రాష్ట్రీయం

కొత్త కొలువులు వస్తున్నాయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 28: తెలంగాణ రాష్టవ్యాప్తంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు వచ్చే ఆరు నెలల వ్యవధిలో భారీ సంఖ్యలో ఉద్యోగులను నియమించనున్నాయి. ఈ రంగంలో మొత్తం కొత్త ఉద్యోగుల సంఖ్య గణనీయంగా పెరగనుందని, సుమారు 72శాతం ఉద్యోగాలు పెరుగుతాయని టిఎంఐ నిర్వహించిన సర్వేలో తేలింది. హైదరాబాద్ కేంద్రంగా గత పాతికేళ్లుగా మానవ వనరుల సేవలు అందిస్తున్న టిఎంఐ ఈఏడాది ఏప్రిల్‌లో నిర్వహించిన సర్వేలో ఈ విషయం తేలింది. ప్రతి త్రైమాసికంలో పెద్ద కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగ సృష్టి ఎలా ఉందన్న విషయమై సర్వేలు వస్తూనే ఉన్నాయని, దేశంలో అత్యధికంగా ఉద్యోగాలిస్తున్న ఎంఎస్‌ఎంఇ సెక్టారులో కొత్త ఉద్యోగాల అందుబాటుపై ఈ సర్వే అవగాహన కల్పించిందని టిఎంఐ ఎండి టి మురళీధరన్ పేర్కొన్నారు. వచ్చే ఆరు నెలల వ్యవధిలో కొత్త ఉద్యోగాలు ఉండబోవని 28 శాతం యాజమాన్యాలు పేర్కొనగా, 72శాతం మంది మాత్రం కొత్త ఉద్యోగులను తీసుకునే ఆలోచన ఉందని పేర్కొన్నారు. 91శాతం మంది గత ఆరు నెలలతో పోలిస్తే నియామకాల సంఖ్య పెరిగిందన్నారు. ప్రారంభ, మధ్యస్థాయిల్లో కొత్త ఉద్యోగాలు అధికంగా ఉండనున్నాయని, ఈ రెండు విభాగాల్లో 77 శాతంమేర కొత్త ఉద్యోగాలకు అవకాశం ఉందన్నారు. ఇంకా చెప్పాలంటే 40 శాతం ఎంట్రీ లెవెల్, 37 శాతం మిడ్ లెవెల్ పొజిషన్‌లో ఉద్యోగాలు రానున్నాయని, 18 శాతం సీనియర్ లెవెల్, 5 శాతం టాప్ మేనేజిమెంట్ స్థాయి ఉద్యోగాలు వస్తాయని నివేదిక వివరించింది. డిప్లొమో చేస్తే చాలు ఉద్యోగాలు ఇస్తాం అంటూ 67 శాతం యాజమాన్యాలు పేర్కొనడం ఆశ్చర్యకరం. సేల్స్, మార్కెటింగ్ విభాగాల్లో సరైన ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవడం కష్టతరంగా ఉందని 34 శాతం మంది వెల్లడించారు. ఆపై అకౌంట్ ప్రొఫెషనల్స్, కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌ల లభ్యత కష్టంగా ఉందని పేర్కొన్నారు. ఎంఎస్‌ఎంఇ సెక్టారులో భారీస్థాయిలో ఉద్యోగ అవకాశాలు దగ్గర కానున్నాయని, ఫ్రెషర్స్‌తో పాటు మూడు నుండి ఏడేళ్ల అనుభవమున్న ప్రొఫెషనల్స్ సరైన అవకాశాలు అందుకోనున్నారని నివేదిక వివరించింది. అంతర్గత రిఫరెన్స్ ద్వారా ఉద్యోగులను తీసుకోవడం ఉత్తమమని 43.1 శాతం యాజమాన్యాలు పేర్కొన్నాయి.