రాష్ట్రీయం

జల్లెడపడుతున్న ఎక్సైజ్ అధికార్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమండ్రి, డిసెంబర్ 8: విజయవాడ కల్తీ మద్యం దుర్ఘటన నేపథ్యంలో జిల్లాలోని బార్ అండ్ రెస్టారెంట్లు, మద్యం దుకాణాల్లో ఎక్సైజ్‌శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. విజయవాడలో కల్తీ మద్యం తాగి ఐదుగురు మృతి సంఘటన జరిగిన వెంటనే జిల్లాలో అప్రమత్తమైన అధికారులు సోమ, మంగళవారాల్లో బార్లు నడుస్తున్న తీరును పరిశీలించారు. జిల్లాలో 31బార్ అండ్ రెస్టారెంట్లు, 4త్రీ స్టార్ హోటళ్లు ఉన్నాయి. జిల్లాలోని దాదాపు అన్ని బార్లలోను ఎక్సైజ్ అధికారులు శాంపిల్స్‌ను సేకరించారు. బార్లలో మద్యంను బాటిళ్లతో అమ్మరు. కేవలం లూజుగానే అమ్ముతారు. అందువల్ల బార్లలోని లూజు బాటిళ్లలో ఉన్న మద్యం శాపిల్స్‌ను సేకరించి లోబొరేటరీలకు పంపుతున్నారు. విజయవాడలో జరిగిన సంఘటకు కారణమైన బ్రాండు, ఆ బ్యాచ్‌లోని మద్యం ఎక్కడ ఉందన్న అంశాలపై ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమతి పొందిన బ్రాండుతో కూడిన మద్యంను తాగటం వల్ల ఒక చోట మాత్రమే ప్రమాదం జరగదని, అదే బ్యాచ్‌లో తయారైన బ్రాండు మద్యం సరాఫరా అయిన అన్ని ప్రాంతాల్లోను, తాగిన వారు ఇబ్బందులు పడేవారని, కానీ అలాంటి పరిస్థితి రాష్ట్రంలో ఎక్కడా లేదని మద్యం వ్యాపారులు చెబుతున్నారు. బార్లలో మద్యం తాగేవారు వినియోగించే నీటిలో ఏదైనా తేడా ఉంటే ప్రమాదం సంభవించే అవకాశాలు ఉంటాయని, అందువల్ల మద్యంతో పాటు బార్లలో వినియోగించే నీరు విషయంలో కూడా తనిఖీలు జరగాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తీరప్రాంతాల్లో కల్తీ మద్యం లభిస్తోందన్న ఆరోపణలు రావటంతో, అలాంటి ప్రాంతాల్లో నిఘాను మరింత పెంచటంతో పాటు, తీర ప్రాంతాల్లో ఎక్సైజ్ తనిఖీలు మరింత ఉద్ధృతంగా సాగుతున్నాయి. రాష్ట్రంలో మద్యం దుకాణాలపై ఉన్నంత కఠిన నిబంధనలు బార్ అండ్ రెస్టారెంట్లపై లేవు. బార్ల విషయంలో విధాన నిర్ణయాన్ని తీసుకోవటంలోను, కాస్తంత కఠిన నిబంధనలను రూపొందించటంలోనూ రాష్ట్రప్రభుత్వం చాలా కాలంగా జాప్యం చేస్తోందన్న విమర్శలు ఉన్నాయి. మరోపక్క మద్యం దుకాణాల్లో విచ్చలవిడిగా లూజు అమ్మకాలు జరుగుతున్నా అధికార యంత్రాంగం చూసీచూడనట్టు వ్యవహరిస్తోందన్న విమర్శలు ఉన్నాయి. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే మద్యం తాగే వారి సంఖ్య గతం కన్నా బాగా పెరిగినట్టు తెలుస్తోంది. కొన్ని ప్రాంతాల్లోని దుకాణాల్లో అమ్మకాలు అంతగా ఉండవని మద్యం వ్యాపారులు భావిస్తే, ఇప్పుడవే దుకాణాల్లో అమ్మకాలు ఊహించినదాని కన్నా బాగా కనిపిస్తున్నాయి. గతం కన్నా ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది నిఘాను పెంచారు.

లంకభూముల ధరలకు రెక్కలు

గుంటూరు, డిసెంబర్ 8: రాజధాని అమరావతిలో లంకభూములను భూసమీకరణ ద్వారా సమీకరించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయటంతో భూముల ధరలు ఊపందుకున్నాయి. ప్రభుత్వం తీసుకుంటుందా, లేదా అనే సందిగ్ధంలో కొనసాగిన నేపథ్యంలో నోటిఫికేషన్ వెలువడటంతో అధికశాతం రైతులు అమ్ముకోవాలనే ఆలోచనలో పడ్డారు. తుళ్లూరు, తాడేపల్లి మండలాల్లోని రాయపూడిలో 1093 ఎకరాల లంకభూములకు నోటిఫికేషన్ విడుదలైంది. అలాగే వెంకటపాలెంలో 326 ఎకరాలు, మందడంలో 362 ఎకరాలు, ఉండవల్లిలో 162 ఎకరాలకు సంబంధించి భూసమీకరణ ద్వారా సేకరించేందుకు ప్రభుత్వం నెల రోజుల గడువునిచ్చింది. గడువులోపు 9.3 అంగీకార పత్రాలు అందజేసి తమ సమ్మతిని తెలియజేయాలని అధికారులు కోరారు. అదే సమయంలో రైతులు అంగీకరించని పక్షంలో 9.2 ఫారాన్ని అందజేయవచ్చునని అధికారులు ప్రకటించారు. గతంలో లంక భూములు ఎకరా 25 లక్షల రూపాయల ధర ఉందని రైతులు చెబుతున్నారు. గత రెండు రోజులుగా ధర 40 నుంచి 50 లక్షల రూపాయలకు చేరుకుంది. అయితే మరింత ధర పలుకుతుందనే ఆశతో రైతులు ఎదురుచూస్తున్నారు. అందువల్లనే భూసమీకరణ కింద భూములిచ్చేందుకు రైతులు ప్రస్తుతం ముందుకు రావటంలేదు. ఇంకా నెల రోజుల గడువు ఉన్నందున అఖరి నిముషం వరకు ఎదురు చూడాలనే ధోరణిలో కొనసాగుతున్నారు. ప్రభుత్వం మరింత గడువు పెంచుతుందనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. తాడేపల్లి మండలంలోని ఉండవల్లి రైతులు మాత్రం భూములిచ్చేందుకు సిద్ధంగా లేరు. పట్ట్భాములు కూడా ఎక్కువ మంది రైతులు ఇవ్వని విషయం తెలిసిందే. అదే విధంగా లంక భూములను కూడా ఇవ్వకూడదనే ధోరణిని ప్రదర్శిస్తున్నారు. 29 గ్రామాల్లో భూములు సమీకరించిన సమయంలో గడువును పెంచుతూ వెళ్లిన విధానాన్ని ఉదాహరణగా చూపిస్తున్నారు. లంకభూముల్లో సుమారు 260 ఎకరాల పట్ట్భామి ఉందని రైతులు వెల్లడిస్తున్నారు.