రాష్ట్రీయం

అందమైన అబద్ధాలతో మార్కెటింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 31: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ పాలనలో సాధించిన ఘన విజయాలు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పాలనలోని వైఫల్యాలు, వాగ్ధానాలు అమలు చేయకపోవడంపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ తెరాస నాయకులకు సవాలు విసిరారు.
ఎన్నికలకు ముందు కెసిఆర్ ఇచ్చిన హామీలు ఏ మేరకు అమలయ్యాయన్న దానిపై శే్వతపత్రం విడుదల చేయాలని ఆయన మంగళవారం విలేఖరుల సమావేశంలో డిమాండ్ చేశారు. కెసిఆర్ అందమైన అబద్దాలతో మార్కెటింగ్ చేస్తున్నారని, తెలంగాణలో బిజెపి దూసుకుపోవడాన్ని తెరాస నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన విమర్శించారు. బిజెపికి ఎందుకు ఓటు వేయాలని తెరాస ప్రశ్నించడంపై ఆయన మండిపడుతూ, ప్రజలు తెరాసకే ఎందుకు ఓట్లు వేయాలని ప్రశ్నించారు. తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి దళితుడిని తొలి ముఖ్యమంత్రిని చేస్తామన్న హామీని కెసిఆఆర్ నిలబెట్టుకోనందుకు ఓట్లు వేయాలా? లేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే నిరుద్యోగులకు లక్షలాధి ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీని నిలబెట్టుకోనందుకు ఓట్లు వేయాలా?, కనీసం ఊరికో ఉద్యోగమైనా ఇచ్చారా? అని లక్ష్మణ్ ప్రశ్నించారు.
పేదలకు విశాలమైన ఇళ్లు నిర్మించి ఇస్తామన్న కెసిఆర్, పిచ్చుక గూళ్ళు కట్టినందుకా?, దళితులకు మూడు ఎకరాల భూమి ఇవ్వనందుకా?, రిజర్వేషన్లు కల్పించనందుకా?, తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చనందుకు ఓట్లు వేయాలా? అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో బిజెపి అసోం తరహాలో విజయం సాధిస్తుందన్నారు.
అస్సాంలో కూడా బిజెపికి తొలుత ఐదుగురు ఎమ్మెల్యేలే ఉండేవారని, ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వచ్చిందని డాక్టర్ లక్ష్మణ్ గుర్తు చేశారు. పొత్తుల గురించి ఆలోచించకుండా ఒంటరిగా బలపడేందుకు కృషి చేస్తున్నామని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.