రాష్ట్రీయం

దార్శనికుడు కెసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 31: తెలంగాణలోని రెండు రాజ్యసభ స్థానాలకు ఇద్దరు మాత్రమే నామినేషన్ దాఖలు చేయడంతో తెరాస అభ్యర్థులు ధర్మపురి శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలంగాణ మంత్రులు నాయిని నర్సింహ్మారెడ్డి, అజ్మీరా చందూలాల్, ఈటల రాజేందర్, ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీతోపాటు శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ధర్మపురి శ్రీనివాస్ మాట్లాడుతూ సిఎం కెసిఆర్ గొప్ప దార్శనికుడని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమ కాలంలో తాను కాంగ్రెస్‌లోఉన్నా, తరుచుగా తెలంగాణ అంశంపై చర్చించుకునే వారమన్నారు. నేను చూసిన రాజకీయ నేతల్లో కెసిఆర్ అంతటి విజనరీ ఎవరూ లేరన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వ్యూహరచన చేయడంతోపాటు అధికారంలోకి వచ్చిన తరువాత సాధించిన తెలంగాణను ఏవిధంగా అభివృద్ధి చేయాలనే దానిపై కెసిఆర్‌కు చక్కని విజన్ ఉందన్నారు. ఏ పని ఎవరికి అప్పగించాలనే దానిపై స్పష్టత, మంచి అవగాహన ఉందన్నారు. కెసిఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణ సాకారమవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. కోటి ఎకరాలకు సాగునీటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రభుత్వం లక్ష్యాన్ని సాధించి తీరుతుందని డి శ్రీనివాస్ తెలిపారు. ఢిల్లీలో తనకు ఉన్న పరిచయాలతో తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తానని శ్రీనివాస్ తెలిపారు. రాజ్యసభ సభ్యునిగా తెలంగాణ కోసం తన వంతు కృషి చేస్తానని కెప్టెన్ లక్ష్మీకాంతరావు తెలిపారు. అభ్యర్థుల ఎంపిక బాగుందని, ఇద్దరూ తెలంగాణ కోసం తపించిన నాయకులని రాజ్యసభ ఎన్నికల వ్యవహారాల పరిశీలకులుగా ఉన్న హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి తెలిపారు. ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో ధర్మపురి శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావును తెరాస ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యనేతలు అభినందించారు.

చిత్రం నామినేషన్ల దాఖలు అనంతరం డిఎస్, కెప్టెన్‌లను అభినందిస్తున్న తెరాస ముఖ్యనేతలు