రాష్ట్రీయం

రోళ్ల్లు పగిలే ఎండలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 28: రోహిణీ కార్తెలో నిజంగానే రోళ్ల్లు పగిలేలా ఎండలు మండుతున్నాయి. ఎండాకాలం ముగిసే సమయంలో రోహిణీ కార్తె వస్తుంది. ఈ పర్యాయం ఇది మే 25 నుండి జూన్ 8 వరకు ఉంటుంది. గత నాలుగు రోజుల నుండి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు గత నాలుగు నెలల్లో లేని విధంగా బాగా పెరిగాయి. తెలంగాణలోని రామగుండంలో శనివారం 46.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదుకాగా, కోస్తాంధ్రలోని జంగమేశ్వరపురంలో 46 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో 43 డిగ్రీలు ఆపైగా నమోదవుతోంది. ఈ పరిస్థితి మరో రెండు, మూడు రోజుల పాటు కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) ప్రకటించింది. గాలిలో తేమ శాతం తక్కువగా ఉండటం వల్ల చాలా ప్రాంతాల్లో ఉక్కపోతగా ఉంటోందని ఐఎండి హైదరాబాద్ డైరెక్టర్ వైకె రెడ్డి తెలిపారు.
ఇలా ఉండగా నైరుతీ రుతుపవనాలు రావడంలో జాప్యం జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ రుతుపవనాలు అరేబియా సముద్రం నుండి ముందుకు కదలడం లేదు. హిందూమహాసముద్రంలో, అరేబియా సముద్రంలో అల్పపీడన ద్రోణి, తుపాన్లు వస్తే రుతుపవనాలు ముందుకు కదిలే అవకాశం ఉంటుందని ఐఎండి జాతీయ శాస్తవ్రేత్త చరణ్ సింగ్ తెలిపారు. ఇలా ఉండగా అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని ఆయన వెల్లడించారు.