రాష్ట్రీయం

మనది సంకల్ప బలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 31: రాష్ట్ర విభజనను ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకోలేదని, కాంగ్రెస్ పార్టీ అన్యాయంగా రాష్ట్రాన్ని విభజించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. పార్లమెంట్ తలుపులు మూసేసి, వార్ రూంలో చర్చలు జరిపి, యుద్ధ విమానాల్లో బిల్లులు తెచ్చి రాష్ట్రాన్ని ముక్కలు చేశారంటూ తీవ్ర ఆవేదనతో అన్నారు. మంగళవారం ఉద్యోగ సంఘాల నాయకులు, అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. సుస్థిర ప్రభుత్వాలు లేని కాలంలోనే రాష్ట్రంలో ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం స్థిరమైన అభివృద్ధి సాధించిందన్నారు. రాష్ట్ర విభజన కారణంగా రాష్ట్రానికి జరిగిన అన్యాయం, దాని వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను ప్రజలకు తెలియచేసి, వారిని జాగృతం చేసేందుకే జూన్ రెండున నవ నిర్మాణ దీక్ష చేపడుతున్నామని తెలియచేశారు. ఆరోజు ఉదయం 11 గంటలకు రాష్ట్ర ప్రజలంతా నవ నిర్మాణ దీక్ష తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జూన్ మూడున అశాస్ర్తియ విభజన, రాష్ట్రంపై దాని ప్రభావం, విభజన తరువాత రాష్ట్రం ఎదుర్కొంటున్న ఇబ్బందులు అనే అంశంపై సదస్సు నిర్వహిస్తామని చెప్పారు. జూన్ మూడు నుంచి ఏడో తేదీ వరకూ అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో వివిధ అంశాలపై సదస్సులు నిర్వహిస్తామన్నారు. ప్రతికూల పరిస్థితుల్ల సైతం ప్రజలు, ప్రభుత్వం సమిష్టిగా సాధించిన విజయాలు అనే అంశంపై మూడున చర్చిస్తానమి, రాజధాని భూ సమీకరణ, పట్టిసీమ ద్వారా నదుల అనుసంధానం, 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా, సిఐఐ భాగస్వామ్య సదస్సు, ఫైబర్ గ్రిడ్, పారదర్శకంగా పెన్షన్లు, ప్రజా పంపిణీ వంటి అనేక అంశాలపై నాలుగో తేదీన జరిగే సదస్సుల్లో మాట్లాడతామన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా చేసే దిశలో వ్యవసాయం, అనుబంధ రంగాల్లో సాధించిన ప్రగతి, భవిష్యత్ కార్యాచరణ అనే అంశంపై ఐదున చర్చిస్తామన్నారు. పరిశ్రమలు, సేవారంగం, రెగ్యులేటరీ సెక్టార్‌లో ప్రగతి, భవిష్యత్ కార్యాచరణ అనే అంశంపై సదస్సు ఉంటుంది. అదే రోజున జల వనరులే జాతి సంపద అనే స్ఫూర్తితో ప్రాథమికరంగ మిషన్, పొలం పిలుస్తోంది, నీరు-చెట్టు, వాటర్ గ్రిడ్ వంటి వినూత్న కార్యక్రమాల విజయాల గురించి చర్చించనున్నారు. జూన్ ఆరవ తేదీన పరిశ్రమల రంగ మిషన్, వౌలిక సదుపాయాల మిషన్, సేవారంగ మిషన్, విద్యుత్ గ్రిడ్, అత్యధిక మందికి ఉపాధి కల్పించే ఫుడ్ ప్రొసెసింగ్, పర్యాటక రంగాలపై చర్చ ఉంటుందని సిఎం చెప్పారు. జూన్ ఏడవ తేదీన గత రెండేళ్ళలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం, అభృవృద్ధి కార్యక్రమాలు, విజయాలు, రానున్న కాలానికి ప్రణాళిక వ్యూహాలు అనే అంశాలపై సదస్సు జరుగుతుందని అన్నారు. ఎనిమిదవ తేదీన మహా సంకల్పం ఉంటుందని అన్నారు. ప్రజల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని అన్నారు. మండలం యూనిట్‌గా ప్రగతి నివేదికలు రూపొందిస్తున్నామని సిఎం తెలియచేశారు. సమస్యలను సవాలుగా తీసుకుని మిగిలిన రాష్ట్రాలకన్నా మిన్నగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని అన్నారు. రెండో తేదీ నుంచి చేపడుతున్న నవ నిర్మాణ, మహా సంకల్ప కార్యక్రమాల్లో ప్రజలు, అధికారులు, ఉద్యోగులు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎక్కడైతే సమైక్యాంధ్ర ఉద్యమాలు జరిగాయో అక్కడే నవ నిర్మాణ దీక్ష ప్రతిజ్ఞ చేయాలని చంద్రబాబు కలెక్టర్లను ఆదేశించారు. నవ నిర్మాణ దీక్షలకు ప్రత్యేకంగా నోడల్ అధికారుల్ని నియమించాలని సూచించారు. ప్రజల్లో మళ్లీ కసి రగిల్చేలా నవ నిర్మాణ దీక్ష ప్రతిజ్ఞ ఉండాలని ఆయన సూచించారు. నవ నిర్మాణ దీక్ష కార్యక్రమ ప్రచార పాటలతో బుధవారం నుంచి రాష్ట్రాన్ని హోరెత్తించాలని చంద్రబాబు సూచించారు. కలెక్టర్లు, ఇన్‌చార్జ్ మంత్రులకే నవ నిర్మాణ దీక్ష కార్యక్రమ బాధ్యతలు అప్పగించాలని ఆయన సూచించారు. 175 నియోజకవర్గాల్లో అభివృద్ధికి సంబంధించిన సమాచారాన్ని సరళమైన భాషలో ప్రజలకు వివరించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. 8వ తేదీన రాజమండ్రి లేదా ఒంగోలులో రాష్ట్ర స్థాయి కార్యక్రమంగా మహా సంకల్పం చేయాలని చంద్రబాబు సూచించారు.

చిత్రం విజయవాడలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు