రాష్ట్రీయం

కరెంట్‌తో ప్రతిష్ట..కరవుతో కుదుపు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 31: రెండేళ్ల తెరాస పాలనలో సాధించిన విద్యుత్ ప్రగతి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను పెంచితే, తాండవించిన కరవు ఇబ్బంది పెట్టింది. ఆంధ్రప్రదేశ్ చివరి సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పాలనాకాలంలో ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీల వినియోగంపై నిషేధం విధించారు. ఏసీలు వాడొద్దంటూ భారీ హోర్డింగ్‌లూ ఏర్పాటు చేశారు. పరిశ్రలకు వారానికి రెండు రోజుల పవర్ హాలిడే ప్రకటించారు. అలాంటి పరిస్థితుల్లో ఆవిర్భవించిన తెలంగాణ, విద్యుత్ సంక్షోభంలో కూరుకుపోవడం ఖాయమని అంతా భావించారు. కానీ ప్రభుత్వం తీసుకున్న ముందు జాగ్రత్తతో విద్యుత్ అంశమే ప్రభుత్వ ప్రతిష్టను పెంచింది. గత మూడు దశాబ్దాల్లో ఎప్పుడూ లేని విధంగా కోతలులేని వేసవిని చూసే అవకాశం లభించింది. విద్యుత్ అంశంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలు తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టను బాగా పెంచింది. సిఎం కెసిఆర్ మొదటి నుంచీ విద్యుత్ అంశంపై ప్రత్యేక దృష్టి సారించారు.
తెలంగాణ ఏర్పడి రెండేళ్లవుతుంది. ఈ రెండేళ్లూ కరవులోనే గడిచిపోయాయి. కరవు పరిస్థితులు, రైతుల ఆత్మహత్యలు ప్రభుత్వాన్ని కుదుపునకు గురి చేశాయి. రైతుల ఆత్మహత్యల అంశంతోనే ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని విపక్షాలు ప్రయత్నించాయి. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఐదు లక్షల పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తే, సిఎం కెసిఆర్ ఆరు లక్షల పరిహారం ప్రకటించి విపక్షాల ఎత్తులను చిత్తుచేశారు. ఈసారి వర్షాలు బాగా ఉంటాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో తెలంగాణ ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంటోంది. కోటి ఎకరాలకు సాగునీరు అందించే విధంగా ప్రాజెక్టులకు రీ డిజైనింగ్ చేశారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలను సత్వరం పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. విభజన చట్టం ప్రకారం ఆంధ్ర నుంచి న్యాయంగా రావలసిన విద్యుత్ రాకున్నా, ప్రభుత్వం విద్యుత్ అంశంలో కనబర్చిన జాగరూకత సర్కారు ప్రతిష్టను పెంచింది. రాష్ట్రావిర్భావం తరువాత తొలి ఆరునెలలు విద్యుత్ సమస్యను ఎదుర్కొన్నా, తరువాత సమస్య లేకుండా చేయగలిగారు. 2018 నాటికి 25 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి సాధించేలా దామరచర్ల, కొత్తగూడెంలాంటి ప్రాజెక్టుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. మరోపక్క చత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తున్నారు. సింగరేణి ప్లాంటు ద్వారా 1800 మెగావాట్ల విద్యుత్ లభిస్తోంది. వచ్చే మూడేళ్లలో 25 వేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి రానుంది. ఈ ఖరీఫ్ నుంచే పగటి పూట రైతులకు 9 గంటల విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
విద్యుత్ అంశంలో ప్రభుత్వం స్వల్ప, దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించింది. 90వేల కోట్ల వ్యయంతో 2018 నాటికి 25వేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులో వచ్చేలా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రభుత్వ ప్రతిష్టను పెంచిన విద్యుత్ రంగంపై సిఎం ప్రత్యేకంగా దృష్టి సారించారు.