రాష్ట్రీయం

విలువలు కోల్పోతున్న పత్రికారంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 28: పత్రికా రంగం విలువలు కోల్పోతున్నదని ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. సమాజానికి దిశ-దశ నిర్దేశం చేయాలని ఆయన పాత్రికేయులకు పిలుపునిచ్చారు. శనివారం నారద జయంతి సందర్భంగా సమాచార భారతి ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మండలి బుద్ధ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సమాచార భారతి ఎంపిక చేసిన నలుగురు సీనియర్ జర్నలిస్టులు రాకా సుధాకర్, సుప్రశాంతి దేవి, నర్సింగ్‌రావు, సతీశ్‌కు ఉత్తమ జర్నలిస్టు అవార్డులు అందజేశారు. అనంతరం బుద్ధ ప్రసాద్ ప్రసంగిస్తూ నారదుడు ప్రపంచ పాత్రికేయులకు ఆదర్శప్రాయుడని అన్నారు. నారదుడు అనగానే తగాదాలు సృష్టించాడన్న అభిప్రాయం కలుగుతుందని ఆయన చెప్పారు. అయితే నారదుడు ఏది చేసినా లోకకల్యాణం కోసమే చేశారని ఆయన వివరించారు. ఎక్కడ చెడు ఉంటే దానిని రూపుమాపేందుకు కంకణం కట్టుకుని దేవతామూర్తులకు చెప్పి లోకకల్యాణం కోసం కృషి చేశారని ఆయన తెలిపారు. నారదుడు నారద మహర్షి అని, విజ్ఞాన గని అని ఆయన ప్రస్తుతించారు. నారదునికి అన్ని రంగాల్లోనూ ప్రవేశం ఉందని అన్నారు. ఇప్పుడు అన్ని వ్యవస్థలు విలువలు కోల్పోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా పత్రికా వ్యవస్థ విలువలు కోల్పోరాదని అన్నారు. పత్రికా వ్యవస్థ విలువలు కోల్పోతే సమాజానికి మంచి-చెడుపై విశే్లషణ అందించేందుకు ఆస్కారం లేకుండా పోతుందని ఆయన తెలిపారు. శాసన, న్యాయ వ్యవస్థలనూ దారిలో పెట్టేదీ కేవలం పత్రికా రంగమేనని అన్నారు. తానూ లోగడ పత్రికను నడిపించానని, సంపాదకునిగా పని చేశానని ఆయన గుర్తు చేసుకున్నారు. పాత్రికేయులు ఎక్కడా రాజీపడకుండా సమాజానికి దిశ-దశ నిర్దేశం చేయాల్సిందిగా ఆయన కోరారు. మంచిగా మాట్లాడకుండా ఘాటైన విమర్శలు, ఆరోపణలు చేస్తేనే పత్రికల్లో పతాక శీర్షికల్లో వార్తలు వస్తుంటాయని ఆయన తెలిపారు. కాబట్టి పాత్రికేయులు మానవాళి శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని, పత్రికా రంగం విలువలు పెంచేలా కృషి చేయాలని మండలి బుద్ధప్రసాద్ కోరారు.
స్వామిగౌడ్ సందేశం
ఇలాఉండగా ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయిన తెలంగాణ శాసనమండలి (కౌన్సిల్) చైర్మన్ కె.స్వామిగౌడ్ అభినందనలు తెలియజేస్తూ సందేశం పంపించారు. లోకకల్యాణం కోసం నారద మహర్షి చేసిన గొప్ప కార్యక్రమాల గురించి తన సందేశంలో వివరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో సమాచార భారతి ఉపాధ్యక్షుడు బి.నర్సింహమూర్తి, కిస్మత్‌కుమార్, విజయసారథి తదితరులు పాల్గొన్నారు.