రాష్ట్రీయం

విద్వేషాలతో వినాశమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మే 28: ఏపి, తెలంగాణల్లో జలవనరుల వినియోగం, నీటి ప్రాజెక్టుల అంశాలపై విద్వేషాలతో వ్యవహరిస్తే ఇరు రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోతారని ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు హితవు చెప్పారు. ఈ విషయంలో సంయమనంతో వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. మహానాడులో రెండవరోజైన శనివారం 11 తీర్మానాలను ఆమోదించారు. ఇందులో భాగంగా ‘సాగునీటి ప్రాజెక్టులు- తెలంగాణ ప్రభుత్వ అసమగ్ర విధానాలు’ అనే తీర్మానాన్ని రేవూరి ప్రకాశ్‌రెడ్డి ప్రవేశపెట్టారు. ఈసందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ గతంలో తెలంగాణలో తెలుగుదేశం ప్రభుత్వం అనేక ప్రాజెక్టులను చేపట్టిందన్నారు. వాటిని పూర్తిచేసుకునే హక్కు తెలంగాణ ప్రభుత్వానికి ఉందంటూనే, తాజాగా అక్కడి ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులపై సంయమనంతో వ్యవహరించాలన్నారు. వీటి విషయమై అపెక్స్ కౌన్సిల్ దృష్టికి తీసుకువెళ్లడం ఉత్తమమని అభిప్రాయపడ్డారు. ఏకపక్షంగా వ్యవహరించడం తెలంగాణకు సరికాదన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు తమ ఇష్టానుసారం ప్రాజెక్టులు నిర్మిస్తుండటంతో దిగువనున్న ఏపి, తెలంగాణకు తీరని నష్టం కలుగుతుందని అన్నారు. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌లో రాష్ట్ర హక్కులను సరిగా వినిపించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. దీనివల్ల మన హక్కులు దెబ్బతినే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ సమయంలో ఏపిలో ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి బాధ్యతగా వ్యవహరించకుండా తెలంగాణలో తమ పార్టీవారికి కాంట్రాక్ట్‌లు ఇప్పించుకుంటూ ఏపిలో విమర్శలు చేయడం దారుణమన్నారు.
కాగా తీర్మానం ప్రవేశపెట్టిన రేవూరి ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ కెసిఆర్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టి కలకాలం అధికారంలో కొనసాగడానికి కుయుక్తులు పన్నుతోందని ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు వెనుకబడిన ప్రాంతమైన తెలంగాణను అభివృద్ధి పరచడానికి ప్రత్యేక దృష్టి సారించింది టిడిపి ప్రభుత్వమే అన్నారు. అయితే రీ డిజైన్ పేరుతో కెసిఆర్ మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలతో కుమ్మక్కై ప్రజలకు తీరని ద్రోహం తలపెడుతున్నారన్నారు. తెలంగాణ సెంటిమెంట్‌తో అధికారంలోకి వచ్చిన కెసిఆర్ తిరిగి నీటి ప్రాజెక్టుల సెంటిమెంట్‌తో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడని అన్నారు. కాలయాపన చేయడం ద్వారా 2019లో కూడా అధికారంలోకిరావచ్చని కలలు కంటున్నారని అన్నారు.
కర్ణాటక ప్రభుత్వం అల్మట్టి ప్రాజెక్టు ఎత్తును 524 మీటర్ల ఎత్తుకు పెంచుతోందని, మహారాష్ట్ర బాబ్లీతోసహా అనేక ప్రాజెక్టులు కడుతున్నారని టిడిపి ఆనాడే హెచ్చరించిందని అన్నారు. అనధికారికంగా 450 ప్రాజెక్టులు
అనధికారికంగా కట్టారని చెబుతున్న కెసిఆర్ వారిని నిలువరించేందుకుగాని, కేంద్రానికి ఫిర్యాదు చేసేందుకు గాని ప్రయత్నించలేదన్నారు. కృష్ణా, గోదావరి జలాల పంపిణీకి మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రప్రభుత్వాలు ట్రిబ్యునల్ నిబంధనలు అతిక్రమిస్తున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలు కలసి పోరాడాల్సి ఉండగా వారితో ఒప్పందాలు కుదుర్చుకోవడం బాధ్యతారాహిత్యమన్నారు. ఎన్నికలకు ముందు ప్రాణహిత, చావెళ్ళ ప్రాజెక్టులు జాతీయ ప్రాజెక్టులు కావాల్సిందేనని కెసిఆర్ చెప్పారని, అయితే నేడు రీ డిజైన్ చేస్తూ కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్పు చేస్తున్నారన్నారు. తద్వారా తుమ్మడిహట్టి, ఎల్లంపల్లి ప్రాజెక్టును మేడిగడ్డ, ఎల్లంపల్లికి మార్చడం ద్వారా అదిలాబాద్‌కు మాత్రమే పరిమితమై వ్యయం పెరుగుతుందన్నారు. గతంలో ప్రాజెక్టుకు 38వేల 500 కోట్లు కాగా రీ డిజైన్ చేసే 84వేల కోట్లు ఖర్చు అవుతుందని ఇది వారు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై నిధులు స్వాహా చేయడానికే ఉపయోగపడుతుందన్నారు.