రాష్ట్రీయం

అంతరిక్షం ఎవరి సొత్తూ కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్బవరం, అక్టోబర్ 12: అంతరిక్షంలో ప్రపంచంలోని అనేక దేశాలు చేసే పరిశోధనలు,ప్రయోగాలు ప్రపంచ శాంతికి దోహదపడాలే గానీ వినాశనానికి కాకూడదని అంతరిక్షంలో ఆయుధాలు, అణుశక్తివ్యతిరేక ప్రపంచ సమగ్రాభివృద్ధి సంస్థ కార్యదర్శి బ్రూస్ గగ్నోన్ (్ఫ్లరిడా) అన్నారు. విశాఖ జిల్లా సబ్బవరం దామోదర సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం మూట్ కోర్టుహాల్‌లో అంతరిక్షంలో అగ్రరాజ్యాల పెత్తనం - ప్రపంచ సమగ్రాభివృద్ధి అనే అంశంపై ఏర్పాటు చేసిన రెండు రోజుల అంతర్జాతీయ సదస్సును ఆయన శనివారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సదస్సుకు సుమారు 20 జాతీయ, అంతర్జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల నుంచి ప్రతినిధులు హాజరుకాగా, అమెరికా, అమెరికా సంయుక్తరాష్ట్రాలు, యూకేల నుంచి 8 మంది వక్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంతరిక్షంలో శాంతి-పురోగతిపై బ్రూస్ గగ్నోన్ మాట్లాడుతూ శాస్త్ర, సాంకేతిక విద్యవల్ల ఎంత ప్రయోజనం ఉందో అంతే స్థాయిలో వినాశనానికి దారితీసే మార్గాలూ ఉంటాయని అభిప్రాయపడ్డారు. దాని వల్లనే అగ్రరాజ్యాలు అంతరిక్షంలో ఉన్న తమ శాటిలైట్‌ల ద్వారా ఇతర చిన్నదేశాల శాటిలైట్లను పేల్చివేసే సామర్థ్యం పెంపొందించుకుంటున్నారన్నారు. ఇదే పరిస్థితే కొనసాగితే అగ్రదేశాలు తమకు అనుకూలంగా లేని దేశాల సమాచార వ్యవస్థను సులువుగా నాశనం చేసే వీలుందన్నారు. ఇలాంటి పరిణామాలు మానవ మనుగడను దెబ్బతీయటంతోపాటు ప్రపంచ దేశాల వినాశనానికి దోహదం చేసినట్లు అవుతుందన్నారు. అందుకోసమే అంతరిక్షం ఎవరి సొత్తూ కాదని, అందరి ఆస్తి అని తెలియజెప్పేందుకు అన్నిదేశాలకు ప్రయోజనం చేకూర్చేవిధంగా చట్టాలు తయారు చేయాలని ఆయన సూచించారు. మరో అతిథి, డీఎస్‌ఎన్‌ఎల్‌యూ వ్యవస్థాపక రిజిస్ట్రార్,ప్రస్తుత నాగార్జున యూనివర్శిటీ ఆచార్యులు ఎ.సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఇలాంటి అంతర్జాతీయ సదస్సును ఏర్పాటు చేయటంతోపాటు బ్రూస్ గగ్నోన్ లాంటి వారిని ఆహ్వానించిన ఇక్కడి వర్శిటీ ఉపకులపతి సూర్యప్రకాశ్‌ను అభినందించారు. అంతరిక్ష చట్టం అభివృద్ధికి సంబంధించిన వివిధ ఒప్పందాలు, నియమాలు మొదలైన అంశాలను ఆయన ప్రస్తావించారు. అంతరిక్షం మొత్తం మానవాళికి సాధారణ వారసత్వమని, యుఎన్‌వో ఆమోదించిన చట్టాలను అగ్రరాజ్యాలు పాటించటం లేదన్న అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే చట్టాలకు భిన్నంగా ఏ దేశం లేదా వ్యక్తిప్రైవేట్ హక్కులు పొందలేరన్నారు. ప్రస్తుతం అంతరిక్షంలో12 వేలకు పైగా శాటిలైట్ లు ఉన్నాయని, అంతరిక్షంలో ఉపయోగపడని వ్యర్థ పదార్థాలతో నిండిపోయిందన్నారు. దీంతో భవిష్యత్‌లో ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రయోగించలేని దుస్థితి దాపురించిందన్నారు. అదే సమయంలో సైనికీకరించబడితే అది యుద్ధప్రాంతంగా మారే ప్రమాదం లేకపోలేదన్నారు.
దాని నుంచి తలెత్తే ఏ సమస్య అయినా మానవాళి నాశనానికి దారి తీస్తుందన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలు కలిసి బహుళ ధ్రువ ప్రపంచాన్ని సృష్టించాలి, బాహ్య అంతరిక్ష దోపిడీ చేస్తున్న సూపర్ శక్తుల కార్యకలాపాలను నియంత్రించాలన్నారు. ఆర్థిక, శాస్ర్తియ పరిణామాల కారణంగా ఈ విషయాల్లో భారత్ ప్రధాన పాత్ర పోషించాలని ఉద్ఘాటించారు. ఈ సదస్సుకు డీఎస్‌ఎన్‌ఎల్‌యూ ఉపకులపతి ఆచార్య సూర్యప్రకాశ్ స్వాగతం పలకగా సెమినార్ డైరెక్టర్ కె.అరుణ, రిజిస్ట్రార్ సి.మాణిక్యాలరావు, కోల్‌కతా నుంచి ఆచార్య సందీప్ భట్, భోపాల్ నుంచి రాఖాఆర్య తదితరులు పాల్గొన్నారు.
*చిత్రం...సదస్సులో మాట్లాడుతున్న అణుశక్తి వ్యతిరేక గ్లోబల్ నెట్‌వర్క్స్ కార్యదర్శి బ్రూస్ గగ్నోన్