రాష్ట్రీయం

నవంబర్ 23 నుంచి జాతీయ స్థాయి జూనియర్ అథ్లెట్ మీట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, అక్టోబర్ 22: కేంద్ర క్రీడల శాఖ సూచన మేరకు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎల్‌వి సుబ్రహ్మణ్యం ఆదేశాలతో జాతీయ అంతర్ జిల్లాల జూనియర్ అథ్లెట్ మీట్-2019ని నవంబర్ 23 నుంచి 25వ తేదీ వరకు తిరుపతిలో నిర్వహించాలని జిల్లా అధికారులకు శాప్ ఎండీ, చైర్మన్ కాటమనేని భాస్కర్ తెలిపారు. మంగళవారం స్థానిక శ్రీ పద్మావతి విశ్వవిద్యాలయంలోని సావేరి ఆడిటోరియంలో నిడ్జమ్-2019 ఏర్పాట్లపై ఆయన జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈసారి విశాఖ వేదికగా పోటీలు నిర్వహించాలని భావించినా, 2018, డిసెంబర్‌లో 1 నుంచి 3వ తేదీ వరకు జరిగిన నిడ్జమ్ విజయవంతం అయిన కారణంగా అందరి కోరిక మేరకు తిరిగి తిరుపతిని ఎంపిక చేసినట్లు తెలిపారు. క్రీడల నిర్వహణకు నిధుల విషయంలో ఇబ్బందులు లేవని గతంలోకన్నా ఘనంగా నిర్వహించేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉండాలని సూచించారు. మన రాష్ట్రానికి సంబంధించిన క్రీడాకారులకు సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్‌లో శిక్షణ ఇవ్వనున్నామని ఆయన తెలిపారు. 14-17 సంవత్సరాల్లోపు యువత తమ ప్రతిభ నిరూపించుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా మాట్లాడుతూ 28 రాష్ట్రాల నుంచి 4,500 మంది క్రీడాకారులకు ఆతిధ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. రవాణా, వసతి, రిసెప్షన్ సెంటర్లు, రేణిగుంట విమానాశ్రయం, రైల్వేస్టేషన్, తిరుపతి సీబీఎస్‌సీలలో ఏర్పాటు కమిటీల ఏర్పాటు, తారకరామ స్టేడియం వేదికగా క్రీడల నిర్వహణకు కావాల్సిన ట్రాక్‌లు ఆర్ అండ్ బితో ఏర్పాటు చేస్తామని చెప్పారు. నగరపాలక సంస్థ కమిషనర్ గిరీషా మాట్లాడుతూ గత నిడ్జమ్ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని క్రీడాకారులకు బస ప్రాంతాల్లో స్నానానికి వేడినీళ్లు, ఫిజియోథెరపీ, మెడికల్ టీమ్, భోజన వసతులు ఏర్పాటులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కార్యదర్శి వల్సన్ మాట్లాడుతూ 2018లో నిర్వహించిన దానికన్నా ఈసారి మరింత ఘనంగా నిర్వహించడానికి సహకరించాలని ఆయన అధికారులను కోరారు. జేసీ చంద్రవౌళి మాట్లాడుతూ 4500 మంది క్రీడాకారులకు అతిధ్యంకోసం 1500 మంది అధికారులు, సిబ్బంది, రవాణా సౌకర్యం కోసం బస్సుల ఏర్పాట్లు, క్రీడల సమయంలో వసతి పొందే విద్యాలయాలకు సెలవులు అవసరమని అన్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుని మరింత ఘనంగా నిర్వహిస్తామన్నారు. సమావేశం అనంతరం వారు నిడ్జమ్-2019 పోటీలకు వేదికైన ఎస్వీ తారకరామా క్రీడామైదానాన్ని పరిశీలించారు.