రాష్ట్రీయం

గుండెపోటుతో ఖమ్మం ఆర్టీసీ డ్రైవర్ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, అక్టోబర్ 20: ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న షేక్ ఖాజామియా(55) ఆదివారం వేకువఝామున గుండెపోటుతో మృతి చెందాడు. తమ న్యాయమైన కోర్కెలు ఆమోదించాలంటూ 15రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న నేపథ్యంలో సమస్యలు పరిష్కరించకపోగా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుండటంతో ఉద్యోగం పోతుందేమోననే మనస్తాపంతో ఆయన తీవ్ర ఆందోళనకు గురయ్యారని, దీంతో గుండెపోటుతో మరణించారని ఆర్టీసీ జేఏసీ నాయకులు, ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఖాజామియా మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని జగ్గయ్యపేటకు చెందిన ఖాజామియా ఇంటికి ఆర్టీసీ జేఏసీ నాయకులు వెళ్లి భౌతికకాయంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన ఆకస్మిక మృతి పట్ల జేఏసీ నాయకులు సుధాకర్, గడ్డం శ్రీను, సుబ్బారావు సంతాపం తెలిపారు.
చిట్యాలలో..
చిట్యాల: ఆర్టీసీ సమ్మెతో మనస్తాపానికి గురై గుండె పోటుతో నల్లగొండ జిల్లా చిట్యాలకు చెందిన ఉద్యోగి చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. సమ్మె కారణంగా ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలతో తీవ్ర ఆందోళనకు గురైన చిట్యాల పట్టణ కేంద్రానికి చెందిన గోసుకొండ మల్లయ్య నాలుగు రోజుల క్రితం గుండెపోటుతో ఆసుపత్రి పాలయ్యాడు. కుటుంబ సభ్యులు నార్కట్‌పల్లి కామినేని ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో హైద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. కోమాలోకి వెళ్ళిన మల్లయ్య మృత్యువుతో పోరాడి చివరికి శనివారం రాత్రి తుది శ్వాస విడిచాడు. కుటుంబ సభ్యులు మృతదేహన్ని చిట్యాలకు తీసుకువచ్చి ఆదివారం అంత్యక్రియలు చేశారు.