రాష్ట్రీయం

ఒత్తిళ్లకు తలొగ్గం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), డిసెంబర్ 13: రాష్టవ్య్రాప్తంగా సంచలనం సృష్టించిన బెజవాడ కాల్‌మనీ అకృత్యాల కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు విజయవాడ సిపి గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. నిందితుల అరెస్టుకు సంబంధించి పోలీసులపై రాజకీయ ఒత్తిళ్లున్నట్టు జరుగుతోన్న ప్రచారాన్ని ఖండించారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు గ్యాంగ్‌తో ప్రమేయం ఉన్నట్టు విచారణలో తేలితే వదిలేదిలేదని సీపీ స్పష్టం చేశారు. పారదర్శకతతో నిష్పాక్షికంగా విచారణ జరుగుతోందని, ఇందుకు సంబంధించి సిఎం, డిజిపిల నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయన్నారు. రాజకీయ అండదండలతో అధికారులు, వ్యాపారుల పెట్టుబడితో కాల్‌మనీ తిప్పుతూ మహిళలపై లైంగిక ఆకృత్యాలకు పాల్పడుతున్న రాక్షస గ్యాంగ్ అరాచకాలు వెలుగు చూసిన విషయం తెలిసిందే. కాల్‌మనీ ముఠా అప్పు ఉచ్చులోపడిన బాధితురాలు ఒకరు నగర పోలీసు కమిషనర్‌ను ఆశ్రయించటంతో వ్యవహారం వెలుగుచూసిన విషయం తెలిసిందే. సీపీ ఆదేశాలతో రంగంలోకి దిగిన టాస్క్ఫోర్స్ పోలీసులు రాక్షస గ్యాంగ్‌కు చెందిన ఏడుగురిని అదుపులోకి తీసుకుని విచారణ సాగిస్తున్నారు. కాగా గ్యాంగులో కీలక వ్యక్తి, పటమటకు చెందిన యలమంచిలి రామమూర్తి అలియాస్ మూర్తితోపాటు కాంగ్రెస్‌కు చెందిన దూడల రాజేష్‌ను అరెస్టు చేసినట్టు సిపీ సవాంగ్ వెల్లడించారు. ఆదివారం రాత్రి కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ కాల్‌మనీ ముసుగులో మహిళలపై ఘోరాలకు పాల్పడుతున్న గ్యాంగ్‌కు సంబంధించి ఏడుగురు నిందితులను గుర్తించామన్నారు. అరెస్టయిన యలమంచిలి రాము, దూడల రమేష్‌తోపాటు భవానీశంకర్, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రత్నకుమారి సోదరుడు చెన్నుపాటి శ్రీనువాసరావు, ట్రాన్స్‌క్ డివిజనల్ ఇంజనీరు మారంపూడి సత్యానందం, వెనిగళ్ల శ్రీకాంత్, పెండ్యాల శ్రీకాంత్‌లపై కేసులు నమోదు చేశామన్నారు. క్రైం నెంబర్ 694/2015 సెక్షన్ 420, 354ఎ (1), (11) (నిర్భయ), 384, 509, 506 రెడ్‌విత్ 34 120 (బి) ఐపిసి కింద కేసులు నమోదయ్యాయి. అయితే ఎఫ్‌ఐఆర్‌లో నిందితులుగా ఉన్న రాము, దూడల రాజేష్ వినా మిగిలినవారు పరారీలో ఉన్నట్టు సీపి తెలిపారు. వీరికోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని, త్వరలోనే అరెస్ట్ చేస్తామన్నారు. అలాగే కాల్‌మనీ మాఫియాతో సంబంధాలున్న ఏ ఒక్కరినీ వదలేది లేదన్నారు. బాధితుల వివరాలు గోప్యంగా ఉంచుతున్నామని, బాధితులు ఎవ్వరైనా ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. కేసులో పోలీసుల వ్యవహార శైలిపై ఎలాంటి అనుమానాలు లేవన్నారు. సామాజిక రుగ్మతగా పరిణమించిన ఈతరహా నేరాలకు రాజకీయ రంగు పులమొద్దని, అకృత్యాలకు పాల్పడినవారు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని ఖరాఖండిగా చెప్పారు. కాగా గ్యాంగుతో సత్సంబంధాలున్న కీలక వ్యక్తిగా నిందితుల్లో చేరిన ట్రాన్స్‌కో డివిజనల్ ఇంజనీరు ఎం సత్యానందం పరారీలోనే ఉన్నాడు. లబ్బీపేటలోని ఆయన ఇంటితోపాటు, సమీపంలోని అతని తండ్రి ఇళ్ళపై ఆదివారం పోలీసులు దాడులు చేశారు. ప్రస్తుతానికి స్వాధీనం చేసుకున్న డిఇ కారునుంచి ఈ గ్యాంగ్ మార్కెట్‌లో తిప్పుతున్న డబ్బుకు సంబంధించిన విలువైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. సత్యానందాన్ని విధులనుంచి సస్పెండ్ చేసినట్టు ఆ శాఖ ఉన్నతాధికారులు ప్రకటించగా, మరోవైపు ఆయన ఆస్తులకు సంబంధించి అవినీతి నిరోధక శాఖాధికారులు రంగంలోకి దిగి ఆరా తీస్తున్నారు.
chitram..

పోలీసులు అరెస్ట్ చేసిన నిందితులు