రాష్ట్రీయం

వైభవంగా శ్రీనివాస మహాయాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, అక్టోబర్ 17: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో గురువారం అష్టోత్తర శతకుండాత్మక శ్రీనివాస మహాయాగం వైభవంగా జరిగింది. ఉదయం 9 గంటలకు ప్రధాన కంకణభట్టర్ సీతారామాచార్యులు ఆధ్వర్యంలో కుంభారాధన, గోపూజ, ఉక్త హోమాలు నిర్వహించారు. అనంతరం శ్రీదేవి, భూదేవీ సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంలతో విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఖానస ఆగమ సలహాదారులు సుందరవరద భట్టాచార్యులు, మోహన రంగాచార్యులు, అనంతశయన దీక్షితులు, ఆలయ డిప్యూటీ ఈఓ యలప్ప, ఏఈఓ ధనంజయులు, ఆలయ ప్రధాన అర్చాకులు బాలాజీ రంగాచార్యులు, సూపరింటెండెంట్ చెంగల్రాయులు, టెంపుల్ ఇన్స్‌పెక్టర్ అనిల్ ఇతర అధికారులు పాల్గొన్నారు. శుక్రవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు గజపూజ, పూర్ణాహుతితో మహాయాగం ముగియనుంది.

*చిత్రాలు.. శ్రీనివాస మహా యాగం సందర్భంగా స్వామికి పూజలు చేస్తున్న టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్ దంపతులు
* యాగం చేస్తున్న రుత్విక్కులు