రాష్ట్రీయం

నలుగురూ ఏకగ్రీవమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 31: రాష్ట్రం నుంచి రాజ్యసభకు జరుగనున్న ఎన్నికలు ఏకగ్రీవం కానున్నాయి. మొత్తం నాలుగు సీట్లు ఖాళీ అవగా టిడిపి నుంచి ఇద్దరు, బిజెపి, వైకాపా నుంచి ఒక్కొక్కరు ఎన్నిక కావడం ఖాయమైంది. వైకాపా నుంచి ముందు జాగ్రత్తగా పార్టీ ప్రధానకార్యదర్శి విజయసాయిరెడ్డితో పాటు, ఆయన సతీమణి కూడా నామినేషన్ వేసినప్పటికీ.. వారిలో ఒకరి ఉపసంహరణ ఖాయం కావటంతో నలుగురి ఎంపిక ప్రకటన లాంఛనప్రాయమే కానుంది. ఈనెల 11న ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ, మూడో తేదీ ఉపసంహరణ గడువు కావటంతో ఆ తరువాత వీరి ఎన్నిక ప్రకటిస్తారు. మంగళవారం రాజ్యసభ అభ్యర్థులు, ఆయా పార్టీల ఎమ్మెల్యేలతో ఏపి అసెంబ్లీ కోలాహలంగా మారింది. టిడిపి అభ్యర్థులుగా పార్టీ ఎంపిక చేసిన కేంద్రమంత్రి సుజనా చౌదరి, టి.జి.వెంకటేష్, బిజెపి అభ్యర్థిగా కేంద్రమంత్రి సురేష్‌ప్రభు, వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి నామినేషన్‌లు దాఖలు చేశారు. అయితే, ముందు జాగ్రత్తగా విజయసాయిరెడ్డి సతీమణి సునందారెడ్డితో సాంకేతిక, న్యాయ సమస్యలను దృష్టిలో ఉంచుకుని నామినేషన్ వేయించారు. రిటర్నింగ్ అధికారి విజయసాయి రెడ్డి నామినేషన్‌ను ఆమోదిస్తే విజయసాయిరెడ్డి కొనసాగుతారు. లేకపోతే ఆయన భార్య అభ్యర్థి అవుతారు. ఈ వ్యూహంతోనే వైసీపీ విజయసాయి సతీమణిని రంగంలోకి దించింది.
నాలుగో అభ్యర్థిని పోటీలో దింపుతారంటూ టిడిపి నాయకత్వం చివరివరకూ కొనసాగించిన వ్యూహత్మక ఉత్కంఠకు ఆఖరి నిమిషంలో తెరపడింది. వేమిరెడ్డి ప్రభాకర్ నామినేషన్ వేస్తారని తొలుత ప్రచారం చేయటంతో వైసీపీ శిబిరంలో ఉత్కంఠ కనిపించింది. వేమిరెడ్డి నామినేషన్ వేస్తున్నారా? లేదా? అని వైసీపీ నేతలు మీడియా వద్ద ఆరా తీశారు. చివరకు నాలుగవ అభ్యర్ధిని పెట్టడం లేదని తెలియడంతో, వైసీపీ శిబిరం హాయిగా ఊపిరి పీల్చుకుంది.
ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళి
నామినేషన్లు వేసేందుకు వచ్చిన అభ్యర్ధులు పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్‌తో కలసి ఎన్టీఆర్‌ఘాట్ వద్ద ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు. ఏపి కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు, పార్టీ అధ్యక్షుడు కళా వెంకట్రావు, పలువురు మంత్రులు వారి వెంట ఉన్నారు.
ఏపి అభివృద్ధికి కృషి చేస్తా: సురేష్‌ప్రభు
ఏపి అభివృద్ధికి కలసి పనిచేస్తానని కేంద్రమంత్రి సురేష్ ప్రభు హామీ ఇచ్చారు. నామినేషన్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనకు సీటు ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పారు. రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని వ్యాఖ్యానించారు.
ఏపి సమస్యలు బిజెపి తీర్చాలి: సుజన
రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలను బిజెపి తీర్చాలని కేంద్రమంత్రి సుజనా చౌదరి కోరారు. రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం తాము రాజీ లేని పోరాటం సాగిస్తామని చెప్పారు.
లోకేష్ ఆశీస్సులతోనే: టిజి వెంకటేష్
తాను లోకేష్ ఆశీస్సులతోనే రాజ్యసభకు ఎన్నికయ్యానని టిజి వెంకటేష్ చెప్పారు. తనకు అందరూ సహకరించారని కృతజ్ఞతలు చెప్పారు. ఇటీవలి కాలంలో లోకేష్ చాలా యాక్టివ్‌గా మారారని, ఫలితంగా చంద్రబాబుపై ఉన్న పని ఒత్తిడి తగ్గిస్తున్నారని వ్యాఖ్యానించారు.
సురేష్ ఎంపిక ఆనందంగా ఉంది: లోకేష్
కేంద్రమంత్రి సురేష్ ప్రభు ఎంపిక ఆనందంగా ఉందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం సురేష్ ప్రభు కృషి చేస్తారన్న నమ్మకం తమకు ఉందన్నారు. రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం పోరాడే వారినే రాజ్యసభకు పంపించామని లోకేష్ వివరించారు.

చిత్రం రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ దాఖలు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న సురేష్‌ప్రభు, నామినేషన్ వేసి వస్తున్న విజయసాయరెడ్డి ఆయన భార్య సునందారెడ్డి