో పెద్ద సంఖ్యలో ఉన్న ఆంధ్ర ప్రాంతం వారిపై సానుకూల ప్రభావం ఉంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు.

చిత్రం.. అయుత చండీయాగానికి హాజరుకావాలంటూ హైకోర్టు
ప్రధాన న్యాయమూర్తి దిలీప్ బి బోస్లేకు ఆదివారం ఆహ్వానపత్రం అందిస్తున్న తెలంగాణ సిఎం కెసిఆర్.