రాష్ట్రీయం

గ్యాంగ్ రేప్ కేసులో సంచలన తీర్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు లీగల్, మే 31: నెల్లూరు నగరంలోని ఆత్మకూరు బస్టాండు వద్ద భర్త కోసం వేసి ఉన్న మహిళను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడినట్లు నమోదైన కేసులో నిందితులైన 13 మందికి పదేళ్ల జైలుశిక్ష, ఒక్కొక్కరికి రూ. పది వేలు వంతున జరిమానా విధిస్తూ నెల్లూరు ప్రిన్సిపల్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి టివి సుబ్బారావు మంగళవారం సంచలన తీర్పు చెప్పారు. నిందితులైన రాసపల్లి సుబ్రహ్మణ్యం, ఆలంపాటి వెంకటరమణ, రాకాటి వెంకటేష్, వల్లం విజయకుమార్, పసుపులేటి హరి, చిత్తూరు శామ్యేల్, శివలింగం చంద్రకుమార్, షేక్ కరీముల్లా, మధు, ఎ అనోజ్, సిహెచ్ మీరా, కె శ్రీను, బండారి శివకు శిక్ష పడింది.
కాగా మొదటి నుంచి ఏడవ నిందితుల వరకు కిడ్నాప్ అభియోగం కింద అదనంగా పది వేల రూపాయాలు జరిమానా విధించారు. అలాగే మొదటి నిందితుడు రాసపల్లి సుబ్రహ్మణ్యం అభ్యంతరకరమైన అత్యాచారానికి పాల్పడినందుకు అదనంగా మరో పది వేలు జరిమానా, ఐదేళ్ల జైలు శిక్ష విధించారు. ఈ శిక్షలన్నీ నిందితులు ఏకకాలంగా అనుభవించాలని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. నిందితులంతా నెల్లూరు అపోలో ఆసుపత్రి సమీపంలోని వెలగచెట్టు సంగం సర్వేపల్లి కాలువ ప్రాంతంలో నివసిస్తూ చిన్నచిన్న పెయింటింగ్, ఎలక్ట్రికల్ పనులు చేసుకునేవారు. వీరంతా 20 నుంచి 25 ఏళ్ల లోపువారే. చెడు వ్యసనాలకు లోనై రాత్రి సమయంలో విచ్చలవిడిగా తిరిగేవారు. ఈ నేపథ్యంలో 2009 జూన్ 13న రాత్రి 11.30 సమయంలో రంగనాయకులపేటకు చెందిన మహిళ కొన్ని అవసరాల నిమిత్తం ఆత్మకూరు బస్టాండుకు వచ్చింది. ఆమెను అక్కడ వదిలి ఆమె భర్త సమీపంలో ఉన్న షాపులోకి మద్యం బాటిల్ కొనటానికి వెళ్లాడు. అదే సమయంలో ఆటోలో వచ్చిన మొదటి నిందితుడితో సహా ఏడుగురు మహిళ వద్దకు వచ్చి తమతో రమ్మనమని కోరారు. దానికి ఆమె తిరస్కరించగా, ఆమెను బలవంతంగా ఆటోలో ఎక్కించుకొని చింతారెడ్డిపాళెం జాతీయ రహదారి సమీపంలోని ఖాళీ మైదానంలోకి తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న మిగతా నిందితులు కూడా అక్కడకు చేరుకున్నారు. మహిళను 13 మంది నిందితులు ఒకరి తరువాత ఒకరు అతి దారుణంగా హింసించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. వీరిలో మొదటి నిందితుడు సుబ్రహ్మణ్యం ఆ మహిళ పట్ల అనాగరికంగా ప్రవర్తించి అభ్యంతరకరమైన అత్యాచారానికి పాల్పడ్డాడు. మహిళ కిడ్నాప్ సంఘటనపై ఆమె భర్త అదేరోజు రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు విచారించి తెల్లవారుజామున ఐదున్నర గంటల సమయంలో అచేతనంగా మైదానంలో పడి ఉన్న ఆమెను కనుగొని ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. ఈ సంఘటనలోని నిందితులను 2009 జూన్ 20న జొన్నవాడ రోడ్డు సమీపాన పోలీసులు అరెస్టు చేశారు. ఈమేరకు నిందితులు 13 మందిపై పోలీసులు చార్జిషీటు దాఖలు చేశారు. సభ్యసమాజం తలదించుకునేలా మహిళపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన 13మంది నిందితులకు కఠిన శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరఫున అడిషనల్ పిపి శ్రీనివాసమూర్తి వాదించారు.