రాష్ట్రీయం

వాటాలు తేల్చాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 25: కృష్ణా జలాల వినియోగం, అక్రమ ప్రాజెక్టులపై ఆంధ్ర, తెలంగాణ మధ్య పరస్పర ఆరోపణలు తారాస్ధాయికి చేరుకున్న నేపథ్యంలో కృష్ణా బోర్డు సమావేశం 27న శుక్రవారం ఇక్కడ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. సమావేశానికి ఇరు రాష్ట్రాల జలవనరుల శాఖ కార్యదర్శులు, ఇఎన్‌సిలు, సాగునీటి నిపుణులు హాజరవుతున్నారు. ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణ, కొత్త ప్రాజెక్టులు, నీటి యాజమాన్యం తదితర 11 అంశాలపై చర్చ జరగనుంది. పాలమూరు- రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల స్కీంల నిర్మాణానికి ఉమ్మడి రాష్ట్రంలోనే జీవోలు ఇచ్చారని, ఆ ప్రాజెక్టుల ద్వారా 135 టిఎంసి నీటిని తీసుకెళ్లే హక్కు తమకుందని తెలంగాణ రాష్ట్ర ఇంజనీర్లు బలంగా వాదన వినిపించనున్నారు. కాగా కృష్ణా, గోదావరి నదులపై నూతన ప్రాజెక్టుల రూపకల్పన ప్రణాళిక ఆయా నదీ యాజమాన్య బోర్డు, కేంద్ర జల సంఘాల అనుమతి ఆమోదం తర్వాతే జరగాలని ఏపీ పునర్విభజన చట్టం సెక్షన్ 84 (3) పేర్కొందనే వాదనను ఏపి ప్రభుత్వం కృష్ణా బోర్డు ముందుంచనుంది.
నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణపై ఇంతవరకు సయోధ్య కుదరలేదు. ఈ అంశంపైన రెండు రాష్ట్రాలు చర్చించనున్నాయి. గత ఏడాది జూన్ నెలలో ఇరు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వినియోగంపై ఎంఓయూ ఖరారైంది. దీనిపై ఇరు రాష్ట్రాల కార్యదర్శులు సంతకాలు చేశారు. ఇరు ఇఎన్‌సిలు, కృష్ణా బోర్డు కార్యదర్శితో కలిపి ఒక వర్కింగ్ గ్రూపును కూడా ఏర్పాటు చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా జలవిద్యుత్ ఉత్పత్తి చేస్తూనే శ్రీశైలం కుడి కాల్వ, నాగార్జునసాగర్ ప్రాజెక్టు, కృష్ణా డెల్టా, తెలుగు గంగ నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని నీటిని వినియోగించుకోవాలనే ఒప్పందం కుదిరింది. ఈ కమిటీయే రాజోళి బండ, కెసి కెనాల్‌కు తుంగభద్ర జలాల విడుదల విషయాన్ని పర్యవేక్షించాలి. కాని ఆచరణలో ఈ ఎంఓయూ విఫలమైంది. ఇరు రాష్ట్రాలు ఎవరి వాదనలకు వారు కట్టుబడి ఉన్నారు. రాజోళి బండ ఎత్తుపెంచాలని, ఉమ్మడి రాష్ట్రంలోనే రూ. 58 కోట్ల నిధులు విడుదలయ్యాయని తెలంగాణ కోరితే, ఆ ప్రాజెక్టు ఎత్తును పెంచరాదని ఆంధ్ర ప్రభుత్వం కర్నాటకను కోరింది. దీంతో రెండు రాష్ట్రాల రైతుల మధ్య ఉద్రిక్తత పరిస్ధితులు నెలకొన్నాయి. ఆంధ్ర ప్రభుత్వం నుంచి జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యానాథ్ దాస్, ఇంజనీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావు, తెలంగాణ నుంచి జలవనరుల శాఖ కార్యదర్శి ఎస్‌కె జోషి, నీటిపారుల రంగ నిపుణులు, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కె విద్యాసాగర్‌రావు హాజరుకానున్నారు.