రాష్ట్రీయం

త్వరలో చెరకు రైతుల బకాయిల చెల్లింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 8: రాష్ట్రంలోని చెరకు రైతులకు సహకార, ప్రైవేట్ సుగర్ ఫ్యాక్టరీలు చెల్లించాల్సిన బకాయిలను నయాపైసాలతో సహా సత్వరం చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. సకాలంలో చెల్లింపులు జరక్కపోవటం వలన రాష్ట్రంలో చెరకు సాగు విస్తీర్ణం తగ్గుతుండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేసారు. 2005-06 సంవత్సరంలో 1.79 లక్షల హెక్టార్లలో చెరకు సాగు జరగ్గా 2014-15 నాటికి 1.11 లక్షల హెక్టార్లకు తగ్గిపోవటం ఆందోళనకరమైన పరిణామమన్నారు. అందుకే చెరకు సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు ప్రభుత్వపరంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. స్థానిక ప్రభుత్వ అతిథి గృహంలో మంగళవారం వివిధ సుగర్ ఫ్యాక్టరీల ప్రతినిధులు, రైతు సంఘాల నాయకులు, అధికారులతో మంత్రి పుల్లారావు సమావేశమయ్యారు. ప్రధానంగా చెరకు రైతులకు జరగాల్సిన చెల్లింపులపై చర్చించారు. ప్రైవేట్ పరిశ్రమల ద్వారా చెరకు కొనుగోలులో చెల్లింపుల విషయంలో ఆయా కంపెనీలు ద్వంద్వ వైఖరి విధానంలో బకాయిలను చూపుతున్నాయంటూ వాస్తవంగా ఎంత మొత్తంలో బకాయిలున్నాయో నివేదికలను అధికారులు నిర్ధారించాలన్నారు. చెరకు రైతుల సమస్యలను సిఎం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తామన్నారు. రైతులకు అందాల్సిన బకాయిల చెల్లింపుల విషయంలో ప్రత్యేక అధికారిని నియమిస్తామన్నారు. పొరుగు రాష్ట్రాలైన కర్ణాటకలో టన్నుకు రూ.2650 ధరను చెల్లిస్తూ అందుకు అదనంగా సాగుకు తోడ్పాటు అందిస్తున్నారని రైతులు తెలియజేసారు. బెల్లం పరిశ్రమకు విద్యుత్ సబ్సిడీ వ్యవసాయ రంగం విధానంలోనే అమలుచేయాలని కోరారు. గత మూడేళ్లుగా టన్ను బెల్లానికి రూ.2700 చెల్లిస్తున్నారని, ఆ మొత్తాన్ని రూ.3500కు పెంచాలని రైతులు కోరారు. చెరకు రైతులకు ఎన్‌సిఎస్ కంపెనీ రూ.13 కోట్లు, ఎంపి కంపెనీ రూ.5.46 కోట్లు, జెపి కంపెనీ రూ.13 కోట్ల మేర బకాయిలున్నాయని రైతులు మంత్రికి వివరించారు. ఎన్‌ఎస్‌సి, ఎంపి కంపెనీలు జనవరి 31లోగా, జెపి కంపెనీ ఈ నెల 26లోగా బకాయిలు పూర్తిగా చెల్లించాలని మంత్రి ఆదేశించారు. రప్రతి టన్నుకు రూ.60లు ఇనె్సంటివ్‌ను ప్రభుత్వం ద్వారా అందిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ కమిషనర్ ధనుంజయరెడ్డి, కోఆపరేటివ్ డైరక్టర్ ఎల్.మురళి, చెరకు రైతు ప్రతినిధులు ఎం.హరిబాబు, వై.కేశవరావు, కె.అప్పారావు, ఎం.శివసుబ్బారెడ్డి, కె.సాయివరప్రసాద్, పలు కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.