రాష్ట్రీయం

రాజధానిలో అన్న విగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మే 28: పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమంకోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహానేత ఎన్‌టి రామారావుకు భారతరత్న ఇవ్వాలని టిడిపి జాతీయ అధ్యక్షుడు, సిఎం చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మహానాడులో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. తిరుపతిలో జరుగుతున్న మహానాడులో రెండోరోజైన శనివారం తెలంగాణ సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు మాట్లాడుతూ దళితులు, గిరిజనులకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్న చంద్రబాబు అమరావతిలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుండటం గొప్ప విషయమన్నారు. అయితే ప్రజా సంక్షేమమే లక్ష్యంగా, తెలుగు భాషా పరిరక్షణే ధ్యేయంగా పనిచేసిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు దివంగత ఎన్‌టిఆర్ విగ్రహాన్ని కూడా అమరావతిలో ఏర్పాటుచేయాలని కోరారు. ఆ తరువాత మాట్లాడిన ఎంపి మురళీమోహన్ ఎన్‌టిఆర్ నటుడుగా, రాజకీయ నాయకుడిగా ప్రజలకు ఎంతో చేశారన్నారు. ఈ క్రమంలో ఆయనకు భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని కోరాలన్నారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ మనం కృష్ణుడిని చూడలేదని, ఇతర దేవుళ్ళను చూడలేదని అయితే ఎన్‌టిఆర్ ఏ దేవతామూర్తి పాత్ర వేసినా ఆ దేవుడు ఇలానే ఉంటాడనే భావన ప్రజలకు కలిగిందని అన్నారు. అందుకే ఎన్‌టిఆర్‌ను ప్రజలు దైవసమానుడిగా చూసుకుని పూజించారన్నారు. అలాంటి యుగ పురుషుడికి భారతరత్న ఇవ్వాలని మహానాడులో తీర్మానం చేస్తున్నామన్నారు. ఎన్‌టిఆర్ పేరు ఒక సంచలనమని, తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడిన వ్యక్తి అని కొనియాడారు. అందుకే 35వ మహానాడులో 35 మీటర్లు అంటే 115.5 అడుగుల ఎత్తున్న ఎన్‌టిఆర్ విగ్రహాన్ని రాష్ట్ర రాజధాని అమరావతిలో ఏర్పాటు చేయాలని తీర్మానం చేస్తున్నామని ఇందుకు కార్యకర్తలు ఆమోదం తెలపాలని కోరారు. సమాజమే దేవాలయం-ప్రజలే దేవుళ్లు అని తన సిద్ధాంతాన్ని ఎలుగెత్తిన చాటిన ఎన్‌టిఆర్ ఆశయ సాధన దిశగా తాను పనిచేస్తున్నానని చెప్పారు. అందుకే పేదరికం లేని సమాజం టిడిపి లక్ష్యమన్నారు. ఎన్‌టిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు ఉచిత అన్నదానం ఏర్పాటు చేయాలని టిటిడిని నిర్దేశించి, అమలు చేయించారన్నారు. ఆ స్ఫూర్తితోనే పేదలకు అన్నదానం చేయడానికి అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తామని సిఎం మహానాడు వేదికపై ప్రకటించారు.
బచావత్ అవార్డు ప్రకారం మిగులు జలాలను సద్వినియోగం చేసుకోవడానికి ప్రాజెక్టుల నిర్మాణాన్ని ప్రారంభించిన ఘనత కూడా ఎన్‌టిఆర్‌కే దక్కుతుందని అన్నారు. అందులో భాగంగానే తెలుగుగంగ, గాలేరు-నగరి, హంద్రి-నీవా, ఆర్ బిసి, మాధవరెడ్డి కెనాల్‌ను ఏర్పాటు చేశారన్నారు. ఆయనలా ప్రతి కార్యకర్తల కష్టపడే మనస్తత్వాన్ని పెంచుకుని, నైపుణ్యాన్ని పెంచుకోవాలన్నారు. తెలుగుదేశం పార్టీకి పేరు పెట్టాలనుకున్నప్పుడు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా తెలుగుదేశం అని పేరుపెట్టారని, తెలుగుజాతిపై ఆయనకున్న అపారమైన ప్రేమకు నిదర్శనమన్నారు. ఆయన స్ఫూర్తితోనే తాను ముందుకు వెడుతున్నట్లు చెప్పారు. కార్యకర్తలు నాయకులు కూడా ఆ బాటలో నడవాలన్నారు. ఇదిలావుండగా, తిరుపతిలో జరుగుతున్న టిడిపి మహానాడులో రెండోవరోజైన శనివారం ఎన్ టి ఆర్ జయంతిని పురస్కరించుకుని ముందుగా స్థానిక టౌన్‌క్లబ్ జంక్షన్ వద్దవున్న ఎన్‌టిఆర్ విగ్రహానికి హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డిలతో కలసి పాలాభిషేకం చేసి, పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం మహానాడు చేరుకుని వేదిక వద్ద ఉన్న ఎన్‌టిఆర్ విగ్రహానికి పూల మాలవేసి శ్రద్దాంజలి ఘటించారు. అనంతరం బాబు కేక్‌ను కట్ చేసి బాలయ్యకు తినిపిస్తే, బాలయ్య చంద్రబాబు నాయుడికి తినిపించారు.