రాష్ట్రీయం

రాజధానికి డ్రీమ్ వర్క్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 28: తెలంగాణతో కలిసి పనిచేసేందుకు అమెరికాలోని పలు కంపెనీలు ముందుకొస్తున్నాయి. హాలీవుడ్ టాప్ మూవీ ప్రొడక్షన్ కంపెనీ డ్రీమ్ వర్క్స్ తన వ్యాపార విస్తరణకు తెలంగాణను ఎంపిక చేసుకుంది. పెట్టుబడులను ఆకర్షించేందుకు అమెరికాలో పర్యటిస్తున్న ఐటి, మున్సిపల్ వ్యవహారాల మంత్రి కె తారక రామారావు తన ఐదవ రోజు పర్యటనలో లాస్‌ఏంజిలిస్‌లో వివిధ సంస్థలను కలిశారు. డ్రీమ్ వర్క్స్ ప్రధాన కార్యాలయంలో సిఇఓ జెఫ్రీ కాట్జన్ బర్గ్‌తో భేటీఅయ్యారు. తెలంగాణ పారిశ్రామిక విధానం, రాష్ట్రంలోని అవకాశాలను కెటిఆర్ వివరించారు. భారత్‌కు వ్యాపారాన్ని విస్తరించే ఆలోచన ఉందని, తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని జెఫ్రీ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. దీర్ఘకాలిక ప్రణాళికల అమలుకు టి.సర్కారు భాగస్వామ్యం కోరుతున్నామన్నారు. దీంతోపాటు తమ సినిమాల ప్రమోషన్‌కు హై ఎండ్ ఎకో సిస్టమ్‌తో ఒక థియోటర్ నిర్మిస్తామని, అందుకు సహకరించాలని జెఫ్రీ కోరారు. దీనికి స్పందించి కెటిఆర్ డ్రీమ్ వర్క్స్‌కు సహకరిస్తామని హామీ ఇచ్చారు. డ్రీమ్ వర్క్స్ విస్తరణకు అంతర్జాతీయ స్థాయిలో త్వరలో హైదరాబాద్‌లో నిర్మించే ఫిల్ట్ సిటీ అత్యంత అనుకూలంగా ఉంటుందని కెటిఆర్ తెలిపారు. పర్యాటకులను ఆకర్షించేందుకు హైదరాబాద్‌లో చిన్నతరహా థీమ్ సెంటర్ , డ్రీమ్ ప్లేను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, డ్రీమ్ వర్క్స్ ఉమ్మడి సమావేశంలో నిర్ణయించారు. ఈమేరకు అవగాహన కుదుర్చుకున్నారు. హైదరాబాద్‌కు వచ్చి భారత మార్కెట్ అవసరాలు, స్థానిక నైపుణ్యాన్ని పరిశీలించాలని జెఫ్రీని కెటిఆర్ ఆహ్వానించారు. తర్వాత లాస్‌ఏంజిల్స్ ఇన్నోవేషన్ సెంటర్ ఐ- హబ్ ఇంక్యుబేటర్‌ను కెటిఆర్ సందర్శించారు. నీటి సంరక్షణతోపాటు మురుగునీటి శుద్ధిలో వినూత్నమైన పద్ధతులు అవలంభిస్తున్న ఐ-హబ్ పనితీరును కెటిఆర్ అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన టి-హబ్ గురించి కెటిఆర్ వారికి వివరించారు. టి-హబ్‌కు తగిన సహకారం అందించాలని, కలిసి పని చేయాలని కెటిఆర్ కోరారు. ఇంక్యూబేటర్ సిఇవోను కెటిఆర్ హైదరాబాద్‌కు ఆహ్వానించారు.

chitram డ్రీమ్ వర్క్స్ కంపెనీ ప్రతినిధులతో భేటీ అయన మంత్రి కెటిఆర్