రాష్ట్రీయం

ఇస్కాన్‌లో రాజుకుంటున్న స్ర్తి ఆచార్య వివాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, అక్టోబర్ 11: అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం (ఇస్కాన్) మహిళలను ఆచార్యులుగా అనుమతించాలని తీసుకుంటున్న నిర్ణయం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనిని మన దేశంలోని శ్రీవైష్ణవ ఆచార్యులు బహిరంగంగానే వ్యతిరేకిస్తూ ఇస్కాన్‌కు తమ అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా తెలియజేశారు. ఇస్కాన్‌లో స్ర్తి ఆచార్యుల వ్యవస్థకు ఆమోదముద్ర వేయాలని జరుగుతున్న ప్రయత్నాలపై తీవ్రస్థాయిలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఇది కొత్తవివాదానికి దారితీస్తోంది. ఈ విధానాన్ని ఇస్కాన్‌లో అమెరికాలో శ్రీకృష్ణుని భక్తుడిగా 33 సంవత్సరాలుగా కొనసాగుతున్న శ్రీకృష్ణ కీర్తి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అలాగే కొందరు భక్తుల్లో కూడా ఇలాంటి విధానాలు మంచికాదన్న వాదన వినిపిస్తోంది. అయితే స్ర్తి ఆచార్యులకు మంత్రోపదేశం చేసే విధానాన్ని అమల్లోకి తీసుకురావాలన్న అంశంపై ఇస్కాన్ ఇప్పటి వరకు ప్రకటించలేదు. కానీ ఎంతోకాలం గా స్ర్తి ఆచార్యులను మంత్ర ఉపదేశానికి నియమించాలనే ఇస్కాన్‌లో జరుగుతున్న అంశాన్ని కృష్ణకీర్తి వ్యతిరేకిస్తూ శుక్రవారం మీడియా ముందుకు రావడంతో భక్తులను అనుమానాలకు బలం చేకూరుతోంది. అయితే ఆ సంఘంలోని కొందరు సభ్యులతో పాటుగా కొందరు పీఠాధిపతులు కూడా ఇస్కాన్ తీసుకోనున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. మారుతున్న ఆధునిక సమాజంలో మహిళలకు భక్తిలోను, ఆచార్య స్థానంలోను ప్రాధాన్యత ఇవ్వాలన్న ఇస్కాన్ నిర్ణయం తీసుకోవడమే కాకుండా తిరుపతిలోని ఇస్కాన్ మందిరంలో శుక్రవారం ప్రారంభమై 17వ తేదీ వరకు జరుగనున్న గవర్నింగ్ బాడీ కమిషన్‌లో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. దీనిపై అమెరికాకు చెందిన కృష్ణ కీర్తి మహిళలను ఆచార్యులుగా అనుమతించడాన్ని శుక్రవారం ఒక ప్రకటనలో వ్యతిరేకించారు. ఇస్కాన్ తీసుకుంటున్న ఈ నిర్ణయాన్ని పలువురు శ్రీ వైష్ణవ ఆచార్యలు సైతం వ్యతిరేకిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. మంత్ర ఉపదేశానికి స్ర్తి దీక్షా గురువులను ఇస్కాన్ తీసుకున్న నిర్ణయం తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందన్న అనంతరాయ పీఠాధిపతులు ఆచార్య లక్ష్మీతాచరిత్ తెలియజేశారని అన్నారు. ఈ నిర్ణయంతో శిష్టాచార్యం పూర్తిగా నాశనం అవుతుందని, అవాంఛిత సంఘటనలకు దారితీస్తుందని కూడా ఇస్కాన్ వారికి తెలియజేశారన్నారు. ఇస్కాన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శ్రీరంగం నుంచి శ్రీరంగనాథ స్వామివారి ప్రధాన అర్చకులు మురళీధర భట్టు సైతం ఇది అశాస్ర్తియ నిర్ణయమే కాకుండా సనాతన ధర్మ ఆచార, అనుస్టానములకు వ్యతిరేకమని కూడా తన లేఖలో స్పషం చేశారన్నారు. కుంభకోణంలోని ఆచార్య రాజా, శ్రీరంగానికి చెందిన లక్ష్మీకుమార్ తాతాచార్యులు సైతం తమ వ్యతిరేక అభిప్రాయాలను తెలియజేశారని, సనాతన ధర్మాన్ని కాపాడేందుకు భగవంతునిచే పంపబడినది ఇస్కాన్‌గా పేర్కొన్నారని, ఇనీ స్ర్తిలను మంత్రోపదేశ గురువులుగా నియమించాలన్న ఆలోచన ఇస్కాన్ సంప్రదాయాలను, సనాతన ధర్మాని పాడుచేస్తుందని తెలియజేశారని ఆయన పేర్కొన్నారు.