రాష్ట్రీయం

కొత్తగా చెప్పేదేం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 9: ఉస్మానియా వర్శిటీలో బీఫ్ ఫెస్టివల్ నిర్వహణపై సిటీ సివిల్ కోర్టు ఇచ్చిన స్టేటస్ కో (యథాతథ స్థితి)ని కచ్చితంగా అమలుచేయాలని హైకోర్టు బుధవారం ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఉస్మానియా వర్శిటీకి చెందిన కె రాజు అనే విద్యార్థి దాఖలు చేసిన పిటిషన్‌ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి భోంస్లే, జస్టిస్ ఎస్‌బి భట్ విచారించారు. సిటీ సివిల్ కోర్టు జారీచేసిన ఉత్తర్వులకు అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని, అందరూ చట్టానికి లోబడి వ్యవహరించాలని, తాజాగా మరే ఆదేశాలు ఈ కేసులో అక్కర్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. డెమాక్రటిక్ కల్చరల్ ఫోరం ఈనెల 10న నిర్వహించతలపెట్టిన బీఫ్ ఫెస్టివల్ జరగకుండా చర్యలు తీసుకోవాలని, దీనివల్ల వర్శిటీలో అకడమిక్ వాతావరణం చెడిపోతుందని విద్యార్థి కె రాజు పిటిషన్‌లో కోరారు. ఈ సందర్భంగా కోర్టు జోక్యం చేసుకుని విద్యార్థులు ఏమైనా కేటరింగ్ కోర్సును నేర్చుకుంటున్నారా? డిసెంబర్ 10న బీఫ్ ఫెస్టివల్ ఎందుకు నిర్వహిస్తున్నారని వ్యాఖ్యానించింది. తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది ఏ సంజీవ్‌కుమార్ వాదనలు వినిపిస్తూ ప్రభుత్వం ఇప్పటికే కోర్టు ఆదేశాల మేరకు అన్ని చర్యలు తీసుకుందని, వర్శిటీ అధికారులు క్యాంపస్‌లో శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా శాంతి పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను కోరారని తెలిపారు. 2011నుంచి ఈ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నారని, ఇంతవరకు 8కేసులు నమోదయ్యాయని, విద్యార్థుల మధ్య ఘర్షణ సంఘటనలు కూడా జరిగాయని ఆయన కోర్టుకు వివరించారు. విద్యార్థులు వర్శిటీ క్యాంపస్‌లో బీఫ్, గొర్రె, కల్లు తదితర ఉత్సవాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ధర్మాసనం జోక్యం చేసుకుని, ఎవరి ఇళ్లలో వారు వారికిష్టమైన ఆహారాన్ని ఎంపిక చేసుకోవడానికి అభ్యంతరం లేదని, కానీ విద్యార్థులు స్వార్ధశక్తుల చేతుల్లో ఆట వస్తువులు కారాదని పేర్కొంది. కోర్టు ఉత్తర్వులను విద్యార్థులు అమలు చేస్తారని ఆకాంక్షించింది. విద్యార్థుల చేతుల్లో దేశ భవిష్యత్ ఉందని, చట్టాన్ని ఉల్లంఘిస్తే చట్టం తన పనితాను చేసుకునిపోతుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ అంశంపై కోర్టు జోక్యం చేసుకోవడం వల్ల సమస్య జటిలమవుతుందని ఒక న్యాయవాది ప్రస్తావించగా, కేసు విచారణను ఈనెల 11కి వాయిదా వేశారు.