రాష్ట్రీయం

మాజీ ఎంపి విఠల్‌రావు కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, మే 28: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మహబూబ్‌నగర్ మాజీ ఎంపి విఠల్‌రావు శనివారం కన్నుముశారు. గత కొంతకాలంగా అనారోగ్యంగా ఉన్న ఆయన ఇటీవల హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రి నుండి డిశ్చార్జి అయ్యి ఇంటింటికి వచ్చారు. 1947 నవంబర్ 14 మహబూబ్‌నగర్ జిల్లా బొంరాస్‌పేట మండలం లగచర్ల గ్రామంలో విఠల్‌రావు జన్మించారు.
2004 ఎన్నికల్లో మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానానికి ఎన్నికయ్యారు. 2009లో కూడా కెసిఆర్‌పై పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి చెందారు. గాంధీ భవన్‌లో దాదాపు పదేళ్ల పాటు కోశాధికారిగా బాధ్యతలు నిర్వహించారు. ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి అత్యంత సన్నిహితుడిగా ఉండే విఠల్‌రావుకు జిల్లాలో 2004లో ఎంపి టిక్కెట్ ఇచ్చి ఆదరించారు.
ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి హాయంలో ఢిల్లీ నుండి వచ్చే నిధులు రాబట్టడంలో విఠళ్‌రావు కీలకపాత్ర పోషించారు. ఉస్మానియా యూనివర్సిటీలో బిఎ ఎల్‌ఎల్‌బి చేసిన విఠల్‌రావు ముందుగా వ్యాపారంలో ఉంటూ అనంతరం కాంగ్రెస్ పార్టీలోకి అడుగుపెట్టారు. ఆయనకు 1971 జూలై 7వ తేదీన నిర్మలతో వివాహం జరిగింది. ఆయనకు నలుగురు కుమారులు, ఇద్దరు కుమారైలు ఉన్నారు.