రాష్ట్రీయం

పదేళ్లలో చైనాను దాటేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 19: వచ్చే పదేళ్లలో భారతదేశం బలమైన ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవిస్తుందని రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యస్వామి అన్నారు. 2020-21 నాటికి భారత్ ఐదు ట్రిలియన్ డాలర్ల వృద్ధి సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 2030 నాటికి బలమైన ఆర్థిక శక్తిగా భారత్ అనే అంశంపై ప్రజ్ఞ్భారతి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక సదస్సులో ఆయన మాట్లాడారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుండి 1990 వరకూ భారత్ అంతగా అభివృద్ధి చెందలేదని, ప్రస్తుతం ఏడాదికి 3.5 శాతం మాత్రమే జీడీపీ వృద్ధి సాధిస్తోందని అన్నారు. దీనికి కారణం మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ అని ఆయన ఆరోపించారు. నెహ్రూ అవలంభించిన సోవియట్ ఆర్థిక విధానాల వల్లనే ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయని ఆయన చెప్పారు. పీవీ నరసింహారావు తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలతో ఆ సమయంలో ఏడాదికి 8 శాతం జీడీపీ వృద్ధి సాధించిందని సుబ్రమణ్యస్వామి గుర్తుచేశారు. అనంతరం ప్రధానిగా వచ్చిన మన్మోహన్‌సింగ్ కూడా దానిని కొనసాగించారని అన్నారు. అప్పటినుండి దేశ జీడీపీ వృద్ధి రేటు ఎప్పటికపుడు పెరుగుతూనే ఉందని ఆయన అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ సైతం ఆర్థిక సంస్కరణలు తీసుకొస్తున్నారని ఆయన కొనియాడారు. నిరుద్యోగం, పేదరికం నిర్మూలన వంటి వాటిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిందని ఆయన వివరించారు. ఏడాదికి పది శాతం వృద్ధితో వచ్చే పదేళ్లలో భారతదేశం చైనాను అధిగమిస్తుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. మన దేశంలో ఆంగ్లేయులు 71 ట్రిలియన్ డాలర్ల ఎకానమీని లూటీ చేశారని ఆయన పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక నెహ్రూ తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల దేశాభివృద్ధి ఆగిపోయిందని ఆయన పేర్కొన్నారు. సంస్కరణలకు ఆద్యుడు పీవీ నరసింహారావు అని ఆయన చెప్పారు. పీవీ నరసింహారావుకు భారతరత్న అవార్డు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. దేశంలో అవినీతి తగ్గాలంటే ఆదాయ పన్నును రద్దు చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. అపుడే దేశ జీడీపీ కూడా పెరుగుతుందనే సుబ్రమణ్యస్వామి అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతకుముందు ఆయన నగరంలో
నిర్వహించిన శివాజీ జయంత్యుత్సవాల్లో పాల్గొన్నారు. సుబ్రమణ్యస్వామి వెంట ఎమ్మెల్సీ ఎన్ రామచందర్‌రావు తదితరులున్నారు.
సెంట్రల్ యూనివర్శిటీలో గందరగోళం
సెంట్రల్ యూనివర్శిటీలో సీఏఏపై సుబ్రమణ్యస్వామి ప్రసంగిస్తున్నట్టు గందరగోళం ఏర్పడింది. ఏబీవీపీ నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి సుబ్రమణ్యస్వామి హాజరయ్యారు. ఇండియాలో పుట్టిన ముస్లిం మైనారిటీలకు సీఏఏ వ్యతిరేకం కాదని ఆయన అన్నారు. స్వాతంత్య్రం అనంతరం ఇతర దేశాల నుండి వచ్చిన 33వేల పైచిలుకు హిందువులకు తప్పకుండా ఇవ్వాలని అన్నారు. ఇండియాలో పుట్టి పెరిగిన ఏ ఒక్కరినీ తొలగించేది లేదని ఆయన చెప్పారు. సుబ్రమణ్యస్వామి మాట్లాడుతుండగా కొందరు సీఏఏకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో సమావేశంలో గందరగోళం ఏర్పడింది.

*చిత్రం... ప్రజ్ఞ్భారతి ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఒక కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి